Sorghum Pest – కంకినల్లి లేక అగ్గి పురుగు: పిల్ల పురుగులకు రెక్కలు ఉండవు. పెద్ద పురుగులు పసుపు ఆకుపచ్చ రంగులో ఉంటుంది.
లక్షణాలు: జొన్న కంకి పొట్ట దశ నుండి బయటకు రాగానే పాల గింజలపై పిల్ల మరియు తల్లి పురుగుల ఆశించి రసాన్ని పీలుస్తాయి. దీనివల్ల పాల గింజలపై ఎరుపు మచ్చలు ఏర్పడి అవి క్రమేపి నలుపుగా మారుతాయి. ఈ పురుగులు పాల గింజలపై ఆశించుట వలన నొక్కులు ఏర్పడి కంకిలో కొన్ని మంచి గింజలు మాత్రమే ఉంటాయి.
గింజలు గట్టి పడిన తరువాత ఈ పురుగు ఆశించదు. గింజలు పాలు పోసుకునే దశలో ఈ పురుగులు ఆశించినట్లయితే గింజలు తాలుగా మారి ముడుచుకొని పోతాయి.కంకి ఏర్పడుతున్న దశలో ఆశించి నట్లయితే కంకిలో గింజలు ఏర్పడవు. కంకి పూర్తిగా ఎరుపు రంగులోకి మారి బలహీనపడుతుంది. పురుగు ఆశించిన గింజలపై ఎర్రని ఇటుక రంగు చారలు కనబడతాయి.ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఆలస్యంగా విత్తినటువంటి పొలాల్లో ఆశిస్తుంది.
నివారణ చర్యలు: ఈ పురుగు కంకి దశలో పైరుపై ఆశించడం వలన పిచికారి చేయడం చాలా కష్టo. ఒకే రకం జొన్న రకాలను ఒకేసారి విత్తడం వలన ఈ పురుగు బెడద కొంతవరకు తగ్గించవచ్చు.
Also Read: Aspergillosis in Animals: పశువుల్లో అస్పార్ జిల్లోసిస్ వ్యాధి ఎలా నిర్ములించాలి.!
ఒకే ప్రాంతంలో ఒకే కాలపరిమితి కలిగినటువంటి రకాలను విత్తుకోవడం ద్వారా పురుగు నష్టాన్ని తగ్గించవచ్చు.పురుగు నివారణ కొరకు క్వినాల్పాస్ 2.0 మి.లీ లేక ఫాసలోన్ 2.0 మి.లీ లేక క్లోరిపైరిపాస్ 2.5 మి.లీ లేక కార్బరిల్ 3.0 గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి కంకులు బయటకు రాగానేకంకులపై మాత్రమే పడేటట్లు పిచికారి చేయాలి.
ఎర్రనల్లి పురుగు:
తల్లి పురుగు: పిల్ల పురుగులు లేత ఆకుపచ్చ రంగులో ఉండి పొడవుగా ఉంటాయి. పెద్ద పురుగులు బూడిద రంగులో ఉండి నాలుగు జతల కాళ్ళను కలిగి ఉంటుంది.
లక్షణాలు: పిల్ల మరియు పెద్ద పురుగులు ఆకు అడుగు భాగమున గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీలుస్తాయి. దీనివలన మొదట ఆకులు లేత పసుపు రంగులోకి మారి తరువాత ఎరుపు రంగుకు మారి ఎండిపోతాయి.ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకు అడుగు భాగాన మరియు పై భాగాన బూడిద చల్లినట్లుగా కనబడుతుంది.ఈ పురుగులు ఎక్కువగా ఉన్న ఆకుల అడుగు భాగం ఇటుక రంగు బూజు ఉన్నట్లు కనబడుతుంది.ఈ పురుగు ఆశించిన పొలమును దూరం నుండి చూసినట్లయితే ఎండిపోయినట్లు కనపడుతుంది.
నివారణ చర్యలు: ఈ పురుగు నివారణ కొరకు రసాయనిక పురుగు మందులైన నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేక డైకోఫాల్ 5.0 మి.లీ ఒక లీటరు నీటికి కలిపి ఆకుల అడుగు భాగం తడిచే విధంగా పిచికారి చేయాలి.
Also Read: Orange Harvesting and Packaging: బత్తాయి తోటల్లో కోతనాంతరం చేయవల్సిన పనులు