మన వ్యవసాయం

పసుపులో వచ్చే తెగుళ్లు మరియు నివారణ చర్యలు

0
turmeric crop

ప్రస్తుతం ఉభయరాష్ట్రాలలో పసుపు పంటను సాగు చేస్తున్నారు. ఈ వానాకాలంలో వాతావరణంలోని మార్పులు, తుఫాన్ లు, వర్షాల వలన  పసుపు పంటలో చీడపీడలు, పోషక లోపా లక్షణాలు గుర్తించాము. కావున రైతులు తెగుళ్ళు , పురుగులు మరియు పోషక లోపా లక్షణాలు  గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నది.

  1. తెగుళ్ళు :

ఆకుమచ్చ తెగులు లక్షణాలు :

  • మొదటి ఆకులపైన చిన్న చిన్న పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి మచ్చలు తీవ్రమై ఆకు ఎండిపోతుంది.
  • అధిక తేమ కలిగిన వాతావరణంలో కనబడుతుంది.
Blight

Blight ( ఆకుమచ్చ తెగులు )

నివారణ : 

  • ప్రోఫికోనజేల్ 1 మిల్లీ. లీటర్ + సర్వు  5 గ్రా. ఒక లీటరు నీటికి కలిపి ఆకులపై పిచికారి చేసుకోవాలి.
  • ఒక గ్రామం కార్బండిజమ్ లేదా 5 గ్రాముల మాంకోజెబ్  + కార్బండిజమ్ మందును లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో ఆకులపై రెండుసార్లు పిచికారి చేయాలి.

Also Read : రబీ ఉలవలు సాగు – యాజమాన్యమ

తాటాకు మచ్చ తెగులు లక్షణాలు : –

  • మూడు గోధుమ రంగులో పెద్ద పెద్ద మచ్చలు ఆకులపై ఏర్పడతాయి.
  • అధిక తేమ కలిగిన వాతావరణంలో కనబడుతుంది.
Palm rot

Palm rot ( తాటాకు మచ్చ తెగులు )

నివారణ :

ఒక గ్రామం కార్బండిజమ్ లేదా 2.5 గ్రాముల (మాంక్యోజేబ్ + కార్బండిజం ) మందును లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు ఆకులపై పిచికారి చేయాలి.

 లక్షణాలు :

  • ఆకులు ఎండినట్లు ఉండి సులువుగా ఊడి రాలడంతో పాటు కుళ్ళిన వాసన వస్తుంది.
  • దుంపలు,కొమ్మలు కుళ్ళి,మెత్తబడి లోపల  పసుపురంగుకు  బదులు మట్టి రంగులో ఉండును.
  • మొక్కలను లాగితే భూమట్టానికి ఊడి వస్తాయి.
Beet rot

Beet rot ( దుంప కుళ్ళు)

నివారణ :

  • ఒక గ్రామం మెటల్ ఆక్సైడ్ + మాంకోజెబ్ లేదా 5 గ్రాముల (మాంకోజెబ్ + కార్బండిజమ్) మందును  లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్ళు తదిచేలాగా పిచికారి చేయాలి.
  • ఎకరానికి 2 కిలోల ట్రైకోడెర్మా జీవ నియంత్రకాలను మరియు  10 కిలోల వేప పిండిని 90 కిలోల పశువుల ఎరువులో వృద్ధి చేసి, మొక్క మొదళ్ళ భాగంలో వేసుకోవాలి.
  • ఎకరానికి 200 కిలోల వేప పిండి ఆఖరి దుక్కిలో వేసుకోవాలి.
  • అధిక వర్షం నీటిని తీసివేయాలి.

పురుగులు

పసుపులో ఆకు పురుగు ఎర్రనల్లి మరియు దుండు తొలుచు ఈగ ఆశించి తీవ్ర నష్టం చేయును. కావున ఈ క్రింది పురుగులను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవలెను.

పురుగులు :

Leaf worm

Leaf worm (ఆకు పురుగు )

ఆకు పురుగు :

  • ఈ పురుగు లార్వా ఆకులను కత్తిరించి వేస్తూ మడిచి దానిలోనే జీవిస్తూ ఆకులను తింటూ బతుకుతుంది.
  • ఈ పురుగు నివారణకు 1.6 మి.లీ లేదా మోనోక్రోటోఫాస్ లేదా  కార్బరిల్ 0. 1 శాతం ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి.

