మన వ్యవసాయం

వరి కోతల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

0

వరిని సాగు చేయడం ఒక ఎత్తు అయితే కోతల సమయంలో కాపాడుకోవడం మరో ఎత్తు. వరి పైరు తూరిపోకుండా సరైన సమయంలో కోతలు చేపడితే దిగుబడి అధికంగా వస్తుంది. గతేడాది వరి కోతల సమయంలో అకాల వర్షాలు రైతులను వెంటాడాయి. దీంతో రైతులు నష్టపోయారు. కాల పరిమితిని బట్టి ఆయా రకాల వరి పంటలను సరైన సమయంలో కోతలు చేపట్టడంతో పాటు జాగ్రత్తలు తీసుకోవాలి.
వరి కోతకు వచ్చే 15 రోజుల ముందు నుంచే నీటి తడులను నిలిపి వేయాలి. తర్వాత పొలంలో కల్తీ గింజలు లేకుండా వేరు చేయాలి. చివరి గింజ తయారయ్యే వరకు పొలం కోయకూడదు. లేకుంటే తాలు వచ్చే ప్రమాదం ఉంది. తాలు ఎక్కువగా ఉంటే మార్కెట్ లో ధాన్యం అమ్ముకోవడం ఇబ్బందిగా మారుతుంది. మంచు ఆరిన తర్వాత పంట కోయాలి. మంచు ఉన్న సమయంలో కొస్తే గింజలు మెత్తబడి నలుపు రంగులో మారుతాయి. యంత్రాలతో కోసేటప్పుడు రైతులు జాగ్రత్తగా ఉండాలి. యంత్రం వెనుకకు వచ్చేటప్పుడు చూసుకోవాలి. లేకుంటే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. యంత్రం కోసే ముందు పొలం వరిగేను నివారించవచ్చు. సీడ్ ప్లాంటకు ధాన్యం ఇచ్చే రైతులు కల్తీ గింజలు లేకుండా చేసుకోవాలి.
ధాన్యం ఆరబెట్టేటప్పుడు పల్చగా పోయాలి. తద్వారా తొందరగా ఎండుతుంది. దీంతో తాటి పత్రులు కిరాయి తప్పుతుంది. ధాన్యం ఆరబోసిన తర్వాత రోజుకు కనీసం నాలుగు సార్లు దున్నాలి. లేదా రోజుకో సారి ధాన్యాన్ని తిరగబోయాలి. దీంతో అడుగున ఉన్న గింజలు మీదికి వచ్చి సమానంగా ఆరుతాయి. తేమ శాతం కూడా త్వరితగతిన తగ్గుతుంది. ధాన్యం ఆరబెట్టకపోతే గింజలు రంగు మారి నాణ్యత దెబ్బ తింటుంది. అదే విధంగా చెత్త, మట్టి, తేమ లేకుండా చూసుకోవాలి. తాలు ఎక్కువగా వస్తే గాలికి ఆరబోయాలి. తేమ 17 శాతం లోపు ఉంటేనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు. సన్నరకం ధాన్యాన్ని కొంత మంది రైతులు ఇండ్లలో నిల్వ చేసుకుంటారు. ఈ సమయంలో బస్తాలను నేల మీద కాకుండా చెక్క బల్లాలపై నిల్వ చేసుకుంటే ఎలుకల బారి నుంచి కాపాడుకోవచ్చు. ఎలుకల ఉధృతి ఎక్కువగా ఉంటే బస్తాలపై లీటరు నీటికి 5 మి. లీ. మలాథియాన్ మందును పిచికారీ చేయాలి.

Leave Your Comments

పంటలు సాగు చేయడంలో సరికొత్త వైవిధ్యాన్ని చాటుతున్న రైతులు..

Previous article

ప్రపంచంలోని అతిపెద్ద మామిడి పండు..

Next article

You may also like