చీడపీడల యాజమాన్యం

Weed Management in Orchards: పండ్ల తోటలలో కలుపు నిర్మూలన.!

0
Weed Management in Orchards
Weed Management in Orchards

Weed Management in Orchards: యాజమాన్య పద్ధతులు: తొలకరిలో మొక్కల మధ్య లోతుగా దున్నీ అన్ని రకాల మొక్కలను వేళ్ళతో సహా నిర్మూలించాలి. అవసరమైతే దున్నిన తర్వాత బహువార్షిక మొక్కలు దుంపలు, కాండపు ముక్కలను ఎరి వేస్తె ఇంకా మంచిది. లోతు దుక్కి కలుపు నిర్మూలనకే కాక వర్షపు నీరు భూమి పొలంలోనికి ఇంకటానికి కూడా ఉపయోగపడుతుంది.

మరలా వర్షాలు ఆగిపోయేముందు మళ్ళీ ఒకసారి మెత్తగా దున్నితే వర్షాలకు తిరిగి మొలకెత్తిన కలుపు మొక్కలు, చిగురించిన బహు వార్షిక కలుపు మొక్కలను చాలా వరకు నిర్మూలించవచ్చు. ఇది చాలా సులభము మరియు చౌక . పొలం దున్నిన తర్వాత కూడా మొక్కల మొదళ్ళలోఉన్న కొద్ది మంది మనుషులతో తీయించాలి.

లేత పండ్ల తోటలలో పండ్ల మొక్కల మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది కనుక పండ్ల మొక్కల వరుసల మధ్య భూమిలో అంతర పంటలను పండించి కలుపు మొక్కలను నిర్మూలించుటయే కాక , అదనపు ఫలసాయాన్ని కూడా పొందవచ్చు. పప్పు జాతికి చెందిన మినుము, పెసర, అలసందలు, ఉలవలు, వంటి పైర్లను అంతర పంటలుగా పండించడం వల్ల కలుపు నిర్ములన, అదనపు ఆదాయంతో పాటు, పొలంలో సేంద్రియ పదార్ధాన్ని భూసారాన్ని కూడా ఎక్కువ చేయవచ్చు.

Also Read: Pearl Millet Diseases: సజ్జను ఆశించు తేనె బంక తెగులు మరియు కుంకుమ తెగులు.!

Weed Management in Orchards

Weed Management in Orchards

రసాయనాలతో కలుపు నిర్ములన: పండ్ల తోటలలో రసాయనాలను కలుపు నిర్ములన వాడినప్పుడు రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఒక్కొక్కప్పుడు పండ్ల తోటలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. అసలు రైతులు అంతర సేద్యం చేయుట , అంతర పంటలు వేయుట కుదరని పరిస్థితుల్లోనే కలుపు నిర్ములన రాసాయనాలు వాడాలి.

పండ్ల మొక్కలకు వేరు ద్వారా కానీ, ఆకుల ద్వారా కానీ ఏ విధమైన హాని కలిగించదు. తోటలో పెరిగే కలుపు మొక్కలను నిర్మూలించగలగాలి
పండ్ల తోటలలో పెరిగిన ఏక / బహు వార్షిక కలుపు మొక్కల నిర్ములనకు లీటర్ నీటికి 5 నుంచి 10 మీ. లీ. అమ్మోనియం సల్ఫేట్ లేదా యూరియా కలిపి మొక్కలపై మాత్రమే పడునట్లు స్ప్రే చేయాలి.

ఏక వార్షిక గడ్డి జాతి మరియు వెడల్పాటి ఆకు కలుపు మొక్కలున్నపుడు కలుపు నిర్ములనకు ఎకరాకు 1.0 లీ. పేరక్వాట్ 24% ద్రావకం 200 లీ. నీటిలో కలిపి పెరిగిన కలుపు మొక్కల మీద మాత్రమే పడునట్లు పిచికారీ చేయాలి.
పేరాక్వాట్ రాసాయనాలు పండ్ల మొక్కల ఆకుల మీద పడినప్పుడు పండ్ల మొక్కలకు కూడా హాని జరిగే ప్రమాదం ఉంది. కనుక తగిన జాగ్రత్తతో వీటిని స్ప్రే చేయాలి.

రసాయనాలు పెరిగిన కలుపు మొక్కలను నిర్మూలించినప్పటికీ మరల క్రొత్త కలుపు మొక్క పుడుతూనే ఉంటాయి. కనుక నివారణకు పెండిమిథలీన్ 30% ద్రావకం ఎకరాకు 1.0 లీ.200 లీ. నీటికి కలిపి పిచికారీ చేయాలి. గాలి లేని సమయంలో పేరాక్వాట్ మందులను కలుపు మొక్కల మీద పడేటట్లు స్ప్రై చేయాలి. పండ్ల చెట్ల పూత సమయంలో కాయలు కాసే సమయంలో కలుపు నిర్ములన రసాయనాలను వాడరాదు.

Also Read: Fruits Storing Methods: పండ్లను నిల్వ చేయు పద్ధతులు.!

Leave Your Comments

Fruit Plants Planting Methods: పండ్ల మొక్కలు నాటే విధానం – పద్ధతులు.!

Previous article

Gram Pod Borer in Bt Cotton: బి.టి ప్రత్తి శెనగపచ్చ పురుగుపై ఎలా పని చేస్తుంది.!

Next article

You may also like