Turmeric Crop Cultivation: పసుపు దుంపజాతికి చెందిన ఉష్ట మండల పంట. తేమతో కూడిన వేడి వాతావరణం బాగా అనుకూలం. ప్రపంచంలో పసుపు ఉత్పత్తిలో అగ్రస్థానము భారతదేశానిదే. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో పసుపు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యం గా కృష్ణ, గుంటూరు, కడప జిల్లాలో అధికంగాను, కొంతమేరకు ఉభయ గోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో కూడా పండిస్తున్నారు. తెలంగాణ లో నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో పండిస్తున్నారు.
Also Read: Leaf spot in turmeric: పసుపు పంటలో ఆకు మచ్చ తెగులు నివారణ చర్యలు
విత్తనశుద్ది: ఎకరాకు 1000 కిలోల విత్తనం అవసరం. కొమ్ములను విత్తనంగా ఉపయోగిస్తారు. కొమ్ముల దిగుబడి దుంపల కన్నా ఎక్కువ. విత్తన్నాన్ని శుద్ధి చేసేటప్పుడు మొలక విరగకుండా జాగ్రత్త వహించాలి. దీనికి గాను కిలో విత్తతనానికి మాకోజెబ్ 3గ్రా. చొప్పున కలిపిన మందు ద్రావణంలో కొమ్ములను 40 నిముషాల పాటు ఉంచి తర్వాత తీసి నీడన ఆరబెట్టి నాటే ముందు జీవనియాతార్న పద్దతిలో
ట్రై కోడర్మా వీరిడి కిలో విత్తనానికి 10గ్రా చొప్పున కలిపి నాటుకోవాలి.
సస్యరక్షణ చర్యలు – తెగుళ్ళ నివారణ
దుంప కుళ్ళు తెగులు:
పొలంలో అక్కడక్కడ మొక్కలు వాడు మొఖం పట్టి పేలాగా ఉండి,మొక్కల మొదట ముదురు ఆకులు వాడి రాలిపోతాయి. మొక్క కాండంపై నీటిలో తడిచినట్లు మచ్చలు ఏర్పడతాయి. దుంపలు, కొమ్ములు, వేళ్ళు కుళ్ళి మొక్కలను లాగితే భూమట్టానికి ఊడివస్తుంది.
నివారణ:
- విత్తనశుద్ది తప్పనిసరిగా చేసుకోవాలి.
- ఎకరాకు కిలో ట్రైకోడర్మా మందును 80కిలోల పశువుల ఎరువు, 20కిలోల వేప పిండిలో వారం రోజులు వృద్ధి చేసి దుక్కిలో వేసుకోవాలి.
- వర్ష సూచన ఆదరంగా నీటి తడులు ఇవ్వాలి.
- తెగులు లక్షణాలు గమనించిన మొక్కకు దాని చుట్టూ ఉన్న వాటికీ లీటర్ నీటికి 1గ్రా. రిడోమిల్ యo. జ్ డ్ లేదా కెప్టెన్ 3గ్రా కలిపి మొక్క ళ్ళల్లో నేల తడిచేలా పోయాలి.
తాటాకు తెగులు: ఈ తెగులు సోకిన ఆకులపై అండాకారంలో గోధుమ రంగు మచ్చలు ఉండి, మచ్చల చుట్టూ పసుపు రంగు వలయం ఉంటుంది. ఆకు కాండంపై మచ్చలు ఏర్పడి క్రిందకు ఆకు వాలుతుంది.
నివారణ:
- తెగులు సోకి ఎండిన ఆకులను కత్తిరించి నాశనం చెయ్యాలి.
- విత్తనశుద్ది చెయ్యాలి.
- తర్వాత లీటర్ నీటికి 1గ్రా కార్బండిజం లేదా మొకోజీబ్ 2.5 గ్రా. కలిపి 15రోజుల వ్యవధి లో 4-5 సార్లు పిచికారీ చెయ్యాలీ.
ఆకు మచ్చ తెగులు: ఆకుపై మొదట చిన్న చిన్న పసుపు రంగు చుక్కలు ఏర్పడతాయి. తరువాత చిన్న చిన్న గోధుమ రంగులో మచ్చలుగా మారిపోతాయి. తెగులు ఎక్కువ అయ్యితే ఆకు మాడి పోతుంది.
నివారణ:
లీటరు నీటికి 1గ్రా. కార్బండిజం లేదా ప్రొపైకొనిజాల్ 15రోజులకు 2సార్లు పిచికారీ చెయ్యాలి.
విత్తన శుద్ది తప్పకుండ చెయ్యాలి.
పురుగులు:
దుంప ఈగ: ఈ పురుగు యొక్క పిల్ల పురుగులు తెల్లగా బియ్యం గింజల వలే ఉండి భూమిలో ఉన్న దుంప లోనికి చొచ్చుకొని పోయి దుంప కనజాలం దెబ్బ తింటుంది. పుచ్చు ఆశించిన దుంపలను వండితే తొర్ర మాదిరిగా కనిపిస్తుంది. ఈ పురుగు ఆశించడం వలన ఆకులు వాడిపోతాయి. మొక్కలో మొవ్వు సులువుగా ఊడి వస్తుంది.
నివారణ:
లీటరు నీటికి 2మిల్లి డైమీధోయేట్ కలిపి కొమ్ములను శుద్ది చేసి నాటుకోవాలి.
దుంప పుచ్చు లక్షణాలు కనపడగానే ఎకరాకు 100కిలోల వేప పిండిని పొలమoతా సమానంగా చల్లుకోవాలి.
వేపపిండి లేని పక్షములో ఎకరాకు 3జి గుళికలు 10కిలోల ఇసుకతో కలిపి పొలంలో చల్లాలి.
మొక్కల మధ్య నీరు నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
Also Read: Rhizome rot in turmeric: పసుపు పంటలో దుంప కుళ్ళు తెగులు నివారణ చర్యలు