ఉద్యానశోభమన వ్యవసాయం

Grafting Management: అంటు కట్టడంలో జాగ్రత్తలు.!

0
Grafting Management
Grafting Management

Grafting Management: అంటు కలయికలో వైఫల్యం (Graft incompatability) అంటు కట్టినపుడు వేరు మొక్క సయాను రకాల మధ్య సామరస్యం లోపించడం అనుకూలత లేక పోవటం వలన కలయికలో వివిధ రకాల వైఫల్యాలు ఏర్పడతాయి. కొన్నింటిలో ఒక వేళ మొదట్లో కలయిక సరిగా ఏర్పడినట్లు అనిపించి కాలక్రమంలో అది విఫలమై చెట్టు చనిపోతుంది.

Grafting Management

Grafting Management

Also Read: Grafting: అంటు మొక్కలు నాటే సమయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

అంటు కలయికలోని వైఫల్యాలు రెండు రకాలు, అవి:

స్థానాంతర్గత వైఫల్యం లేక కేంద్రీకృత వైఫల్యం (Localized incompatability) వేరు మొక్క కాండభాగము, సయాను కాండ భాగాన్నీ కలిపిన చోట కణజాలల మధ్య కలయిక సరిగా జరుగదు. ఈ రెండింటిని కప్పుతూమాధ్యమిక సయాను (Inter stock) వాడి ఈ వైఫల్యాన్ని అధికమించవచ్చు.

సంచలిత వైఫల్యము: (Translocated Incompatability); పోయం (Phloem) కణ విచ్చిత్తి వల్ల ముదురుగోధుమ రంగు (brown) చారలు ఏర్పడతాయి. కొన్ని విష పదార్ధాలు పోయం ద్వారా పయనించుట వలన ఈ వైఫల్యం కలుగుతుంది. మాధ్యమిక సయాను వాడటం ద్వారా కూడా ఈ వైఫల్యం కలుగుతుంది. మాధ్యమిక సయానూ ఇడటం ద్వారా కూడా ఈ వైఫల్యాన్ని నివారించలేము.

అంటు కలయిక వైఫల్య లక్షణాలు:

  1. వేరు మూలం సయాను మధ్య సరియైన కలయిక ఏర్పడదు..
  2. ఆకులు త్వరగా పసుపు రంగుకు మారి రాలిపోతాయి.
  3. చెట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది.
  4. నాటిన 1-2 సంవత్సరాలకే చెట్టు చనిపోతుంది.
  5. కలయిక స్థానం వద్ద అధిక కణజాలం పెరుగుదల ఉండి కాండం ఉబ్బెత్తుగా తయారవుతుంది. వేరు మూలం.

 అంటు కట్టడంలో జాగ్రత్తలు మరియు అంటు మొక్కల యాజమాన్యం:

  • అంటు కట్టడం కోసం చేసే గాటు ఒకే సారి నునుపుగా కత్తిరించాలి.
  • వేరు మూలం – సయానులను చక్కగా జత కూర్చి గాలి చొరబడకుండా, పాలిథీన్ రిబ్బను (150 మైక్రాన్లు) తో గట్టిగా బిగించి కట్టాలి.
  • అంటు కట్టిన వెంటనే నీరు పారించాలి. దీని వల్ల అంటు కలయిక బాగా / త్వరగా జరుగుతుంది.
  • తుంపర్ల ద్వారా నీరు యిచ్చేటట్లయితే గ్రాఫ్ట్ జాయింట్ వద్ద నీరు నిలబడకుండా శ్రద్ధ తీసుకోవాలి.
  • సయాను నుండి 2-3 క్రొత్త రెమ్మలు వచ్చాక వేరు మూలం తలభాగం ఏటవాలుగా కత్తిరించాలి.
  • మధ్య మధ్యలో వేరు మూలం పెంచిన పాలిథీన్ సంచులను నారుమడులలో స్థల మార్పిడి చేయాలి. దీని వలన వేరు మూలం భూమిలోకి చొచ్చుకుపోదు.

Also Read: Mango Grafting: మామిడిలో మొక్కల వ్యాప్తి ఎలా జరుగుతుంది.!

Leave Your Comments

PJTSAU Released High Yielding Varieties: పిజె టిఎస్ ఎయూ లో వివిధ పంటలకి చెందిన 54 కొత్త వంగడాలు విడుదల

Previous article

Rhizome Weevil in Banana: అరటి లో దుంప తొలుచు ముక్కుపురుగు యాజమాన్యం

Next article

You may also like