Weed management కలుపు మొక్కలు పంట మొక్కలతో సమానంగా భూమి, గాలి, వెలుతురు, నీరు, పోషక పదార్థాలతో పోటీపడి పంట మొక్కలకు చాల నష్టం కలుగచేస్తాయి. ఉద్యానవన పంటలలో కలుపు మొక్కల నివారణ అనేది పంట ఉత్పత్తిలో ప్రముఖ పాత్ర పోషించును. కలుపు వల్ల అధిక నష్టం జరుగుతూ ఎన్నో కోట్ల రూపాయలు వృధా అవుతున్నప్పటికి మనుము కలుపు మొక్కల నిర్మూలనను అశ్రద్ధ చేస్తున్నాము.
కలుపు మందుల వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు:
- స్ప్రేయర్ల నుండి మందు సమంగా వచ్చేటట్లు పిచికారి చేయాలి..
- ఎండ మరీ ఎక్కువగా ఉన్నపుడు అలాగే గాలి ఎక్కువగా వీస్తున్నపుడు గాలికి ఎదురుగా కలుపు మందులు పిచికారీ చేయరాదు. కనుక సాయంత్రం లేదా ఉదయం వేళల్లో గాలి తక్కువగా ఉన్నపుడు పిచికారి చేయడం మంచిది.
- కలుపు మందులు పురుగు మందుల వలె విషపూరితాలు కనుక వీటిని ఆహార పదార్థాలకు, పిల్లలను దూరంగా ఉంచాలి.
- పవర్ స్ప్రేయర్ తో కలుపు మందులు స్ప్రే చేయకూడదు.
- హ్యాండ్ స్ప్రేయర్తో మాత్రమే కలుపు మందును స్ప్రే చేయాలి.
- ఫ్టడ్కెట్ మరియు ఫ్లాట్ఫన్ నాజిల్తో కలుపు మందులను పిచికారీ చేయవలయును.
- బాగా పదునుగా వున్నప్పుడే కలుపు మందులు చల్లటం లాభదాయకంగా వుంటుంది.
- కనీసం 6 గంటలైనా వర్షం రాకుండా వున్న సమయంలోనే కలుపు మందులు చల్లాలి.
ఈ క్రింది అంశాలను ముఖ్యంగా పాటించవలె:
- సురక్షితమైన వస్త్రాలను వాడవలె.
- చల్లే జల్లునుంచి కాపాడుకోవలె.
- నోటితో నాజిల్ను శుభ్రం చేయటం ప్రమాదకరము.
- చల్లేటప్పుడు పొగ త్రాగరాదు.
- చల్లిన తరువాత కాళ్లు, చేతులు, ముఖము శుభ్రంగా కడుగుకొన్న తరువాతనే తినటం, మంచినీరు తాగటం మొదలయిన పనులు చేసుకొవలె
Leave Your Comments