Diseases of Banana: కారకం- ఈ తెగులు మైకోస్పిరెల్లా మ్యూసికోలా అను శిలీంద్రము వలన కలుగుతుంది.
లక్షణాలు: ముదురు ఆకుల పై చిన్న చిన్న మచ్చలు ఏర్పడి, తీవ్రంగా ఉన్నప్పుడు మచ్చలు దగ్గర దగ్గరగా ఏర్పడి గోధుమ వర్ణమునకు మారును. ఈ మచ్చలు ఆకులలోని ఈనెలకు సమాంతరంగా ఏర్పడును. ఇందులో కొన్ని మచ్చలు పరిమాణంలో వృద్ధి చెంది ముదురు గోధుమ వర్ణము నుండి నలుపు వర్ణమునకు మారును. మచ్చలు మధ్య భాగం ఎండిపోయి బూడిద వర్ణమునకు మారును. మచ్చల చుట్టూ ముదురు గోధుమ లేక నలుపు వర్ణపు వలయం ఏర్పడును. తెగులు తీవ్రంగా ఉన్నప్పుడు మచ్చలు ఒకదానితో ఒకటి కలిసి, ఆకుల అంచుల నుండి ఎండిపోవును. తరువాత బాక్టీరియా మరియు ఇతర శిలీంద్రాల వలన మధ్య ఈనె మరియు పత్రవృంతము కుల్లిపోవును. ఈ మచ్చల వలన ఆకులకు మార్కెట్టులో విలువ తగ్గును.
Also Read: Banana Harvesting: అరటి గెలలను కోసిన తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలు.!
తెగులు సోకిన ఆకులు కాండం పొడవునా వ్రేలాడును. ఆకులపై భాగమున ఈ తెగులు పువ్వు గెల వేయక ముందే వస్తే కాయలు బాగా పెరగక, చిన్నవి గానూ, కోణం కలిగి ఉండి గెలలు చిన్నవిగా కనిపించును. బాగా తెగులు సోకిన కాయలలో గుజ్జు కొంచెము పసుపు వర్ణమునకు మారి వగరు రుచి కలిగి ఉండును. కాయలు పక్వ దశకు రాక ముందే ధృడత్వాన్ని కోల్పోయి మెత్తగా ఉండును. ఈ తెగులు తేలికైన, మురుగు నీరు పోయే వసతి లేని మరియు నీడ గల ప్రాంతాలలో ఎక్కువగా సోకుతుంది. మొక్కలను దగ్గర దగ్గరగా నాటడం, ఎక్కువగా కలుపు మొక్కలు ఉండటం వలన మరియు పిలక మొక్కలను తీసివేయక పోవడం వలన కూడా తెగులు ఉధృతం అగును.
నివారణ:
- అరటి తోటల యందు మురుగు నీరు పోయే జాగ్రత్త తీసుకోవాలి.
- తోటను శుభ్రంగా ఉంచి గెల కోసిన తరువాత రెండవ పంట కోసం పిలకలను ఉంచినపుడు మొదటి పంటకు సంబందించిన కాండాన్ని, ఆకులను తీసి తగులబెట్టాలి.
- అరటి పంటను మూడు పంటలకు మించి ఒకే భూమిలో పండించరాదు. కాబట్టి తప్పనిసరిగా వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలతో పంట మార్పిడి చేయాలి.
- సరైన అరటి పిలకలను తెగులు సోకని చెట్టు నుండి సేకరించాలి.
- మొక్కకు మొక్కకు మధ్య వరుసల మధ్య దూరం 2.5 మీ. ఉండేటట్లు పిలకలను నాటాలి.
- తల్లి మొక్క చుట్టూ ఉన్న మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి.
- తెగులు ఎక్కువగా ఆశించే రకాలపై వర్షాకాల ప్రారంభానికి ముందు 2.5గ్రా. మాంకోజెబ్ లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
- వర్షాకాలంలో తెగులు వ్యాపిస్తే 1మి.లీ. ట్రైడిమార్స్ / ప్రొపికొనజోల్ 1 లీటరు నీటిలో కలిపి 2 నుండి 3 సార్లు 20 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి.
Also Read: Pseudo Stem Borer in banana: అరటి లో కాండం తొలుచు పురుగు యాజమాన్యం