 ఎర్ర నల్లి లక్షణాలు :

  • తల్లి పిల్ల పురుగులు మొదట ఆకులు అడుగుభాగాన గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు వడిలిపోయి   రాలిపోతాయి.

నివారణ :

ఒక లీటర్ నీటిలో మూడు గ్రాముల నీటిలో కరిగే గంధకం లేదా 3 మిల్లీ.లీటర్ల  టైకోఫాల్ మందులతో సాండో విట్ 1 మిల్లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

దుంప తొలుచు ఈగ :

  • ఈ ఈగ పిల్ల పురుగులు తెల్ల రంగులో బియ్యం గింజ వలే ఉండి భూమిలో ఉన్న దుంపల్లోకి చొచ్చుకొనిపోయి దుంపను నాశనం చేస్తాయి.
  • ఈ పురుగు వల్ల సుడి ఆకు దాని దగ్గరలో ఉండే లేత ఆకులు వాడి గోధుమ రంగులో మారి ఎండి పోయి రాలిపోతాయి.

పుచ్చిన దుంపలో బియ్యపు గింజను పోలిన పురుగులు ఉంటాయి.

  • మువ్వును పీకినట్లయితే సుడిలాగా ఊడివస్తుంది.

 నివారణ :

ఈ పురుగు లక్షణాలు పొలంలో కనబడినప్పుడు ఎకరాకు 100  కిలోల వేపపిండిని మొక్క మధ్యలో వేయాలి. లేదా వేప పిండిని  వేయలేని సమయంలో  10 కిలోల కార్బో ప్యురాన్ 3 జి గుళికలను అదే పరిమాణం గల ఇసుక తో కలిపి ఒక ఎకరం పొలంలో సమపాళ్ళలో చల్లాలి.

స్థూల, సూక్ష్మ పోషకాల లోపాలు :

  • పసుపు పంటలో సరైన సమయంలో ఆఖరి దుక్కిలో, నేలలు ఆధారంగా వివిధ రకాల ఎరువులను పంట సమయంలో  వేయకపోవడం వలన పోషక లోపాలు ఏర్పడును.

పోషక లోప లక్షణాలు :

ఇనుప ధాతు లోప లక్షణాలు :

లేత ఆకులలో ఈనెల ఆకుపచ్చగా ఉండి మధ్య భాగం తెల్లగా ఉంటుంది.

 నివారణ :

5 గ్రా. ఫెర్రస్ సల్ఫేట్ మరియు ఒక గ్రా. నిమ్మఉప్పు లీటర్ నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.

పోటాష్ లోప లక్షణాలు :

  • ముదురు ఆకుల పైకి లేదా క్రిందికి తిరిగి ఉంటాయి.
  • ఆకులు అంచులు మాడిపోతాయి.
  • దుంపల ఎదుగుదల తగ్గుతుంది.
  • పండిన కొమ్మలపైన ముడతలు ఏర్పడతాయి.

 నివారణ :

  • 13-45-10 గ్రా. లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.
  • మురుగునీరు పోయే దాకా తీసుకోవాలి

3 . జింకు  ధాతు లోప లక్షణాలు : 

ఈనెల మధ్యభాగము లేత ఆకుపచ్చ లేదా పసుపు రంగులోకి మారడం గమనించవచ్చు.

నివారణ :

  •  2 గ్రాముల జింకు సల్ఫేట్ 5 గ్రా. సర్ఫు పొడిలో లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.

పైన చెప్పిన విధంగా పసుపు పంటలో తొలి దశలో తెగుల్లకు శిలీంద్ర నాశినిని మందులను, పురుగులకు కీటక నాశిని మందులను మరియు వివిధ పోషక లోపాలను గుర్తించిన వెంటనే పోషకాల మందులను సరియైన సమయంలో సరైన మోతాదులో కలుపుకొని పిచికారి చేసినట్లయితే పసుపు పంటలో  అధిక దిగుబడులను పొందవచ్చును.

డాక్టర్ కె విజయ భాస్కర్, సీనియర్ శాస్త్రవేత్త వ్యవసాయ స్థాయిపరిశోధనా స్థానం ,కరీంనగర్

 

Also Read : కందిలో తెగుళ్ళు – యాజమాన్యం

 

Leave Your Comments

పంట కొనమని మేము చెప్పలేదు కేసీఆర్…

Previous article

రైతుల సమస్యలు పార్లమెంటుకి పట్టవా..?

Next article

You may also like