Post Harvest Management in Mango: మన రాష్ట్రంలో మామిడి షుమారుగా 7,64,495 ఎకరాల విస్తీర్ణంలో సాగుచేయబడుతూ 24,45,824 టన్నుల మామిడి పండ్లు ఉత్పత్తి చేయబడుతున్నది. మామిడిని ప్రధానంగా కృష్ణా, ఖమ్మం, విజయనగరం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, కరీంనగర్, విశాఖపట్నం, చిత్తూరు, కడప, అదిలాబాదు మరియు నల్లగొండ జిల్లాల్లో విస్తారంగా సాగుచేస్తున్నారు. మన దేశపు ఉత్పత్తిలో షుమారు 24 శాతం వాటా మన రాష్ట్రానిదే.

Post Harvest Management in Mango
Also Read: Soils in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ నేలల లక్షణాలు మరియు యాజమాన్య పద్ధతులు
గ్రేడింగ్:
పండ్లను, కూరగాయలను కోసిన అనంతరం నీడలో పెట్టాలి. దానిలో పిందెలు, వ్యాధి సోకిన మరియు కుళ్ళిన వాటిని వేరు చేయాలి. వేరు చేసిన తరువాత పండ్ల ఆకారం, పరిమాణం, రంగు, బరువును బట్టి యాంత్రికంగా గాని, మనుషుల చేతగాని వేరు చేయాలి.
చాలా దేశాలు కొన్ని స్వంత స్టాండర్డ్ లను కలిగి ఉండి వాటిని బట్టి గ్రేడింగ్ చేసి లోకల్ మార్కెట్కు గాని విదేశీ మార్కెటికి గాని పంపించి వర్తకం చేయుదురు.
ప్యాకింగ్:
గ్రేడింగ్ తరువాత పండ్లను ఆకులు, కొమ్మలు మొదలగు వాటిలో కప్పివేసి తూకం వేసి చిన్న చిన్నగా ప్యాక్ చేస్తారు. తరువాత ఈ చిన్న, చిన్న ప్యాకెట్లను పెద్ద గోనె సంచులో గాని, ఊలుతో తయారైన సంచిలలో గాని, వెదురు బుట్టలో గాని, గడ్డి బుట్ట, తాటిబుట్టలు, చెక్క పెట్టెలు, మట్టి కుండలు, ఫైబర్ కార్డ్ బోర్డలో, ప్లాస్టిక్ పెట్టెలలో గాని ప్యాకే చేయుదురు.
కొన్ని కూరగాయలు రవాణాకు తట్టుకోగలిగినవి. ఉదాహరణకు, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ మొదలగు వాటిని గోనెసంపలలో ప్యాక్ చేయుదురు. ద్రాక్ష పండ్లను చిన్న పెట్టెలలో ప్యాక్ చేస్తారు. ఆపిల్, మామిడి, సిట్రన్, సపోట, జామ మొదలగు వాటిని చెక్కి పెట్టెలలో ప్యాక్ చేయుదురు.
రవాణా :
రవాణాను ఎన్నుకునే ముందు పంపించే నరుకు యొక్క నిలువ సామర్థ్యం మరియు పంపించే దూరంను దృష్టిలో ఉంచుకోవాలి. తొందరగా పాడయ్యే వాటిని పొలంలోని వేడిని తగ్గించుటకు ప్యాక్ చేయక ముందు కొద్దిగా చల్ల పరిచి రవాణా చేయాలి. దీనికి గాను రైలు రవాణా కంటె రోడ్డు రవాణా ఉత్తమం.
లోకల్ మార్కెట్లకు ఎడ్లబండి, ట్రాక్టర్, ట్రక్కులు, ట్రాలీలు అందుబాటులో ఉన్న వాటిని ఉపయోగించి నెమ్మదిగా నడపాలి సరుకుకు నష్టం జరుగకుండా చూడాలి.
నిలువ చేయడం:
ఉల్లి మరియు అలుగడ్డను ఎక్కువ కాలం నిలువ ఉంచుతారు. మిగతా కూరగాయలు తక్కువ సమయం కొద్ది రోజులు లేదా కొద్ది వారాలు మాత్రమే నిలువ ఉంటాయి.
పండ్లు కూరగాయల నిలువకు తక్కువ ఉష్ణోగ్రత మరియు ఎక్కువ తేమ 95% అవసరం. ఉల్లి మరియు వెల్లుల్లి తక్కువ తేమ 70% అవసరం అలుగడ్డ మరియు ఉల్లిగడ్డను వివిధ పద్దతులలో నిలువ చేస్తారు. ఉల్లిని నీడలో ఆరబెట్టి మట్టి అంటుకుని ఉన్న యితర పదార్థాలను తీసి వేయాలి. కోతకు 15 రోజుల ముందు 20000 PPM మాలిక్ హైడ్రజైన్ను విచికారి చేసిన ఉల్లిని 8 నెలల వరకు మొలకెత్తకుండా నిల్వచేయవచ్చు. అలుగడ్డను శీతలీకరణ ద్వారా నిల్వ చేయవచ్చు.
Also Read: Equipment’s for Mango Harvesting: మామిడి కాయల్ని కోసే కొన్ని పరికరాలు