Paddy Cultivation: ప్రధాన మడిని వేసవిలో ఒకటి రెండుసార్లు దుక్కి దున్నుకొని, టీజర్ గైటెడ్ లెవలర్ చదును చేసుకో వలెను. లెవల్ బ్లేడ్ పొలమంతా సరిసమానంగా ఉండేలాగా జాగ్రత్త వహించాలి. నాటడానికి వారము నుంచి పది రోజులు ముందుగా ఒకసారి, నాటడానికి రెండు/మూడు రోజులు ముందుగా మరోసారి రోటవేటర్ తో దమ్ము చేసుకోవలెను. ఎక్కువసార్లు దమ్ము చేయడం వల్ల వరినాటు యంత్రం దిగబడిపోతుంది గ్రహించాలి. పొలం జారుగా లేకుండా బిగుతుగా ఉండేల చూసుకోవాలి. మట్టి పేరుకోక పోవడం నాటు నిలబడక పడిపోతుంది. నారుమడి నుంచి ట్రేలను ఒక గంట ముందుగా బెడ్ నుంచి తీసి గట్లమీద పెట్టుకో వలెను.
నీరు కారిపోవడం వల్ల ట్రేల బరువు తగ్గిపోయి, నాటుకు అనుకూలంగా వుంటుంది. నాట్లు చేస్తున్నప్పుడు యంత్రానికి మట్టి అంటుకోకుండా ఉండడానికి 1 నుండి 2 సెం. మీ. నీరు పలుచగా ఉంచాలి. వరి నాటు యంత్రాలతో సాలుకు సాలుకు మధ్య దూరం 30 సెం.మీ. వుంటుంది. మొక్కకు మొక్కకు మధ్య దూరం 12, 14, 16, 18, 21 సెం.మీ. వరకు యంత్రాలను బట్టి సరిచేసుకోవచ్చు. కుదురుకు 3-6 మొక్కలుండేలా నియంత్రించుకోవడానికి అవకాశము ఉంది.

Paddy Cultivation
Also Read: Disease Management in Paddy: వరిని ఆశించు తెగులు మరియు వాటి నివారణ.!
ఒక గంటలో ఎడరము నాటు వేయవచ్చు మరియు యంత్రాన్ని బట్టి గంటకు 3.0 నుండి 3.5 లీటరు డీజిల్ లేదా 1.0-4.5 లీటర్ల పెట్రోలు అవసరం. నాటు యంత్రములు ఒకేసారి 6 నుండి 8, వరుసలలో నాటు వేయును. ఒక ఎకరానికి 75 నుండి 80. ట్రేలు వాడుకోవాలి. నాటు వేశాక పొలంలో నీరు ఎక్కువగా ఉంటే తీసివేసి, పైరు పచ్చబడే వరకు పలుచగా నీరు ఉంచ వలెను. తర్వాత భూమి ఆరకుండా ఎల్లప్పుడూ పదునతో ఉండేలా జాగ్రత్త వహించాలి. కలుపు మరియు నీటి యాజమాన్యము మామూలు వరి లాగానే చెయ్యాలి.
వీడర్ వాడకం వల్ల వేరుకు బాగా 02 అంది పిలకలు బాగా వస్తాయి. పవర్ వీడర్ ద్వారా 2,0 నుండి 2,5 గంటలలో ఒక ఎకరంలో కలుపు నివారించవచ్చు. గంటకు సుమారుగా 1 లీటరు పెట్రోలు అవసరం.
రసాయన ఎరువులతో పాటు సేంద్రియ లేదా జీవన ఎరువులను వాడి, పైరుకు సమతుల్యంగా పోషక నేను చేసుకోవాలి పదార్థాలను అందజేయాలి. సీజను మరియు కాల పరిమితికి అనుగుణంగా పట్టికలో తెలిపిన విధంగా ఎకరాకు 48 నుండి 60 కిలోల వరకు నత్రజనిని, 24 కిలోల భాస్వరాన్ని, 20 కిలోల పొటాష్ ను వాడాలి. నత్రజనిని మూడు సమభాగాలుగా చేసి, నాటుకు ముందు దమ్ములోను, దుబ్బు చేసే దశలోను, అంకురం దశలో బురద పదునులో మాత్రమే సమానంగా వెదజల్లి, 36 నుండి 48 గంటల తర్వాత పలుచగా నీరు పెట్టాలి. మొత్తం భాస్వరం ఎరువును దమ్ములో వేయాలి. పొటాష్ ఎరువులను ఆఖరి దమ్ములో సగం, అంకురం ఏర్పడే దశలో మిగతా సగాన్ని వేయవలెను. కాంప్లెక్స్ ఎరువులను దుబ్బు లేదా అంకురం ఏర్పడే దశలో పైపాటుగా చేయకూడదు. దమ్ములో వాడుకోవచ్చును.
Also Read: Weed Management in Direct Seeded Paddy: నేరుగా విత్తిన వరి పొలంలో కలుపు యాజమాన్యం.!