దేశంలో అధిక శాతం ప్రజలు రోజూవారి జీవితంలో ఒక్కసారైనా గుడ్డును ఆహారంగా తీసుకుంటుంటారు. ఎందుకంటే అందులో ఉన్న పోషక విలువలు అలాంటివి. అంతెందుకు కరోనా సమయంలో కూడా వైద్యులు, నిపుణలు గుడ్లు బాగా తింటే మంచిదని సలహా ఇచ్చారు. గుడ్లలో ప్రధానంగా నాటుకోడి గుడ్లకు మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో రైతులు, నిరుద్యోగ యువత నాటుకోళ్ల పెంపకం వైపు దృష్టి చూపుతున్నారు.
వాటికి ప్రత్యేక వసుతులు కల్పించి భారీ స్థాయిలో కోళ్ల ఫారమ్ ఏర్పాటు చేసి.. పోషక విలువలున్న నాటుకోడి గుడ్లను ఉత్పతి చేస్తూ.. మంచి దిగుబడి రాణిస్తున్నారు. గుడ్లతో పాటు నాకుకోడి మాంసానికి కూడా మార్కెట్లో మంచి ధర పలుకుంది. ప్రస్తుతం కిలో నాటుకోడి మాంసం రూ.500 వరకు ఉంటుంది. ఒక్కోసారి 6వందలకు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇక నాటుకోడి గుడ్ల ధర విషయానికొస్తో 10 నుంచి 15 రూపాయల వరకు ధల పలుకుతుంది.
ఈ క్రమంలోనే వీటి పోషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. సాధారణంగా నాటుకోళ్లలో ఇమ్యునిటీ పవర్ బాగానే ఉంటుంది.. కాబట్టి, వీటికి వ్యాధుల సంక్రమణ తక్కువ. అయితే, వీటి పెంపకంలో గుడ్లను మంచిగా ఉత్పత్తి చేయాలంటే కొన్ని మెలకువలు పాటింటాల్సి ఉంది. సాధారణంగా కోళ్లను పెంచడానికి అందరూ షెడ్లను ఏర్పాటు చేస్తారు. అయితే నాటు కోళ్లను ఆరుబయటే తిరుగాడేలా ప్లేస్ ఏర్పాటు చేస్తే.. మంచి ఫలితాలు వస్తాయి. ఇవి గుడ్లు పెట్టడానికి ఎక్కువగా చీకటి ప్రదేశాన్ని ఎంచుకుంటాయి.
కాబట్టి షెడ్డులో కోడి గుడ్లు పెట్టడానికి అందుకు తగినట్లుగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. నాటు కోళ్లు పెంచుతున్న సమయంలో 8 పెట్ట కోళ్లకు ఒక పుంజు ఉండేలా చూసుకుంటే మంచింది. నాటుకోడి పెట్ట 5 నెలల తర్వాత గుడ్లు పెట్టడం మొదలుపెడుతుంది. అలా ఏడాదికి ఒక పెట్ట నాలుగైదు సార్లు గుడ్లు పెడుతుంది. అయితే గుడ్ల ఉత్పత్తి పెంచాలంటే.. పాత పద్దతుల్లో ఇంక్యుబేటర్ ఏర్పాటు చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇలా చేయడం వల్ల ఏడాదిలో ఏడు నుంచి ఎనిమిది సార్లు కోడి గుడ్లు పెట్టే అవకాశం ఉంది. ఇలా పెంపకంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు.. మంచి లాభాలు అర్జించొచ్చు.