ఆకు మాడు తెగులు
ఈ వ్యాది ఎక్సరోహైలెం టార్సీకం అను శిలీంద్రం ద్వారా వ్యాప్తి చెందుతుంది
ఈ వ్యాధి సోకడం వలన గింజ మరియు చొప్ప నాణ్యత బాగా తగ్గిపోతుంది.
మొలక దశలో ఈ తెగులు సోకితే మొక్కలు గిడసబారి చనిపోవును.
ఆకులపై మచ్చలు ఎండు గడ్డి రంగులో ఉండి వాటి అంచులు ఇటుక లేదా ఎర్ర రంగులో ఉండును.
ఈ మచ్చలు పెరిగి పొడవుగా మారి మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకులు ఎండి పోయి రాలిపోవును.
గాలి లో 95% తేమ ఉండి ఉష్ణోగ్రత 23-27 ఉన్నపుడు ఈ వ్యాధి వృద్ధి చెందును.
నివారణ
తెగులు లేని పొలంలో నుండి విత్తనాల్ని సేకరించాలి.
పంట ఆవశేషాలను కలిచి వెయ్యాలి.
కెప్టెన్ 3గ్రా 1కిలో వితనాన్ని కలిపి శుద్ది చెయ్యాలి.
మాకోజీబ్ 0.025 % మందును 2సార్లు పిచికారీ చెయ్యాలి.
Also Read: Tobacco Harvesting Techniques: పొగాకు కోత మరియు పదును చేయడంలో మెళుకువలు.!
డౌనీ మీలేడ్యూ
ఈ తెగులు పెరనోకలేరోస్పోర సోర్గ్ అను శిలీంద్రం ద్వారా వ్యాపిస్తుంది
ఈ వ్యాధి లక్షణాలను ఆకులపై మరియు కంకిపై చూడవచ్చు.
నీరు ఇంకని భూములు ఈ వ్యాధి వృద్ధి కి బాగా అణువయినది.
ఈ వ్యాధి లక్షణాలు 3-4వ ఆకు దశ నుండి మొక్కలపై గమనించవచ్చు.
మొలక దశలో ఈ వ్యాధి సోకినట్లు అయితే మొక్కలు సామాన్యంగా 30 రోజులలోపు చనిపోవును.
వ్యాధి సోకిన కంకి మొత్తంగాని లేక సగం కానీ మాములు గింజలు పట్టకుండా పుప్పాల నుండి చిన్నటి గుండ్రని ఆకులు వచ్చును.
ఈ శిలీంద్రం విత్తనాలలోను, భూమిలోను, మరియు పంట పొలంల్లో గాలి ద్వారా ఒక మొక్క నుండి మరి ఒక మొక్కకు వ్యాప్తి చెందును.
ఏర్గాట్ తెగులు
ఈ తెగులు క్లావిసెప్స్ సోర్గ్ అను శిలింద్రం ద్వారా వ్యాప్తి చెందుతుంది.
వ్యాధి సోకిన గింజలు నుండి తెల్లని లేక లేత ఎరుపు రంగు జిగట లాంటి తియ్యటి ద్రవం చుక్కలు చుక్కలుగా బయటకు వస్తుంది.
దీనిలో శిలింద్ర బీజాలు ఉంటాయి.
దీని తరువాత వ్యాధి సోకిన గింజల్లో నల్లటి స్క్లారోటియ్లులు ఏర్పడును. దీనిని ఎర్గట్ దశ అంటారు
నివారణ
తెగులు సోకిన పొలంలో నుండి విత్తనాలు సేకరిచాలి.
విత్తనాలు 10% ఉప్పు ద్రావణం ల్లో ముంచి తేలిన స్క్రోషియాలను వేరు చేయాలి
వేసవి ల్లో లోతు దుక్కి చెయ్యాలి.
పొలం గట్లపై ఉన్న కలుపు మొక్కలను తీసివేయాలి.
పైరు పూత దశలో మాకోజీబ్ 2.5వృధా లేదా క్యాబేందిజ్మ్ 1గ్ర లీటర్ ను వారం వ్యవది ల్లో రెండు సార్లు పిచికారీ చెయ్యాలి.
కుంకుమ తెగులు
పక్కసినియా పరుపరియా అనే శిలేద్రం ద్వారా వ్యాప్తి చెందుతుంది.
ఆకుల అడుగు భాగం పై సన్నగా లేదా పసుపు నారిజా రంగు లో ఉండే బొబ్బలు వంటి మచ్చలు ఏర్పడతాయి.
తెగులు ఉధృతి ఎక్కువ అయ్యినప్పుడు ఆకు తోడిమాలు కూడా మచ్చలు ఏర్పడి తెగులు సోకిన మొక్కకు దూరంగా ముదురు గోధుమ రంగులో కనిపిస్తాయి.
చల్లని వాతావరణం, గాలిలో తేమ ఉన్నపుడు ఈ తెగులు సోకుతుంది.
యూరి డో సోర్స్ గాలి ద్వారా ఒక మొక్క నుండి వేరే మొక్కలు వ్యాప్తి చెడుతాయి.
నివారణ
పొలం గట్లపై గడ్డి జాతి కలుపు మొక్కల లేకుండా చూసుకోవాలి.
మాకాజెబ్ 2.5 గ్రా లీటర్ నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి.
కాటుక తెగులు
స్పైసిలోడిక సోర్గ్ అను శిలీంద్రం ద్వారా వ్యాప్తి చెందుతుంది.
ఈ తెగులు పైరు విత్తిన తర్వాత ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నపుడు ఆశిస్తుంది.
తెగులు సోకిన మొక్కలు గడసబారి వెన్ను తీసిన తరువాత తెగులు లక్షణాలు గుర్తించవచ్చు.
ఈ గింజలు పగిలి నల్లని శిలింద్ర బీజాలను బయటకి వెదజల్లుతాయి.
నివారణ
పంట మార్పిడి చెయ్యాలి.
ఆరోగ్యవంతమైన విత్తనాన్ని ఎన్నుకోవాలి.
కెప్టెన్ తో 4 గ్రా. 1కిలో విత్తనానికి కలిపి శుద్ది చేయాలి.
తెగులు సోకిన కంకులను పీకి కాల్చివెయ్యాలి.
పక్షి కన్ను తెగులు
కోలిటోట్రికమ్ గ్రామీమినికోలా అను శిలిద్రం ద్వారా వ్యాప్తి చెందుతుంది.
ఆకులపై చిన్న చిన్న గుండ్రని మచ్చలు ఏర్పడతాయి
ఈ శిలీంద్రం కాండము మరియు కంకి భాగం ల్లో వ్యాపించి వాటిని కుళ్ళినట్లుగా చేస్తోంది.
ఈ దశలో కంకి భాగంని నిలువు కోసినప్పుడు లోపల కంజాలం ఎరుపు రంగు లోకి మారి ఉంటుంది.
నివారణ
థైరాన్ లేదా కెప్టెన్ తో విత్తనశుద్ధి చెయ్యాలి.
గట్లపై ఉన్నటువంటి గడ్డి జాతి మొక్కలను తీసివేయాలి.
తెగులు గమనించిన వెంటనే మాకోజీబ్ 0.25ను 2సార్లు పిచికారీ చెయ్యాలి.
తెగులు తట్టుకొనే రాకలను ఎన్నుకోవాలి.
Also Read: Fusarium Wilt in Tomato: టమాట ఫ్యుసేరియం వడలు తెగులును ఇలా నివారించండి.!