Pests and Diseases in Groundnut:
- తిక్కా ఆకుమచ్చ తెగులు
తిక్కా ఆకు మచ్చ తెగులు రెండు రకాలు
A)ముందుగా వచ్చు ఆకుమచ్చ తెగులు
B)ఆలస్యంగా వచ్చు ఆకుమచ్చ తెగులు
A)ముందుగా వచ్చు ఆకుమచ్చ తెగులు
- ఈ వ్యాధి సెర్కొస్పోర అరాచిడికోలా అను శీలీంద్రం వల్ల వస్తుంది.
- వేరుశెనగ పైరుకు ముందుగా ఈ ఆకుమచ్చ తెగులు సోకుతుంది. కాబట్టి దీన్ని ముందుగా వచ్చు తెగులు అంటారు.
- ఈ తెగులు పైరుపై విత్తిన 30రోజుల తరువాత కనిపిస్తుంది. మొదట ఆకులపై చిన్న చిన్న మచ్చలు ఏర్పడతాయి. ఇవి పెరిగి 1-10 రౌండ్ గా ఉన్న గోధుమ రంగుగల నల్లటి మచ్చలు ఏర్పడతాయి.
- దీని వల్ల ఆకు అంత వ్యాపించి ఆకులు ఎండిపోతాయి. ఈ తెగులు ఆకు తొడిమ, కాండపు బాగాన్ని ఆశిస్తుంది.
- ఇది విత్తనాలలోను, పంట అవశేషాల్లోను జీవిస్తుంది. గాలి ద్వారా ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు వ్యాప్తి చెందుతుంది.

Pests and Diseases in Groundnut
Also Read: Groundnut Seed Selection: వేరుశనగ విత్తన ఎంపికలో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు.!
B)ఆలస్యంగా వచ్చు ఆకు మచ్చ తెగులు
- ఈ వ్యాధి సెర్కొస్పోర పార్సొరేటా అను శిలీంద్రం ద్వారా అభివృద్ధి చెందుతుంది.
- ఈ తెగులు పంట విత్తిన 40-45 రోజుల తర్వాత వేరుశెనగ పైరుపై , ఈ తెగుళ్ళ లక్షణాలు కనిపిస్తాయి.
ఆకులపై చిన్న చిన్న మచ్చలు ఏర్పడి అవి పెరిగి గుండ్రంగా మారి నలుపు లేదా ముదురు గోధుమ రంగుకి మారును. - ఆకు మొక్క అడుగు భాగానా శిలీంద్ర బీజం పెరుగుదల వలన నల్లటి మచ్చలు కనిపిస్తాయి.
ఈ ఆకు మచ్చ తెగులు వాతావరణంలో అధిక తేమ కలిగి ఉండి ఉష్ణోగ్రత 26-30 సెం.గ్రే ఉన్నప్పుడు మరియు వేరుశెనగ తర్వాత వేరుశెనగ వేసినప్పుడు ఈ తెగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది.
నివారణ
ఆరోగ్యవంతమైన విత్తనాన్ని ఎన్నుకోవాలి.
థైరమ్ లేదా కెప్టెన్ తో విత్తన శుద్ది చెయ్యాలి.
పంట కోసిన తర్వాత పొలంలో మిగిలిన చెత్త చెదారం ఏరి కాల్చి వెయ్యాలి.
ఈ వ్యాధి కనిపించిన వెంటనే మ్యాంకోజబ్ 0.25% లేదా క్యాబేండిజం0.1%కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చెయ్యాలి.
2. తుప్పు తెగులు
ఈ వ్యాధి పక్సినీయా అరచిడ్స్ అను శిలింద్రం ద్వారా వ్యాపిస్తుంది.
ఈ తెగులు మొదట ముదురు ఆకులపై కనిపిస్తుంది. ఆకులు అడుగు భాగాన్ని చిన్న చిన్న పసుపు లేదా గోధుమ రంగు బుడిపెలు లాంటి మచ్చలు ఏర్పడతాయి.
ఈ వ్యాధి లక్షణాలు ఆకు కాడ మరియు కాండంపై కూడా గమనించవచ్చు.
నివారణ
మ్యాకోజీబ్ 0.25% లేదా కాలిక్సిన్ 0.05 % కలిపి 10 రోజుల వ్యవధిలో 2సార్లు పిచికారీ చెయ్యాలి.
తెగులు తట్టుకునే రకాలను వేసుకోవాలి.
3. మొవ్వు కుళ్ళు తెగులు
ఈ వ్యాధి టమాటో స్పాటెడ్ విల్ట్ వైరస్ ద్వారా వ్యాపిస్తుంది.
ఈ వైరస్ త్రిప్స్ అనే కిటకాలు ఒక మొక్క నుండి మొక్కలు వ్యాప్తి చేస్తాయి.
వేరుశెనగ మొలకత్తిన తరువాత ఎప్పుడైనా ఈ తెగులు ఆశించవచ్చు.
పంట విత్తిన నెల రోజుల లోపు ఈ తెగులు ఆశించిన్నట్లు అయితే పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది.
మొక్క యొక్క ప్రధాన కాండం, మొవ్వు భాగం పాలిపోతాయి. తెగులు ఆశించిన తర్వాత ఆకులు చిన్నవి గా ఉంటాయి.
వ్యాధి మొక్క తొలి దశలో సోకినట్లు అయితే కాయలు ఏర్పడవు. ఒక వేళ కాయలు ఏర్పడితే గింజలు ముడతలు పడి వాటిలో మొలకెత్తే గుణం అనేది తగ్గిపోతుంది.
నివారణ
పొలంలో మొక్కల సాంద్రత తగ్గకుండా చూసుకోవాలి.
వ్యాధిని కొంత వరకు తట్టుకునే రకాలు సాగు చెయ్యాలి.
వేరుశెనగ పైరులో సజ్జను మిశ్రమ పంటగా వేస్తె ఈ తెగులు వ్యాప్తిని అరికట్టవచ్చు.
తెగులు సోకిన మొక్కలను పీకి కాల్చి వెయ్యాలి
పేనుబంక నివారణకై రోగర్ లేదా మోనోక్రోటోఫాస్ వంటి మందును పిచికారీ చెయ్యాలి.
Also Read: Seed Treatment in Groundnut: వేరుశనగలో విత్తనశుద్ధితో తెగుళ్ళకు చెక్