Weed Management Practices: కలుపు నివారణ మూడు రకాలు:
కలుపు వ్యాప్తి నిరోధక పద్ధతులు (PREVENTION): ఇతర ప్రాంతాలనుండి కలుపు మొక్కలు/ విత్తనాలు రాకుకండా చూచుకొనుట, పంట విత్తనాలలో కలుపు విత్తనాలు లేకుండా చూడటం,బాగా చివికిన పశువుల ఎరువు నే వాడాలి. వ్యవసాయ పరికరాలతో కలుపు మొక్కలు, విత్తనం వ్యాప్తి కాకుండా చూడాలి.పంట కాల్వలు, మురుగు కాల్వల గట్ల మీద సాధ్యమైనంత వరకు కలుపు మొక్కలు లేకుండా చూడాలి.
కలుపు మొక్కల నిర్మూలనా పధ్ధతి (ERADICATION): కలుపును పూర్తిగా నిర్మూలించడం చాల దుర్లభమైన పని.అతి తక్కువ వైశాల్యాల లో చేయవచ్చు.
నివారణా పద్ధతి (CONTROL): వేసిన పంట మొక్కలకు కలుపు మొక్కల నుండి పోటీ లేకుండా చేయుటకు తాత్కాలికం గా కలుపు మొక్కలను తీసివేయుటను ‘నివారణా పధ్ధతి’ అంటారు పంట మొక్కలు పెద్దవయి కలుపు నుండి పోటీ తట్టుకునే స్థితి కి వచ్చే లోపు గా కనీసం రెండు సార్లు కలుపు ను నివారించాలి.
కలుపు నివారణా పద్దతులు:
భౌతిక లేక యాంత్రిక పద్ధతి: మనుషులచే కలుపు తీయించుటనాగలి, గొర్రు, గుంటకల తో నేలను కలుపు లేకుండా దున్ని పంట వేయుట పంట ఒక దశకు పెరిగిన తర్వాత నాగలి, గొర్రు, గుంతకలతో ఎడ సీద్యం (అంతర కృషి) చేయుట. కలుపు మొక్కలను విత్తనం తయారు కాకముందే తీసివేయాలి. కలుపు మొక్కలు తీసిన వెంటనే పంట పొలం నుండి తీసివేసి విత్తనం తయారవక పొతే కంపోస్టు గుంత లో వేసి కృళ్ళే టట్లు చేసి సేంద్రియ పదార్ధం గా వాడవచ్చు.ఎండు గడ్డి, నల్ల పాలిథీస్ కాగితం తదితర పదార్థాలను నేలపై కప్పి సూర్య రశ్మి మొక్కలపై పడకుండా చేయడం వల్ల కలుపు ఎదగకుండా చేయవచ్చు ( దీనికి మల్చింగ్ అంటారు).
Also Read: Vegetables Role in Human Nutrition: మానవ పోషకాహారంలో కూరగాయల ప్రాముఖ్యత.!
యాజమాన్య పద్ధతులు: పంట మార్పిడి,సరైన సమయం లో విత్తుట / పంట నాటుట,తగినంత మోతాదు లో విత్తనం వాడుట, ఆయా ప్రాంతాలకు అనువైన వంగడాలను వాడుట,కలుపు మొక్కలను తట్టుకోగల పైర్లను ఎన్నుకొనుట (ఉదా: మొక్కజొన్న, చిరుదాన్యాలు, ప్రొద్దు తిరుగుడు పువ్వు,అలసంద, పిల్లి పెసర, జనుము మొదలైనవి).
కొన్ని కలుపు మొక్కలు కొన్ని పైర్లలో తప్పని సరిగా మొలుస్తూ ఉంటాయి. (ఉదా: జొన్నలో జొన్న మల్లె, పొగాకులో పొగమల్లె) కాబట్టి అట్టి పరిస్థితులలో పంట మార్పిడి ఆచరించి ఆ కలుపు మొక్కలు రాకుండా చేయవచ్చు. అదే విధంగా తుంగ, గరిక ఉన్న పొలాల్లో పశుగ్రాస పైరులను (జనుము, జొన్న) ఒత్తుగా విత్తినచో కలుపు ను కొంత వరకు నిర్మూలించవచ్చు.)
బయోలాజికల్ పద్ధతి: ఈ పద్ధతిలో జీవ రాశులను ఉపయోగించి కలుపు మొక్కలను నిర్మూలించ వచ్చు. కొన్ని రకాల పురుగులు కలుపు మొక్కలను మాత్రమే తిని జీవిస్తాయి. ఇతర పైరు మొక్కలను ఆశించ నందువల్ల వీటిని సురక్షితం గా ఆయ కలుపు మొక్కల నిర్మూలనకు ఉపయోగించ వచ్చు.
ఉదా: నాగజెముడు మీద వచ్చు పొలుసు పురుగు వాడుట,గుర్రపుడెక్క నిర్మూలనకు “నియోకేటినా ఐకార్నియా” వాడుట,సాల్వేనియా అనే నీటి కలుపు మొక్క ను “కైటో బెగాస్ సింగులారీస్” అనే పురుగు వాడుట, పార్టీనియం కలుపు మొక్క ను నిర్మూలించుటకు “జైగోగ్రామా బైకాలరేటా” అనే పురుగు ను ఉపయోగించి, కసివింద అనే కలుపు మొక్కల నుండి వచ్చు “కొలైన్స్” అనే పదార్ధము పార్టీనియం మొక్కల వేళ్ళ ద్వారా ప్రవేశించి దాని బీజోత్పత్తి శక్తిని, పెరుగుదలను తగ్గిస్తుంది.
Also Read: Onion Juice Health Benefits: ఉల్లి రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు.!