మత్స్య పరిశ్రమమన వ్యవసాయం

Fish Farming in India: కుంటలలో చేపలను వదిలిపెట్టే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

2
Fish Farming in India: తగిన పరిమాణంలో వుండే చిరుచేపలను (చేప విత్తనాలను-ఫిష్ సీడ్), కొత్త ఆవాసానికి అలవాటుపడేవిధంగా, వాటికి అనుకూలవాతావరణాన్ని కల్పించిన తర్వాత, ముందుగానే సిద్ధంచేసుకున్న చెరువులో / కుంటలో వదలాలి.
Fish Farming in India

Fish Farming in India

జాగ్రత్తలు:

  • అధిక దిగుబడి రావాలంటే, చేప పిల్లల సైజు, మరియు సంఖ్య ముఖ్యమైన అంశాలు. చేపల పెంపకం కోసం ప్రత్యేకించిన చెరువులు / కుంటలలో 100 మిల్లీ మీటర్ల పైగా పరిమాణం కలిగిన చిరుచేపలను వదలాలని సిఫారసు చేయడం జరిగింది.
  • ఇంతకంటె తక్కువ సైజువున్న చేపలను వదిలితే, పెంపకం మొదటి నెలలలో ఎక్కువచేపలు చనిపోవడానికి, పెరుగుదల తగ్గడానికి ఆస్కారం వుంది.
  • పాలీ కల్చర్ విధానాన్ని అనుసరించే చెరువులు / కుంటలలో 50-100 గ్రాముల సైజు చేపలను వదలడం మేలు. ఈ సైజు చేపలలో 90 % వరకు బతుకుతాయి, వాటి ఎదుగుదలకూడా బాగా వుంటుంది.
  • కార్ప్‌పాలీ కల్చర్‌లో సాధారణంగా, ఒకహెక్టారుకు విస్తీర్ణంగల చెరువులో 5,000 చిరుచేపలను వదులుతారు. దీనిద్వారా, ఏడాదికి 3-5 టన్నుల చేపల దిగుబడి వస్తుంది.
  • ఒకహెక్టారుకు , ఏడాదికి 5-8 టన్నుల దిగుబడికోసం 8,000-10,000 చిరుచేపలను వదలవలసి వుంటుంది. 10-15 టన్నుల దిగుబడి రావాలంటే, 15,000 నుంచి 25,000 చిరుచేపలు అవసరమవుతాయి.

Also Read: భారతీయ మత్స్య రంగాల్లో శాస్త్రీయ పద్ధతులు అవసరం: కేంద్ర మంత్రి పర్షోత్తం రూపాలా

Fish Farming

Fish Farming

  • కార్ప్ పాలీ కల్చర్‌లో , ఒక చెరువులోని వివిధ తలాలమధ్య అనగా పైభాగాన వుండే ఉపరితల జలాలు, మధ్య భాగంలోని జలాలు, అడుగున వుండే జలాలు మధ్య చేపపిల్లలకు ఆహారం విషయంలో ఏర్పడే పోటీని దృష్టిలో వుంచుకుని, వివిధ జాతుల చేపపిల్లలను తగిన నిష్పత్తిలో వదలవలసి వుంటుంది.
  • చెరువులోని వివిధ ప్రదేశాలలో లభ్యమయ్యే ఆహారం సక్రమంగా ఉపయోగపడడానికి వీలుగా, చెరువునీటిలోని వివిధ తలాలలో తిరుగాడే రెండు లేదా మరిన్ని జాతుల చేపలను వదలాలి.
  • మన దేశంలో కార్ప్ పాలీ కల్చర్ చేపల పెంపకం విషయంలో, కట్ల, సిల్వర్ కార్ప్, రోహు , గ్రాస్ కార్ప్ , మృగాల్ , కామన్ కార్ప్ అనే ఆరు జాతులను కలగలిపి పెంచడం ఆచరణీయమైన మిశ్రమంగా రుజువైంది. అయితే, ఏఏ జాతుల చేపల మిశ్రమాన్ని ఉపయోగించాలనేది చాలావరకు ఆయా జాతుల చిరుచేపల లభ్యతనుబట్టి, ఆ జాతి చేపలకు మార్కెట్లో వుండే డిమాండ్‌నుబట్టి నిర్ణయించుకోవలసి వుంటుంది.
  • ఈ ఆరు జాతులలో; కట్ల, సిల్వర్ కార్ప్ చెరువునీటి పైభాగంలోని (ఉపరితల) ఆహారాన్ని తినేవి; రోహుజాతి చెరువులో నిలువుగా పెరిగే లేదా వుండే ఆహారాన్ని తీసుకుంటుంది, గ్రాస్ కార్ప్ ఎక్కువగా చెరువులోని గడ్డి, ఆకు అలము మీదనే ఆధారపడే రకంకాగా; మృగాల్, కామన్ కార్ప్ జాతిచేపలు చెరువు అడుగుభాగంలోని ఆహారంపై ఆధారపడతాయి.
  • చెరువునుంచి ఆశించే ఉత్పత్తినిబట్టి, సాధారణంగా, ఉపరితల ఆహార జీవులైన కట్ల, సిల్వర్ కార్ప్ రకాలను 30-40 % , మధ్యభాగంలోని ఆహారాన్ని తినే రోహు , గ్రాస్ కార్ప్ రకాలను 30-35 % , చెరువు అడుగుభాగంలోని ఆహారంపై ఆధారపడే మృగాల్ , కామన్ కార్ప్ రకాలను 30-40 % కలగలిపి పెంచుతారు.

Also Read: ఆంధ్రా ఆక్వా ఉత్పత్తులకు అమెరికన్లు ఫిదా

Leave Your Comments

Sheep Transport: గొర్రెల రవాణా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Previous article

Importance of Ganja Farming: కోవిడ్ నివారణకు గంజాయి కీలకం- యునైటెడ్ స్టేట్స్ పరిశోధనలో వెల్లడి

Next article

You may also like