Tobacco Caterpillar Management: ఆంధ్రప్రదేశ్లో సాగు చేసే పత్తి, పొగాకు, వేరు సెనగ, ఆముదం, పెసర, మినుము చిక్కుడు, క్యాబేజి, కాలిఫ్లవర్ బెండ, టమాటో, మిరప, పొద్దుతిరుగుడు, అలసంద, కుసుమ, ఆరటి తదితర పంటల భేదం లేకుండా పొగాకు లద్దెపురుగు ఆశిస్తుంది.
జీవిత చరిత్ర: లద్దెపురుగుల తల్లి పురుగులు గోధుమరంగులో బలిష్టంగా ఉంటాయి. ముందు రెక్కలమీద తెల్లని చారలు, వెనుక రెక్కల అంచులో నల్లని మచ్చ ఉంటుంది. ఆడ రెక్కల పురుగు ఆకుల అడుగు భాగంలో పసుపుపచ్చని గుడ్లను (సుమారు 350-400 వరకు) సముదాలుగా పెడుతుంది. గుడ్లనుంచి బయటకు వచ్చిన లద్దెపురుగు పెరిగి 3-4 సెంటిమీటర్ల పరిమాణంలో లేత ఆకు పచ్చరంగులో అడ్డంగా నల్లని మచ్చలు, నిలువున పసుపుచారలు కలిగి ఉంటాయి. వీటి ఉధృతి ఎక్కువగా ఉన్నపుడు ఒక పొలం నుంచి ఇంకో పొలానికి గుంపులు, గుంపు తెలుగా వలస పోతుంటాయి. ఈ పురుగు కోశ దశను భూమిలో గడుపుతుంది. లద్దెపురుగు మొత్తం జీవితచక్రం 30 నుంచి 60 రోజుల్లో పూర్తవుతుంది. లద్దెపురుగు గుడ్లు పొదగటానికి 3-5 రోజులు పడుతుంది. గొంగళిపురుగు దశ ఆశించిన పంటను బట్టి 15-30 రోజుల వరకు ఉంటుంది.
రెక్కల తల్లిపురుగు వారం రోజులవరకు బతికి ఉంటుంది. ఈ పురుగు సంవత్సరం మొత్తం కనిపిస్తూ ఒక ఏడాదిలో 8 తరాలు పూర్తిచేస్తుంది. లద్దెపురుగు గొంగళి పురుగు దశల్లో మాత్రమే మొక్కలకు హాని చేస్తుంది. ఇవి పగటివేళల్లో భూమిలో కిందపడిన ఆకులు,చెత్తా చెదారంలో దాగి ఉండి -రాత్రివేళల్లో ఆకులు, కొమ్మలను తినేస్తాయి. ఈ పురుగులు మొదటి దశలో ఉన్నపుడు ఒకచోట గుంపుగా ఉండి ఆకులను గీకి తింటాయి. పెరిగి పెద్దదైన తరువాత విడివిడిగా ఆకుల మీదకు చేరి విపరీతంగా తిని పొగాకు లద్దెపురుగు వేస్తాయి. పొగాకు తీవ్రంగా ఆశించిన పొలంలో ఈనెలతో కూడిన కొమ్మలు మాత్రమే ఉంటాయి. మొక్క పెరుగుదల క్షీణిస్తుంది. ఈ పురుగు నివారణ కోసం కేవలం రసాయనిక పురుగుమందుల మీదనే సమగ్ర సస్యరక్షణ పద్ధతు లను సమయానుకూలంగా పాటించాలి.
సమగ్ర యాజమాన్యం: పంటకోత పూర్తయిన తర్వాత వేసవిలో లోతు దుక్కులు చేయడం వల్ల భూమిలో ఉండే పురుగు కోశస్థ దశలు ఎండ వేడిమికి లేదా పక్షుల ల బారికి లోనై నశిస్తాయి.ఒకే పంటను ఒకే పొలంలో పంట తరువాత పంటగా వేయకుండా పంటమార్పిడి విధానాన్ని అవలంభిం చాలి. దీనివల్ల పురుగు ఉధృతి తగ్గుతుంది. నత్రజని ఎరువులను మోతాదుకు మించి ఉపయోగించరాదు. నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువు లను పంట సిఫారసుల మేరకు సమతులంగా వాడాలి.పొగాకు లద్దె పురుగు గుడ్లదశ మొదలుకొని బాగా ఎదిగిన లద్దెపురుగులను కూడా తిని జీవించే పరాన్నజీవులు, బదనికలు, పక్షులు ప్రకృతిలో ఎన్నో ఉన్నాయి. ట్రైకోగ్రామా పరాన్నజీవులు ప్రభుత్వ, ప్రైవేటు క సంస్థలు పెద్ద మొత్తంలో ఉత్పత్తి డు చేసి విక్రయిస్తున్నాయి. వీటిని పంట కాలంలో ఆవసరాన్ని బట్టి 3-4 సార్లు విడుదల చేయాలి. అయితే ఈ మిత్ర పురుగులను వదిలిన 7-10 రోజులవ రకు ఏ విధమైన పురుగుమందులను చల్లరాదు. గోరింకలు, కొంగలు తది 58 తర పక్షులు లద్దె పురుగులను ఏరుత కొని తింటాయి. అందువల్ల ఈ ఆమే పక్షులు వాలెందుకు వీలుగా ఉండేలా ఎకరానికి 20 చోట్ల ‘T’ ఆకారపు పక్షిస్థావరాలు (పంగల కర్రలను) ఏర్పాటు చేయాలి.
Also Read: Tobacco Cultivation Techniques: ఆరోగ్యవంతమైన పొగాకు నారు పెంపకంలో మెళుకువలు.!
Must Watch: