మత్స్య పరిశ్రమమన వ్యవసాయం

Prawn Farming: రొయ్యల పెంపకంలో జాగ్రత్తలు

0

Prawn Farming: భారతదేశంలో రొయ్యల సాగు విస్తీర్ణం దాదాపు 160,000 హెక్టార్లు. ఒక సంవత్సరంలో అత్యధికంగా రొయ్యల ఉత్పత్తి 2019లో 805,000 MT. ఫోటో అనిల్ ఘనేకర్, ఎకోసెక్యూర్ సిస్టమ్స్. ఆగ్నేయ కోస్తా రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఆక్వాకల్చర్‌కు యాంకర్‌గా ఉంది.

Prawn Farming

Prawn Farming

మడ అటవీ ప్రాంతంలో రొయ్యల చెరువును ఏర్పాటుచేయ కూడదు

మడ అటవీ నీటి వనరులు పెక్కు ముఖ్యమైన చేప జాతులకు పుట్టినిళ్ళ లాంటివి , పెరుగుదల వసతి వంటివి.ఆ మట్టిలో, ఆ ప్రదేశంలో పోషకాలు కేంద్రీకృతం కావడానికి అవి తోడ్పడతాయి.తుపానులప్పుడు అవి రక్షణ కవచంలా పనిచేస్తాయి. అవి అనేక కాలుష్యాలను వడకట్టే, సహజ జీవ వడపోత వనరుల వంటివి.అందువల్ల మడ అటవీ ప్రాతంలో ఎట్టి పరిస్థితిలోకూడా రొయ్యల చెరువు నిర్మించకూడదు. అలా నిర్మిస్తే తీర ప్రాంత వాసులకు అవి ఎన్నెన్నో సమస్యలను సృష్టిస్తాయి.

నిషేధిత మందులను, రసాయనాలను, యాంటి బయోటిక్స్‌ను వాడవద్దు

సమతుల్యమైన పోషణ, చెరువు చక్కని నిర్వహణద్వారా రొయ్యలు ఆరోగ్యంగా ఎదిగేలా, ఎలాంటి జబ్బులు సోకకుండా వుండేలా శ్రద్ధ వహించాలి.చెరువు నిర్వహణలో నిర్లక్ష్యంవహించి,ఫలితంగా రొయ్యలకు జబ్బులుసోకి, వాటిని మందులతో, రసాయనాలతో, యాంటి బయోటిక్స్‌తో నయం చేయడంకంటె, ఈ ముందుజాగ్రత్త ఎంతైనా మేలు.ఈ మందులలో కొన్ని, రొయ్యల మాంసంలో పేరుకుపోయి, వాటిని తినే వినియోగదారులకు హానిచేసే ప్రమాదం వుంది.రొయ్యల పెంపకంలో యాంటి బయోటిక్స్ వాడకాన్ని పూర్తిగా నిషేధించడం జరిగింది. ఎట్టి పరిస్థితులలోకూడా వాటిని వాడకూడదు.

Also Read: ఆంధ్రా ఆక్వా ఉత్పత్తులకు అమెరికన్లు ఫిదా

Impact of Aqua Chemicals in Bangladesh Shrimp Farms and the Solution

Impact of Aqua Chemicals in Bangladesh Shrimp Farms and the Solution

అటవీ జలవనరులనుంచి రొయ్య పిల్లలను చెరువులో పెంపకానికి ఉపయోగించకూడదు

అటవీ జలవనరులనుంచి సేకరించిన రొయ్య పిల్లలను రొయ్యల చెరువులలో పెంచకూడదు.సహజ జలవనరులలోని ఫిన్ , షెల్ ఫిష్‌ల జీవ వైవిధ్యాన్ని ఇవి దెబ్బతీస్తాయి. ఇంతేకాదు, అటవీ జలవనరులలోని రొయ్యపిల్లలు వ్యాధులను వ్యాప్తిచేస్తాయికూడా. పెంపక కేంద్రాలనుంచి సేకరించి పెంచే ఆరోగ్యవంతమైన రొయ్య పిల్లలకు ఇవి వ్యాధులను సంక్రమింపజేస్తాయి.

వ్యవసాయ భూమిని చేపల చెరువుగా మార్చవద్దు 

వ్యవసాయ భూమిలో చేపల చెరువును ఏర్పాటుచేయవద్దు ; అలాచేయడాన్ని నిషేధించారు. తీరప్రాంత నిర్వహణ ప్రణాళికలను రూపొందించేటప్పుడు, వివిధ ప్రయోజనాలకు ఉపయోగపడే వివిధ భూముల రకాలను గుర్తించడంకోసం సమగ్రమైన సర్వే జరగాలి. వ్యవసాయానికి ఉపయోగపడని ఒకమోస్తరు భూమినిమాత్రమే రొయ్యల చెరువుల ఏర్పాటుకు కేటాయించాలి.

Prawn Farming in India

Prawn Farming in India

రొయ్యల చెరువులకు భూగర్భ జలాలను వాడవద్దు

తీర ప్రాంతాలలో భూగర్భ జలాలు ఎంతో విలువైన వనరు. ఆ నీటిని రొయ్యల చెరువులకు వాడవద్దు ; అది పూర్తిగా నిషేధం. రొయ్యల చెరువుల వల్ల కాలుష్యం ఏర్పడకుండా; భూమి, త్రాగునీటి వనరులు ఉప్పుబారకుండా కూడా జాగ్రత్త వహించాలి. తప్పనిసరిగా పాటించవలసిన ఒక ముందుజాగ్రత్త ఏమిటంటే- వ్యవసాయ భూములకు, గ్రామానికి, మంచినీటి బోరుబావులకు మధ్య తగినంత ఎడం వుండేలా శ్రద్ధ వహించాలి.

రొయ్యల చెరువులోని వ్యర్ధ జలాలను బహిరంగ నీటి వనరులలొకి నేరుగా వదలకూడదు

రొయ్యల చెరువులోని వ్యర్ధ జలాలను కాల్వలోకి, నదీ సంగమంలోకి, లేదా సముద్రంలోకి వదిలే ముందు వాటిని తగిన విధంగా శుద్ధిచేసి వదలాలి. వ్యర్ధ జలాల నాణ్యతకు సంబంధించి నిర్దేశించిన ప్రమాణాలను రొయ్యల చెరువుల నిర్వాహకులు విధిగా పాటించాలి. బహిరంగ నీటి వనరులు కలుషితంకాకుండా, నిర్దేశించిన ప్రమాణాల అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి.పెద్ద చెరువులకు (>0.50 హెక్టేర్లు) కాలుష్య శుద్ధి వ్యవస్థలను ఏర్పాటుచేసుకోవడం తప్పనిసరి.

Also Read: ఆక్వా హబ్ తో మత్స్య పరిశ్రమ అభివృద్ధి..

Leave Your Comments

Soil Testing Procedure: సత్వర మట్టి పరీక్షా విధానములో భాస్వరము కనుక్కొనె ప్రక్రియ

Previous article

Pig Farming: పందుల పెంపకంతో ప్రయోజనాలు

Next article

You may also like