Tomato Pest Management – నారు కుళ్లు తెగులు: ఈ తెగులు ఆశించడం వలన నారు మడిలో మొక్కలు కూలిపోతాయి.అవి గుంపులు గుంపులుగా చనిపోతాయి. విత్తడానికి ముందు తప్పనిసరిగా 3 గ్రా థైరామ్ లేదా మాంకోజెబ్ కిలో విత్తనాలకు కలిపి విత్తన శుద్ధి చేయాలి.నారు మడిలో తెగులు కనిపించిన వెంటనే కాపర్ ఆక్సి క్లోరైడ్ 3 గ్రా లీటర్ నీటిలో కలిపి నారుమడిని 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.
ఆకు మాడు తెగులు: ఆకుల మీద కాండం మీద మరియు కాయ మీద గోధుమ రంగుతో కూడిన మచ్చలు ఏర్పడి క్రమేణా ఆకులు ఎండి పోతాయి. మొక్క దశలో ఎప్పుడైనా ఆశించవచ్చు.తేమ ఉన్న చల్లని వాతావరణంలో మరియు ఖరిఫ్ సీజన్ లో ఎక్కువగా ఆశిస్తుంది.దీని నివారణకు 3 గ్రా. కెప్టెన్ లేదా మాంకోజెబ్ మందును లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 లేదా 3 సార్లు పిచికారీ చేయాలి.
Also Read: Tomato Integrated Plant Protection: టమాటలో సమగ్ర సస్యరక్షణ.!
వడలు తెగులు: మొక్క అడుగుభాగంలోని ఆకులు పసుపు రంగుకి మారి తోడిమలతో సహా రాలి తర్వాత మొక్క వాడాలి పోయి మొక్క చనిపోతుంది.దీని నివారణకు బలమైన మొక్కల నుండి విత్తనాలను సేకరించాలి.తెగులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో తెగులును తట్టుకునే రకాలను బి టి 1 వంటి రకాలను వాడుకోవాలి.పంట మార్పిడి పాటించాలి.
వైరస్ తెగులు: తెగులు సోకిన మొక్కలు ఆకుల మీద అక్కడక్కడా పసుపు మచ్చలు ఏర్పడి, ఆకులు ముడుచుకొని మొక్క గిడసబారి ఎండిపోతుంది.ఆకులు పేలుసుగా తయారవుతాయి. దీని నివారణకు తెగులు ఆశించిన మొక్కలను పికి నాశనం చేయాలి.తెగులు వ్యాప్తి చెందే రసం పీల్చు పురుగులు ( పేను బంక ) కిటక నశినులను పిచికారీ చేయాలి.
టమాటో స్పాటెడ్ విల్ట్ వైరస్: టమాటా చిగురు ఆకుపై ఈనెలు గోధుమ వర్ణం మారి ఆకుల మీద పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి.మొక్కలు గిడసబారి పూత పిందే పట్టక ఎండిపోతాయి.దీని నివారణకు తెగులు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి.తెగులును వ్యాప్తి చెందితే తామర పురుగుల నివారణకు డైమీథోయేట్ 2.మీ. లీ. లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.నారు మడికి 250 గ్రా.మరియు నాటిన 10 వ రోజున ఎకరాకు 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3 జి గుళికలు వాడి పంటను ఈ వైరస్ తెగులు నుండి కాపాడుకోవచ్చు.
Also Read: Tomato Diseases: టమాట పంటలో పొగాకు లద్దె, అక్షింతల పురుగుల యాజమాన్యం.!