మన వ్యవసాయం

Poultry farming: కోడి పిల్లల పెంపకం లో మెళుకువలు

0

మేత స్థలం (Feeding Space) :మొదట తెచ్చిన 2 – 3 రోజుల వరకు మేత తొట్టెలలో దాణా ఎక్కువ పెట్టాలి.

  • కోళ్ళ దాణా తినడం అలవాటు అయిన తరువాత దాణా తొట్టెలో సగం వరకు వేయాలి.
  • దీని వలన దాణా వృథా కాకుండా నివారించవచ్చును.
  • పత్రి కోడి పిల్లకు 4 సె.మీ మేత స్థలం ఉండేటట్లు చూడాలి.
  • మేత తొట్టెలు నేల పై నుండి 1 – 1.5 సె.మీ ఎత్తులో ఉండాలి.

నీటి స్థలము :

  • ఒక దినపు కోడిపిల్లలను హ్యాచరీ నుండి వచ్చిన తరువాత వీలైనంత వరకు త్వరగా నీళ్ళు పెట్టవలెను.
  • మొదట కోడిపిల్లలకు ప్లాస్టిక్ రకపు నీటి తొట్టెలలో నీరు పెట్టాలి.
  • రెండు వారాల తర్వాత ఈ నీటి తొట్టెలను మార్చి, వేరే నీటి తొట్టెలలో పెట్టాలి.
  • వాటి ముందు Grill ఉండేటట్లు చూడాలి.
  • ప్రతి కోడికి5 సె.మీ.ల నీటి స్థలం వుండేటట్లు చూడాలి.
  • ఈ నీటి తొట్టెలు నేలపైన 1- 1.50 మీ. ఎత్తులో ఉండాలి.
  • ఈ నీటి తొట్టెలు నేలపైన 1 – 1.5సె.మీ. ఎత్తులో ఉండాలి.

డీ బీకింగ్

  • కోడిపిల్లలకు 15 – 20 రోజుల వయస్సులో ముక్కు చివరలను డీబీకింగ్ పరికరంతో కత్తిరిస్తారు.
  • దీని వలన పిల్లలు ఒకదానికి ఒకటి పొడుచుకోకుండా నివారించవచ్చును.
  • కెనబాలిజమ్ అరికట్టవచ్చును. అంతే కాకుండా మేత వృథాకాకుండా నివారించవచ్చును.

Humidity:

  • Humidity మరీ ఎక్కువగా మరీ తక్కువగా ఉండకూడదు.
  • . Humidity ఎక్కువగా ఉంటే Coccidiosis కల్గును. తక్కువగా ఉంటే Dustiness కలుగును.
  • దీని వలన శ్వాసక్రియకు ఇబ్బందులు కల్గును మరియు ఈకల నిర్మాణము సరిగా ఉండదు.
  • ఈ దశలో కోళ్ళ పెంపకానికి కావాల్సిన Optimum Humidity 50 – 60 శాతం ఉండాలి.

గాలి ప్రసరణ ఆవశ్యకత :

  • ధుమ్ము. . తేమను షెడ్డులో నుండి నిర్మూలించుటకు.
  • శ్వాస వ్యాధులను అరికట్టుటకు.
  • ఆరోగ్య వాతావరణాన్ని ఇచ్చుటకు దీని వలన పిల్లల పెరుగుదల సమానంగా వుండును.
  • కోడిపిల్లలు షెడ్డులో గాలి సక్రమంగా వచ్చేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలి.
  • కోడిపిల్లలు షెడ్డులోని తేమ అమ్మోనియా వాయువులు బయటకు వెళ్ళి స్వచ్ఛమైన గాలి లోపలికి వచ్చేటట్లు క్రమాలు చేపట్టాలి.
  • షెడ్డు నందు గాలి ప్రసరణ ఉత్తర దక్షిణ డైరెక్షన్గా వుండాలి.
  • వాణిజ్య పరంగా పెంచే కోళ్ళకు 6 వారాల వయస్సు వరకు ఒక్కొక్కదానికి 700చ. సెం.మీ. నేల వైశాల్యం కావలసి ఉండును.
  • బ్రూడర్ క్రింద అయితే 40 చ.సెం.మీ. ఉండాలి.

 

Leave Your Comments

Chawki rearing: చాకీ పురుగుల పెంపకము ప్రాముఖ్యత

Previous article

Dairy animals: గిర్, సాహివాల్ జాతి పశువుల లక్షణాలు

Next article

You may also like