Tea Mosquito Bug: జీడి మామిడి ఉద్యాన వాణిజ్య పంటలలో ప్రధానమైనది. డ్రై ఫ్రూట్ పంటలలో అధికంగా తినబడే జీడి మామిడి మన చేతిలోకి రావాలంటే చాలా పురుగు దాడులు తట్టుకోవాలి. ఇందులో జీడీ మామిడి కాండం, వేరు తొలిచే పురుగు తర్వాత అధిక నష్టం కలిగించేది తేయాకు టీ దోమ. ఇది నిజంగా దోమ కాదు. కూర్చున్నపుడు దీని శరీర నిర్మాణం దోమ లాగ ఉండడం వలన, ఇది తేయాకు తోటలలో ఎక్కువగా కన్పించడం వలన దీనిని తేయాకు దోమ అని పిలుస్తుంటారు.
జీడీ మామిడి సాగులో టీ దోమ అక్టోబర్ నుండి ఏప్రిల్ నెలల్లో అక్కడక్కడా కనిపిస్తుంది. ఈ టీ దోమ పూత దశ నుండి పంట చేతికందే వరకు కనిపిస్తుంది . అలాగే లేత ఆకులు, పూతలు మాడిపోతాయి పక్వానికి రాని గింజలు ముందుగానే రాలిపోతాయి లేదా గింజలపై మచ్చలు, చారలు ఏర్పడి నాసిరకంగా తయారవుతాయి.
టీ దోమ ప్రభావం వల్ల చెట్టు పాలిపోయినట్లుగా కనిపిస్తుంది, ఈ దోమ చిరు దశలోనూ ,తల్లి దశలోను లేత కొమ్మలు పైన రెమ్మలు పైన వాలీ వాటి రసాన్ని పీల్చడం వల్ల ఎర్రని జిగురులాంటి పదార్థం కారుతూ, నల్లని చారలు ఏర్పడుతుంది. ఈ విధంగా టీ దోమను గుర్తించవచ్చు.
Also Read: జీడీ మామిడి కాండం, వేరు తొలుచు పురుగు యాజమాన్యం
నివారణ : ముందుగా జీడిమామిడిలో ఎలాంటి కలుపు లేకుండా చూసుకోవాలి. నేల మటం నుండి 0.75 సెంటీమీటర్ ల దిగువనున్నటువంటి కొమ్మలను కత్తరించుకోవాలి . కత్తెరించేప్పుడు కొమ్మలలో ఎలాంటి చిలికలు లేకుండా చూసుకోవాలి. ఒక వేల చిలికలు ఏర్పాడితే దానికి వేప లేపనం పూసుకోవాలి. అలాగే చెట్టు మొదలు చుట్టూ 1.5 మీటర్ ల దూరం, ఒక అడుగు వెడల్పు, ఒక అడుగు లోతు గల గుంతలు తవ్వుకోవాలి. చెట్టుకు చెట్టుకు మధ్య 1 మీటర్ వెడల్పు 1 మీటర్ లోతు గల కందకాలు తీసుకోవాలి.
చెట్టుకి ఎటువంటి తెగుళ్ళు వచ్చిన మొదటి దశలోనే గుర్తించేటట్టు పరిశీలనలో ఉండాలి, అలాగే మంచి నీటి యాజమాన్యం కూడా పాటించాలి. వీటితో పాటు గుంతలో ఘనజీవామృతం వేసుకోవాలి, ద్రవజీవామృతం పోసుకోవాలి. టీ దోమ నివారణకు మూడు దశలలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.మొదటిది చిగురాకు దశ ,ఈ దశ అక్టోబర్ నుండి నవంబర్ నెలల్లో కనిపిస్తుంది .
రెండవది పూత దశ ఇది డిసెంబర్ నుండి జనవరి నెలల్లో కనిపిస్తుంది. మూడవది గింజకట్టే దశ ఇది ఫిబ్రవరి నుంచి మార్చ్ నెలల్లో కనిపిస్తుంది . ఈ మూడు దశలోనూ పేడ మూత్రం మరియు ఇంగు ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి.
ఆవు పేడ మూత్రం ఇంగువ ద్రావణం తయారీ విధానం : దానికి దేశీయ ఆవు పేడ 5 కిలోలు , దేశీయ ఆవు మూత్రం 5 లీటర్లు, సున్నంపాది 150 గ్రాములు, ఇంగువపొడి 200 గ్రాములు, నీళ్లు 5 లీటర్లు తీసుకోవాలి. అలాగే ఒక మట్టి కుండా కూడా తీసుకోవాలి. ముందుగా దేశి ఆవు పేడను కుండలో తీసుకోవాలి, అలాగే దేశీ ఆవు మూత్రాన్ని కూడా అందులో కలుపుకోవాలి. అలాగే 5 లీటర్ ల నీటిని కూడా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా కలుపుకోవాలి. తరువాత యి మిశ్రమాన్ని గోనె సంచితో కప్పి తాడుతో కట్టి నాలుగు రోజులు మురగ పెట్టాలి.
ప్రతి రోజు ఉదయం సాయంత్రం దీనిని రెండు సార్లు కలుపుకోవాలి . ఇలా నాలుగు రోజులు మురగబెట్టిన తరువాత 200 గ్రాములు ఇంగువను వేడినీటిలో కరిగించి చల్లార్చిన తరువాత కుండలో మురగబెట్టిన ఆవు పేడ – ఆవు మూత్రం ద్రవాణము కలుపుకోవాలి. 150 గ్రాములు గుల్ల సున్నం కలుపుతూ ఒక కర్ర సహాయంతో సవ్యదిశలో కలియబెట్టాలి. ఇలా తయారైనదే ఆవు పేడ – ఆవు మూత్రం – ఇంగువ ద్రావణం. దీనిని మూడు దశలలో పిచికారీ చేసుకోవాలి. అవసరమైనపుడు నీమాస్త్రాన్ని కూడా పిచికారీ చేసుకోవాలి.
Also Read: జమ తోటలో సమీకృత పోషకాల అవసరం మరియు ప్రాముఖ్యత