Weed Menace in Agriculture: పంట దిగుబడి తగ్గుదల అనేది కలుపు మొక్కల పోటీతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటుంది. కలుపు మొక్కలు నీరు, కాంతి, పోషకాలు మరియు స్థలం కోసం పంట మొక్కలతో పోటీపడుతుంటాయి. కలుపు మొక్కలు పొడి భూమిలో నీటి కోసం మరియు నీటిపారుదల పంటలలో పోషకాల కోసం పోటీపడతాయి. సాధారణంగా కలుపు రెండు వారాల వయస్సు తర్వాత పంట దిగుబడి మరియు ఉత్పత్తి సామర్థ్యం తగ్గిస్తుంది. ఆరుతడి వ్యవసాయంలో కలుపు మొక్కలు తీవ్రమైన తేమ ఒత్తిడిని కలిగిస్తాయి మరియు పంట మొక్కల ఆహారాన్ని బలవంతంగా దోచేస్తాయి. దీని కారణంగా గింజలు ముడుచుకుపోతాయి. కలుపు మొక్కలు వాటి వేర్ల ద్వారా, కాండం ద్వారా ఉత్పత్తి చేసే రసాయనాల ద్వారా పంట మొక్కలపై హానికరమైన ప్రభావాన్ని చూపుతాయి.
పంట తెగుళ్లు మరియు వ్యాధులకు ప్రత్యామ్నాయ హోస్ట్‌గా కలుపు మొక్కలు ఉంటాయి. పంట లేనపుడు తెగుళ్లు మరియు వ్యాధులకు కారణమైన సూక్ష్మ జీవులు, కీటకాలు కాలు పైన జీవించి పంట వేసినపుడు తిరిగి ఆశిస్తాయి. కలుపు పొలాల నిర్వహణ ఖర్చు పెంచుతాయి. ఆలాగే పంటలో కలుపు తీసే కార్మిక ఖర్చు పెరుగుతుంది. కలుపు మొక్కలు అనేక విధాలుగా వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతను తగ్గించవచ్చు. పశువుల పెంపకంలో మరియు మానవ ఆరోగ్యానికి కూడా కలుపు ముప్పు ఉంది.ఇవి ఆస్తమా మరియు చర్మ వ్యాధులను కలుగ చేస్తుంది. భూమి విలువ తగ్గింపుకు కారణమవుతుంది. కాలువలలో కలుపు మొక్కల పెరుగుదల నీటి ప్రవాహాన్ని తగ్గిస్తుంది మరియు మురుగు నీటి నిల్వ సమస్యలకు కారణమవుతుంది. నీటిలో ఉండే కలుపు మొక్కలు నీటి వనరులను కలుషితం చేస్తుంది.
Also Read: Analysis on Good Prices of Dried Chillies: ఈ ఏడాది ఎండుమిర్చికి మంచి ధరలకు కారణాలు ఒక విశ్లేషణ.!
భారీ కలుపు ముట్టడి వలన కొన్ని ఆర్థికంగా ముఖ్యమైన పంటలైన పప్పుధాన్యాలు, కూరగాయలు, పత్తి, జనపనార మరియు మేత పంటలు వినియోగానికి పనికిరావు లేదా వాటి నాణ్యత కూడా తగ్గవచ్చు. కలుపు మొక్కలు మనుషులకు ప్రాణాంతకమైన కీటకాలకు నివాసంగా పని చేస్తుంది. కలుపు మొక్కల యొక్క ప్రయోజనకరమైన ప్రభావాలు లేదా కలుపు మొక్కల ఆర్థిక ఉపయోగాలు కూడా ఉన్నాయి.
1. మేతగా ఉపయోగించబడుతుంది Ex. బెర్ముడా గడ్డి
2. పచ్చిరొట్ట ఎరువు Ex. ఇపోమియా, కలోట్రోపిస్ మరియు టెప్రోసియా
3. ఔషధ విలువ ఉదా. తులసి
4. తాళ్లు మరియు గడ్డి బోర్డుల తయారీకి ఉపయోగిస్తారు. ఉదా. టైఫా మరియు సకారం
5. వాసన మరియు రుచి కోసం ఉపయోగిస్తారు Ex. చికోరియం
6. పేపర్ పరిశ్రమలలో వాడతారు ఉదా. జలగ
7. పంటల పెంపకంలో ఉపయోగిస్తారు
8. కొన్ని ప్రయోజనకరమైన కీటకాలకు పుప్పొడిని ఆహారంగా అందిస్తుంది.
9. వేటాడే జంతువులకు ప్రత్యామ్నాయ అతిధేయిగా వ్యవహరిస్తుంది.
10. క్షార నేలల పునరుద్ధరణ కోసం (అర్జెమోన్ మెక్సికానా) ఉత్తమమైనది.
Also Read: Procedures for Fish Storing: చేపలను పట్టుబడి చేసిన తరువాత నిల్వ చేయు విధానాలు.!