ఉల్లిగడ్డ : ఉల్లి పైరును ఖరీఫ్, రబీ సీజనల్లో సాగుచేస్తారు. ఇది నెమ్మదిగా మొలకత్తే పైరు. పైగా పైరు ప్రాథమిక దశలో పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది కనుక పైరు కలుపు నుండి పోటిని ఏమాత్రం తట్టుకోలేదు. కలుపు తీయవలిసిన కీలక సమయం విత్తిన నెల రోజులవరకు. ఉల్లి పైరును సాధారణంగా నేరుగా విత్తుట ద్వారాను, నారు పోసి నాటుట ద్వారా గాని సాగుచేస్తారు.
కలుపు యాజమాన్యం –
- విత్తుటకు ముందు కలుపు నివారించుటకు 1 లీ. నీటికి 10 మి. లీ. పెండిమిథలిన్ యూరియా కలిపి ఎక్కడ కలుపు ఉంటే అక్కడ పిచికారీ చేసుకొని 10-15 రోజులలో పైరు విత్తుకోవచ్చు.
- పైరు నాటుటకు ముందు భూమి తయారు చేసిన ఎకరాకు 1 లీ. పెండిమిథలిన్ 30% ద్రావకం 200 లీ. నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
- మొలిచిన / నాటిన తరువాత 20-25 రోజులప్పుడు గడ్డిజాతి మరియు వేడల్పాకు మొక్కలు ఎక్కువ ఉంటే ఎకరాకు 400 మి. లీ. ఆక్సిఫ్లోరిఫస్ 23.5% ద్రావకం 200 లీ. నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
బెండ : విత్తిన వెంటనే లేదా 1,2 రోజుల్లో పెండిమీథాలీన్ 30% ద్రావకం ఎకరాకు 1.0 నుండి 1.3 లీ. లేదా అల్లాక్లోర్ 50%1.5 నుండి 2.0 లీ. చొప్పున ఏదో ఒకదానిని 200 లీటర్ పిచికారీ చేయాలి
బంగాళాదుంప : బంగాళాదుంప నాటిన వెంటనే లేదా 2-3 రోజులలో ఎకరాకు 1 లీ. పెండిమీథాలీన్ 30% ద్రావకం లేదా 750 మీ. లీ. బ్ల్యూటాక్లోర్ 50% ద్రావకం లో ఏదో ఒక దానిని 200 లీ. నీటికి కలిపి పిచికారీ చేయాలి. నాటిన 25-30 రోజుల తర్వాత 15-20 రోజుల వ్యవధిలో 1-2 సార్లు అంతర కృషి చేయాలి.
క్యారెట్: క్యారెట్ విత్తిన వెంటనే లేదా 1-2 రోజుల్లో ఎకరాకు 600 మీ. లీ. పెండిమీథాలీన్ 30% ద్రావకం లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 20-25 రోజులప్పుడు గొర్రుతో అంతర కృషి చేయాలి. లేదా కలుపు నిర్ములనకు 100 గ్రా. మెట్రిబ్యూజిన్ 70% నీటిలో కరిగే పొడి 200 లీ. కలిపి పిచికారీ చేయాలి.
కంద : కందలో అంతర కృషి చేయటానికి అవకాశం లేదు. కందకు బలమైన నెలలో వేయడం వలన అధిక తడులు అవసరమైనదున కలుపు ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కలుపు తక్కువగా ఉన్నపుడు కూలీలతో కలుపు తీయించడం మంచిది. కలుపు ఎక్కువగా వచ్చే భూములలో మొదటి దఫా తడి ఇచ్చి తర్వాత తేమ ఉన్నపుడు ఎకరాకు 2.0 లీ బ్ల్యూటాక్లోర్ 50% ద్రావకం కలిపి పిచికారీ చేయాలి.
గోరుచిక్కుడు : విత్తిన వెంటనే లేదా 1-2 రోజుల్లో ఎకరాకు 1 లీ . పెండిమీథాలీన్ 30% ద్రావకం 200 లీ. నీటికి కలిపి పిచికారీ చేయాలి . విత్తిన 20-25 రోజులప్పుడు గొర్రు తో అంతర కృషి చేయాలి. లేదా కలుపు నివారణకు ఇమజితాఫిర్ 10% ద్రావకం కలిపి పిచికారీ చేయాలి.
చేమగడ్డ : మొదటి దఫా తడి ఇచ్చిన తర్వాత తేమ ఉన్నపుడు ఎకరాకు 2.0 లీ. బ్ల్యూటాక్లోర్ 50% లేదా ఆక్సిఫ్లోరోపేన్ 23.5% ద్రావకం ఏదో ఒకదానిని కలిపి 200 లీటర్ నీటికి పిచికారీ చేయాలి.40-45 రోజుల తర్వాత పలుచగా మొలిచిన కలుపును కూలీలతో తీయించాలి.
Also Read:Troublesome Weeds: సమస్యాత్మక కలుపు మొక్కల నిర్మూలన.!
Must Watch:
A