మన వ్యవసాయం

Herbicides: కలుపు మందుల వాడకంలో సూచనలు

0
Herbicides
Herbicides

Herbicides: సిఫారసు చేసిన కలుపు మందులు, సరైన మోతాదులో, సరైన సమయంలో వాడాలి.
కలుపు మందులు ఉపయోగించినా, విత్తిన 25-30 రోజుల తర్వాత అంతరకృషి చేయుట సిఫారసు చేయడమైనది. ఆరుతడి పంటలలో కలుపు మందులను పిచికారి చేస్కోవడం మంచిది. వరి పొలంలో కలుపు మందులను ఇసుకతో కలిపి వెదజల్లుకోవచ్చు. ఉన్నపుడు కలుపు మందులు పిచికారి చేసినపుడు పొలంలో బాగా పదునుగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నపుడు, గాలి వేగం 20 కి.మీ కన్నా మించినునపుడు ఉన్నప్పుడు కలుపు మందులు చల్లరాదు. రోజులో ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పిచికారి చేసుకోవడం వలన ఆవిరి కాకుండా ఉంటుంది.

Herbicides

Herbicides

  • కలువు మందుల పిచికారీ తర్వాత స్ప్రేయర్ ను 3-4 సార్లు శుభ్రంగా కడగాలి.
  • కలుపు మందులను హ్యాండ్ స్ప్రేయర్ తో మాత్రమే పిచికారి చేయాలి. ఫ్లాట్ ఫ్యాన్ (మోలకేత్తక ముందు), సాలిడ్ కోన్ (మొలకెత్తిన తరువాత) నాజిల్ ని తప్పనిసరిగా వాడాలి.

Also Read: Mask for Glowing Skin: చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి దానిమ్మ మరియు నిమ్మకాయ ఫేస్ మాస్క్

  • కలుపు మందులను వేరే సస్యరక్షణ మందులతో మిళితం చేసి వాడరాదు.
  • కలుపు మందుల యొక్క విష ప్రభావానికి లోనైతే వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెల్లి ప్రథమ చికిత్స చేయించాలి.వెళ్ళే అపుడు వాడిన మందు డబ్బాను తిసుకెళితే, డాక్టర్ విరుగుడు మందును సులభంగా ఇస్తాడు. గ్లైపోసేట్, పారాక్వాట్ వంటి మందులు పిచికారి చేయునపుడు ఫ్లడ్ బెట్ నాజిల్ తో పిచికారి చేయడం మంచిది.
  • ప్రతి 10 లీ. ట్యాంక్ కు కలుపు మందుతో 200గ్రా. యూరియాను కలపి పిచికారి చేస్తే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కలుపు నివారణ కోసం ఎల్లప్పుడూ ఒకే రకం మందును వాడకూడదు. అలా చేస్తే కలుపు మొక్కలకు ఆ మందును తట్టుకునే శక్తిని పెంచుకూంటాయి.
  • ఖాళీ మందు డబ్బాలు, సీసాలు, కవర్లను వెంటనే కాలచాలి లేదా పాతి పెట్టాలి.
  • ఆహార పంటలపైన, పశువుల మేతకు పెంచే గడ్డి పైర్ల మీద కలుపు మందులు వాడినయడల, సూచించిన కాల పరిమితి తర్వాత మాత్రమే పైర్లు కోసుకోవాలి.
  • పురుగు మందులను మరియు కలుపు మందులను ఒకేదగ్గర నిల్వ చేయకూడదు.
  • కలుపు మందులు పిచికారి చేసేటప్పుడు వేరే పంట మొక్కల పై పడకుండా చూస్కోవాలి.
    కలుపు మొక్కలు వలన కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి. వాటిని ఆకుకూరగా, ఔషధాలుగా, పశుగ్రాసంగా, సేంద్రియ ఎరువుగా, కీటక నాశినులుగా ఉపయోగించవచ్చు. అలాంటి సందర్భంలో కలుపు ఒక సమస్యగా కాకుండా ఆదాయ వనరుగా మార్చవచ్చు.

Also Read: Israel Agri Technologies: ఇజ్రాయెల్‌లో వ్యవసాయం విజయవంతం కావడానికి కారణాలేంటి?

Leave Your Comments

Mask for Glowing Skin: చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి దానిమ్మ మరియు నిమ్మకాయ ఫేస్ మాస్క్

Previous article

PM Kisan Scheme: పీఎం కిసాన్ అనర్హులు తీసుకున్న డబ్బు వెనక్కి ఇవ్వాల్సిందే

Next article

You may also like