Sunflower Diseases – ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు:
లక్ష్మణాలు: ఆకుపై నల్లని గుండ్రని మచ్చలు ఏర్పడుతాయి. కాండంపై మరియు ఆకుతొడిమిపై పువ్వు క్రింది భాగాన గోధుమ వర్ణపు మచ్చలు లేక చారలు ఏర్పడుతాయి. ఈ మచ్చలు ఒకదానితో ఒకటి కలిసి పెద్ద మచ్చలుగా ఏర్పడి వ్యాధి సోకిన భాగాలు చనిపోతాయి. వ్యాధి తీవ్రంగా ఉ న్నప్పుడు ఆకులు రాలిపోవడం మరియు కాండం విరిగి పోవడం జరుగుతుంది. విత్తనాల ద్వారా ఈ శిలీంధ్రం వ్యాపించినప్పుడు విత్తనాలు కుళ్లుటం లేక మొలక ఎండుతెగులు లక్షణాలు కనిపిస్తాయి. బీజ దళాలపై మరియు వేరు భాగాలపై నల్లని మచ్చలు ఏర్పడడం వలన వేర్లు కుళ్లి మొలకలలో నానుడి తెగులు లక్షణాలు కనిపిస్తాయి. ఈ శిలింధ్రం. విత్తనాలు మరియు మొక్కల అవశేశాల్లో జీవిస్తుంది. ఈ తెగులు గాలి ద్వారా ఒక మొక్క నుండి ఇంకో మొక్కకు వ్యాప్తి చెందుతుంది. తేమతో కూడిన వేడి వాతావరణం’ ఈ వ్యాధి వృద్ధికి అనువైoది.
నివారణ: పంట అవశేషాలను శిలీంధ్రానికి అశ్రయమిచ్చే ఇతర కలుపుమొక్కలను నివారించాలి. కాప్టాన్ 3 గ్రా/1 కె.జి. విత్తనాలకి కలిపి విత్తన శుద్ధి చేయాలి.తెగులు గమనించిన వెంటనే మాంకోజిబ్ 0.25% మందు 2 సార్లు పిచికారీ చేయాలి.
Also Read: Sunflower harvesting: ప్రొద్దు తిరుగుడు పంట కోత సమయం లో తీసుకోవలసిన జాగ్రత్తలు
కాండం కుళ్ళు తెగులు
లక్షణాలు: మొక్కలు పుష్పించే దశకు ముందు 7-10 రోజులలో వేడి వాతావరణం ఉన్నప్పుడు ఈ వ్యాధి అధికంగా సోకుతుంది. పొలంలో ఈ వ్యాధి గుంపులు గుంపులుగా గాని అక్కడక్కడ గాని ఉండవచ్చు. మొదట మొక్కలలోని పై ఆరులు వాడిపోతాయి. 2,3 రోజులు తరువాత మిగతా ఆకులు రాలిపోయి మొక్కలు ఎండిపోతాయి. చనిపోయిన మొక్కలు నలుపు రంగులో ఉం టాయి. వ్యాధి సోకిన కాండం భూమి నుండి 25 సిం॥ మీ ఎత్తు వరకు వంకరగా మారి ఉం టుంది. ఈ ప్రాంతం మెత్తగా ఉండి నీటిలో తడిపినట్లు ఉంటుంది.
దీనిపై తెల్లని శిలీంధ్రపు తంతువులు పెరుగుతాయి. దీనిలో ఆవాల గింజ పరిమాణంలో గల స్క్లెరోషియా బీజాలు ఏర్పడుతాయి. కాండం భూమి ఉపరితలం దగ్గర చీలిపోయి మొక్కలు విరిగిపడి పోతాయి. పువ్వు క్రింద భాగాన మొదట నీటిలో తడిపినటువంటి మచ్చలు ఏర్పడిన ప్రాంతం ఊదారంగులోకి మారుతుంది. తేమతో కూడిన వాతావరణంలో దీనిపై తెల్లని శిలీంధ్రపు పెరుగుదల ఉంటుంది. దీనివలన పువ్వులు మొత్తంగాని, కొంత భాగం కాని కుళ్లి పుష్పాలు చీలి దారాలవలె కన్పడుతాయి. విత్తనంపై పొర రంగు కోల్పోవును. విత్తనాల క్రిందిపొరలో మరియు విత్తనాల చుట్టూ, ఆవగింజ పరిమాణంలో గల స్క్లెరోషియా బీజాలు ఏర్పడుతాయి. ఈ శిలీంధ్రం పంట అవశేషాల్లోను నేలలో మరియు విత్తనాలలో జీవిస్తుంది.
నివారణ: పంట అవశేషాలను శిలీంధ్రానికి ఆశ్రయమిచ్చే ఇతర కలుపుమొక్కలను నివారించాలి. కారాక్సిన్ / కాప్టాన్ 3 గ్రా/1 కె.జి. విత్తనాలకి కలిపి విత్తన శుద్ధి చేయాలి.కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రా/1 లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్ల వద్ద పోయాలి.
Also Read: sunflower crop: పొద్దుతిరుగుడు సాగులో సమస్యల పరిష్కార మార్గాలు