Thutikada Kashayam:వరి చేలలో దోమపోటు ఎక్కు వుగా నష్టపరుస్తుంది. ప్రధానంగా స్వర్ణ, సాంబమసూరి, కర్నూలు సోనా వంటి వరి రకాల్లో దీని బెడద ఎక్కువ. ఎన్ని రసాయన మందులు వాడినా అదుపులోకి రావడం లేదని రైతులు వాపోతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలంలోని బొల్లుపల్లి నాయని చెరువు ఆయకట్టులోని కొందరు రైతులు తూటికాడ ఆకు కషాయంతో సుడిదోమను నివారించుకొని సత్పలి తాలు సాధిస్తున్నారు.
ఇక్కడ రైతులు సుమారు 300 ఎకరాల్లోని వరిపంటను సుడిదోమ నుంచి కాపా డుకుంటూ సఫలీకృతులయ్యారు. వరిచేలో యూరియా ఎక్కువుగా వాడటం, పగటి ఉష్ణోగ్రత, ఎండల తీవ్రత సమయంలో రసాయన మందులు ఎక్కువుగా పిచికారి చేయడం వల్ల సుడిదోమ ఉధృతి పెరుగుతుంది. ఇది సోకిన చేలో వరి దుబ్బులు మెత్తబడి, గింజలు పాలు పోసుకోక, తాలు గింజలేర్పడి దిగు బడి, నాణ్యత తగ్గుతుంది. గడ్డి కూడా పశువులకు పనికి రాకుండా పోతుంది.
Also Read: Tea Mosquito Bug: జీడీ మామిడిలో దోమ కానీ దోమ యాజమాన్యం
తూటికాడ కషాయం తయారీఎలా తయారు చేస్తారు? 10 కిలోల తూటికాడ ఆకులు, 2 కిలోల పేడ, 5 లీటర్ల ఆవు మూత్రం వాడు తారు. తూటికాడ ఆకులను మొత్తం రుబ్బి ముద్దగా చేస్తారు. ఆవు మూత్రంలో ఈ ముద్దను కలిపి దాన్ని పేడలో కలుపుతారు. ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలో తీసుకొని 3 నుంచి 5 పొంగలు వచ్చే వరకు ఉడిస్తారు. ఈ మిశ్రమాన్ని రెండు రోజులు మరగ బెట్టి, తర్వాత గుడ్లతో వడగట్టి కషా యాన్ని డబ్బాల్లో నిల్వచేసుకుంటారు. వడకట్టిన ఈ కషాయాన్ని వంద లీటర్ల నీటిలో కలిపి ఎకరా వరిపైరు పై పిచికారి చేసి సుడిదోమను నివారించు కుంటున్నారు.
సుడిదోమ సమస్య ఉన్న మిగతా ప్రాంతాల్లో కూడా రైతులు ఈ ప్రయోగాన్ని మొదటి కొద్ది విస్తీ ర్థంలో ఆచరించి బాగుంటే అధిక విస్తీర్ణంలో చేపట్టవచ్చు. శాస్త్రవేత్తల పరిశోధనలు కూడా ఈ దిశలో జరి గితే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది.
Also Watch: