చీడపీడల యాజమాన్యం

చెదలు – నివారణ చర్యలు

3

చెదలు ముఖ్యంగా కొయ్య సామగ్రినేగాక, వివిధ పంటలను పలు చెట్లను ఆశించి చెట్టు లోపలి మెత్తటి భాగాన్ని తినడం వల్ల వడలిపోయి తరువాత ఎండిపోయి చనిపోతాయి. ఈ పురుగు యొక్క బెడద చల్కా ఎర్రమట్టి నేలల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ పురుగులు సామూహికంగా పుట్టల్లో నివసిస్తాయి.

వీటిలో ముఖ్యంగా 4 తెగలు కలవు :

  1. రాణి
  2. రాజు
  3. పని చేసే చెదపురుగులు
  4. సైనిక చెదపురుగులు

Termites ( చెదలు )

రాణి మరియు రాజు పురుగులు మొదట రెక్కలు కలిగి ఉంటాయి. తొలకరి వర్షాలు పడిన వెంటనే రాణి మరియు రాజు పురుగులు మొదట రెక్కలు కలిగి ఉంటాయి. తొలకరి వర్షాలు పడిన వెంటనేపుట్ట నుండి బయటకు వచ్చి నేల మీద కాని, గాలిలో కాని సంపర్కం జరుపుకుంటాయి. సంపర్కం  జరిగిన తరువాత పురుగులు రెక్కలు రాలిపోతాయి. రెక్కలు రాలిన రాణి పురుగు భూమి లోనికి  పోతుంది. ఆ తరువాత రాణి పురుగు పరిమాణం చాల పెద్దదిగా మారి ఒక రోజులో సుమారుగా 30,000 – 80,000 గ్రుడ్లు పెట్టడం ప్రారంభిస్తుంది. ఈ విధంగా 7- 10 సంవత్సరాలు గుడ్లు పెడుతుంది. గుడ్ల నుండి పిల్ల పురుగ్లు 1 నెల నుండి  3 నెలలు లోపు బయటకి వస్తాయి. పిల్ల పురుగులు పెద్దవిగా మారటానికి సంవత్సర కాలం పని చేసే చెదపురుగులు తెల్లగా లేక గోధుమ వర్ణం కలిగి చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. సైనిక పురుగులు పని చేసే పురుగుల కంటే పెద్దవిగా ఉండి రెక్కలు లేకుండా ఉంటాయి.

నష్టపరిచే విధానం : – 

termite

termite ( చెదపురుగులు )

సేవక పురుగులు ఎక్కువ సంఖ్యలో పంట పొలాలను ఆశిస్తాయి. ఇవి కాండంలోనికి పోయి లోపలి పదార్ధాన్ని తినటం వల్ల మొక్కలు మొదట వదిలిపోయి తరువాత ఎండిపోయి చనిపోతాయి. అలా తినడం వల్ల ఏర్పడిన ఖాళీ ప్రదేశాలను మట్టి తో నింపుతాయి. చనిపోయిన మొక్కలు పీకితే సునాయాసంగా ఊడి వస్తాయి. పండ్ల మరియు అడవి జాతి మొక్కల బెరడును తింటూ మట్టితో కప్పడం వల్ల చెట్లు గిడసబారి పోతాయి. వీటి ఉధృతి మెట్ట పంటల్లో నేటి ఎద్దడి ఉన్న పండ్ల తోటల్లో ఎక్కువగా ఉంటుంది.

Also Read : కందిలో తెగుళ్ళు – యాజమాన్యం

నివారణ చర్యలు :

  • పంట పొలాల గట్ల పైన లేక పొలం చుట్టూ చెదపుట్టలను పూర్తిగా తవ్వి రాణి పురుగును వెలికి తీసి చంపాలి.
  • క్లోరోపైరిఫాస్ 50 ఇ.సి మందు 5 మీ.లీ ఒక లీటరు నీటికి కలిపి సుమారు 15 – 30 లీటర్ల మందు ద్రావణాన్ని చెద పుట్టల్లో బాగా తడిసేటట్లు  పోయాలి.
  • చెరకు పంటలో చెదల నివారణకు చెరకు గెడలను మలాధీయాన్  (లీటరు నీటికి 20 మీ.లీ మోతాదు కలిపిన ) ద్రావణంలో సుమారు 15 నిముషాలు ముంచిన తర్వాత నాటాలి.
  • పండ్ల తోటల నారుమడులను తయారు చేసేటప్పుడు ,లండేను ,మిధైల్ పారాధియాన్ పొడి మందు నారు మడుల్లో కలుపాలి. చెట్లు నాటే గుంతల్లో పొడి మందును గుంతకు 100 గ్రా మోతాదులో కలపాలి.
  • పూల మొక్కల మొదళ్లకు చెదలు ఆశించినప్పుడు చెద మట్టి దోరలను 15 రోజులకొకసారి గోనే పట్టాతో రాల్చాలి. తర్వాత  క్లోరో పైరిఫాస్ 50 శాతం 5 మీ.లీ ఒక లీటరు నీటికి కలిపి చెట్టు చెట్టు మట్టిని కడిలించి పోయాలి.

 

యస్.ఓంప్రకాశ్ , శాస్త్రవేత్త (ఎంటమాలజీ), ఎమ్.ఉమాదేవి

ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం,పొలాస,జగిత్యాల

 

Also Read : పసుపులో వచ్చే తెగుళ్లు మరియు నివారణ చర్యలు

 

 

Leave Your Comments

బోర్ల కింద వరి వద్దు…

Previous article

హైదరాబాద్ కు చేరిన ఢిల్లీ రైతు ఉద్యమం…

Next article

You may also like