Groundnut harvesting and Storage: ప్రస్తుతం మన రాష్ట్రంలో వేరుశనగ 17.91 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగుచేయబడుతూ 10.45 లక్షల టన్నుల కాయ దిగుబడినిస్తుంది. సగటు ఉత్పాదకత హెక్టారుకు 543 కిలోలు.
- కోసిన పంటను తగిన తేమ (9 శాతం) వచ్చే వరకు, మొక్క నుండి కాయలు వేరు చేయుటకు ముందు ఎండబెట్టాలి. ఇది రెండు విధాలుగా చేయవచ్చు. కాయలు పైభాగానికి వచ్చునట్లు వేరుశనగ మొక్కలను చిన్న చిన్న కుప్పలుగా వేయాలి లేదా మొక్కలను కర్రలకు కట్టి కాయలు ప్రక్కలకు వచ్చేటట్లు చేసి ఎండబెట్టవచ్చు.

Groundnut Pruning and Storage
- కాయలలో ఎక్కువ తేమ శాతం ఉంటే ఎండలో ఆరబెట్టకుండా తేమను 7-8 శాతానికి తీసుకు రావాలి. ఇందుకు గాను వేడిగాలిని వదిలే పరికరాన్ని ఉ పయోగించడం వలన కాయలను ఎక్కువ ఎండలో ఎండబెట్టకుండానే తేమను తగు శాతానికి తీసుకు రావచ్చును.
Also Read: Groundnut: వేరుశెనగ సాగు విధానం
- కాయలను కదిలిస్తే గల్లుమని శబ్దం వచ్చినప్పుడు కాయలు బాగా ఎండినట్లు అర్ధం. కాయలు పూర్తిగా ఎండక ముందే వర్షం వస్తే, వర్షం ఆగిన తర్వాత కాయలు మరల ఎండ బెట్టాలి. లేదంటే శిలీంధ్రం త్వరగా ఆశిస్తుంది.
- రబీ కాలంలో పీకేటప్పుడు వాతావరణ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు కాయలను నేరుగా ఎండలో ఆరబెట్టకూడదు. నీడలో ఆరబెట్టాలి లేదా ఎండ తీవ్రత ఉదయం 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల తర్వాత తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో అరబెట్టుకోవచ్చు.
- ఎండబెట్టేటప్పుడు వేరే రకాల కాయలు కలవకుండా చూసుకోవాలి. విత్తనం కోసం బాగా ముదిరిన కాయలను నిల్వ చేయాలి.
వేరుశనగ కాయలను నిల్వ ఉంచేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు :
- కాయలను నిల్వ చేయడానికి శుభ్రమైన లోపల పాలిథీన్ లైనింగ్ ఉన్న గోనె సంచులను వాడాలి. గోనె సంచులను 0.5 శాతం మలాథియాన్ ద్రావణంలో ముంచి బాగా ఆరబెట్టాలి. ఈ గోనె సంచులలో కాయలతో పాటు వేప ఆకులు గానీ, వేప గింజల పొడి గాని కలిపి నిల్వ ఉంచినప్పుడు పురుగుల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది.
- కాయలను నింపిన సంచులను గాలి, వెలుతురు బాగా ఉన్న గదిలో ఉంచాలి. బస్తాలను నేరుగా నేలపై పెట్టకుండా ఒక్క అడుగు ఎత్తు చెక్క బల్లలను పరిచి వాటి మీద మూటలను ఒకదానిపై ఒకటి 10 బస్తాల చొప్పున ఒక వరుసలో అమర్చాలి. వరుసకు వరుసకు మధ్య కొంచెం స్థలం వదలాలి.
- కాయలు ఎక్కువ కాలం మొలకెత్తే శక్తిని కోల్పోకుండా ఉండాలంటే నిల్వచేసే ఉష్ణోగ్రత తక్కువగా వుండాలి. గాలిలో తేమ 65-70 శాతం మధ్య ఉండాలి. దీని కంటే ఎక్కువగా ఉంటే శిలీంధ్రాలు అభివృద్ధి చెందుతాయి.
- కాయలను నెలకి ఒక్కసారి పరిశీలించి, పురుగు ఉధృతిని బట్టి క్రిమిసంహారక మందుల్లో ముఖ్యంగా మలాథియాన్ 5 మి.లీ. లేదా డైక్లోరోవాస్ 1 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి సంచులపైన, నిల్వ వుంచే గదులలోని -గోడలపైన పిచికారి చేయాలి.
Also Read: Ground Nut Early leaf Spot: వేరుశెనగలో తిక్కాకుమచ్ఛ తెగుళ్లు
Leave Your Comments