Pomegranate Fruit Borer: దానిమ్మ భారతదేశంలో పండించే ముఖ్యమైన పండ్ల పంట. ఇది ఇరాన్, స్పెయిన్, మొరాకో, ఈజిప్ట్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు బలూచిస్తాన్ వంటి మధ్యధరా దేశాలలో దానిమ్మ వ్యవసాయం పెద్ద ఎత్తున జరుగుతుంది. దానిమ్మ పర్షియా లేదా ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతదేశంలోకి ప్రవేశపెట్టబడింది. ఇది ప్రపంచంలోని ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల ప్రాంతాలలో ఇష్టమైన టేబుల్ ఫ్రూట్.

Pomegranate Fruit Borer
Also Read: Pomegranate Cultivation: డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీ ద్వారా దానిమ్మ సాగు
ఈ పండు టేబుల్ ఫ్రూట్‌గా ఉపయోగించడంతో పాటు దాని చల్లని మరియు రిఫ్రెష్ జ్యూస్ కోసం ఇష్టపడుతుంది.పండ్లు చక్కెరలు (14-16%), ఖనిజాలు (0.7-1.0%) మరియు ఐరన్ (0.3-0.7 mg/100 గ్రా.) యొక్క మంచి మూలం. A.P లో అనంతపురం, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ మరియు ఆదిలాబాద్ జిల్లాలలో పండిస్తారు. ఈ ఏడాది వాతావరణ మార్పుల కారణంగా దానిమ్మ తోటలకు భారీ నష్టం వాటిల్లింది
గుర్తింపు చిహ్నాలు :
- రెక్కల పురుగు మధ్యస్థ పరిమాణం కలిగి ఉండును.
- ఆడపురుగు గోధుమ నీలిరంగు కలిగి ముందుజత రెక్కలపైన నారింజరంగు మచ్చ వెనుకజత రెక్కలపైన నల్లటి మచ్చలు ఉండును.
- మగపురుగులు నీలిరంగులో ఉండును.
- లద్దెపురుగు నలుపు గోధుమరంగులో ఉండి శరీరంపై తెల్లటి మచ్చలు మరియు సన్నని వెంట్రుకలుండును.
గాయపర్చు విధానం మరియు గాయం లక్షణాలు :
- లద్దెపురుగు కాయలలోకి ప్రవేశించి లోపలి మెత్తటి భాగమును తినును. కాయపైన రంధ్రాన్ని పురుగు విసర్జించిన మలంతో కప్పి వేయును.
- ఈ రంధ్రాల ద్వారా బ్యాక్టీరియా, బూజు తెగుళ్ళు వ్యాపించి కాయలు క్రమేపి క్రుళ్ళి రాలిపోవును.
జీవితచక్రం :
- తల్లిపురుగు పూలపైన లేదా కాయలపైన గ్రుడ్లను ఒక్కొక్కటిగా పెడుతుంది. అవి 6-8 రోజులలో పొదుగును.
- లద్దెపురుగులు 30-40 రోజులు పెరిగి కాయలలోపలగాని, కాయకాడపైన గాని కోశస్థదశలో ప్రవేశించును.
- జీవితచక్రం 30-60 రోజులలో పొదుగును.

Fruit Borer in Pomegranate
నివారణ :
- కాయలను కాగితం లేదా పాలిథిన్ సంచితోగాని కప్పవలెను. దీనివల్ల గ్రుడ్లను పెట్టుట నివారించవచ్చు.
- చెట్టుపూత, మొగ్గ దశలో ఉన్నప్పుడు ఎండోసల్ఫాన్ 2ml/Lt కలిపి పిచికారి చేయాలి. ఆ తర్వాత 15-20 రోజుల తరువాత కార్బరిల్ 3gr/Lt పిచికారి చేయాలి.
Also Read: Pomegranate Farming: పిన్‌హోల్ బోరర్ వ్యాధి కారణంగా దానిమ్మ తోటకు తీవ్ర నష్టం