చీడపీడల యాజమాన్యం

Prevent Sucking Pest of Cotton: ప్రత్తి లో రసం పీల్చు పురుగుల నివారణ .!

4
Prevent Sucking Pest of Cotton
Prevent Sucking Pest of Cotton

Prevent Sucking Pest of Cotton:

పచ్చ దోమ –

  • ఈ పురుగులు ఆకు పచ్చ  రంగులో ఉండి 3-5 మీ. పొడవు కలిగి  ఉంటాయి.వీటి ముందు రెక్కలపై నల్లని మచ్చలు  ఉంటాయి.
  • ఈ పురుగులు పైరు మొదట దశలలో అనగా శాఖీయ పెరుగుదల   దశలలో  ఎక్కువగా ఆశిస్తాయి.
  • ఎక్కువ వర్షపాతము  మరియు తక్కువ ఉష్ణోగ్రతా  ఉన్నట్లు అయితే పచ్చ దోమలు బాగా వృద్ధి చెందును.
  • పిల్ల మరియు పెద్ద పురుగులు ఆకుల అడుగు భాగం నుండి రాసాన్ని విపరీతంగా పిలుస్తాయి.
  • పురుగుల ఉధృతి  ఎక్కువగా ఉన్నట్టు అయితే ఆకుల అంచులు పసుపు రంగులోకి మరి ఆకులు ముడుచుకొని పోతాయి.
  • దోమ తాకిడి ఎక్కువగా ఉన్న పొలాల్లో పైరంతా  ఎర్రగా మరి ఆకులన్నీ ఎండి రాలిపోతాయి. దీనినే హాపర్ బోర్న్ అంటారు.
  • పచ్చ దోమను తట్టుకునే రకాలు వేసుకోవాలి.సవిత, నరసింహ, l -604, LRA- 51 రకాలను సాగు చేసుకోవాలి.
Insect pest of cotton

Prevent sucking insects in cotton

పేను బంక –

  • ఈ పురుగు పసుపు పచ్చ లేదా పసుపు గోధుమ రంగులో ఉంటాయి.
  • ఈ పురుగులు సాధారణంగా జులై – ఆగస్టు నెలల్లో  వర్షానికి వర్షానికి మధ్య  వచ్చే బెట్ట కాలంలో పైరుపై  పెరుగుతాయి.
  • వర్షాలు వచ్చినపుడు ఈ పురుగు సాంద్రత  తగ్గుతుంది.పిల్ల మరియు పెద్ద పురుగులు ఆకు అడుగు భాగంలో చేరి రాసాన్ని పిలుస్తాయి.
  • ఈ పురుగు తాకిడికి గురైన మొక్కలు నిరసించి పోయి  గిడసబారి పోతాయి.ఇవి తేనే వంటి జిగురు పదార్ధాన్ని విసర్జీస్తాయి. ఈ జిగురు పదార్ధం వలన  వాతావరణంలో ఉన్న శిలీంద్రం  పెరిగి ఆకులను కప్పి వేస్తాయి. దీనినే మసి  తెగులు అని కూడా అంటారు.
  • 15-20 %పేను బంక ఆశించిన మొక్కలు కనపడగానే నివారణ చేయాలి  

తామర పురుగులు-

  • ఈ పురుగులు పంట ఏ దశలో అయినా కనిపిస్తాయి.వర్షాలు  తక్కువగా ఉండి ఉష్ణోగ్రతతో ఎక్కువగా ఉంటే ఇవి విపరీతంగా వృద్ధి చెందుతాయి.
  • అందువలన ఆకుల పై భాగంలో మచ్చలు ఏర్పడి ఆకులు పాలిపోయి ముడుచుకొని పోతాయి.మొదటి దశలో ఆశిస్తే మొక్కలు గిడసబారి పెరుగుదల ఆగిపోతుంది.
  • 15-20% దెబ్బ తిన్న మొక్కలను  తీసివేయాలి.

తెల్ల దోమ –

  • తెల్ల దోమలు ఎక్కువగా నవంబర్ జనవరి మాసలలో పంటను ఆశిస్తాయి.
  • దోమ ఆశించిన పైరు లో ఆకులు, పిందెలు,రాలిపోవడమే కాక ఎదగాక ముందే పగిలిపోతుంది.పింజా నాణ్యత తగ్గిపోతుంది.
  • గింజలో నూనె శాతం కూడా తగ్గిపోతుంది.

ఎర్ర నల్లి-

  • పిల్ల పురుగులు గుంపులు గుంపులుగా చేరి ఆకు అడుగు భాగంలో రాసాన్ని పిలుస్తాయి.
  • ముదురు ఆకుల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాయల పెరుగుదల  ఆగిపోయి సరిగా పగలకుండా ఉండిపోతాయి.
  • నీటిలో కరిగే గంధకం 3 గ్రా. లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
Sap-Sucking Pest of Cotton

Sap-Sucking Pest of Cotton

పిండి పురుగు : పిల్ల పురుగులు మరియు పెద్ద పురుగులు పసుపు లేదా తెలుపు రంగులో  ఉండి ఆకులపై మరియు కొమ్మలపై తిరిగి రాసాన్ని పిలుస్తాయి.

  • ప్రస్తుతం సాగులో ఉన్నటువంటి బి. టి పత్తి ని పిండి నల్లి ఆశించి ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తుంది.
  • కలుపు నివారణ చేసుకోవాలి. ప్రత్తి మోళ్లను తగులబెట్టాలి. 
  • పురుగులు ఉధృతి ఎక్కువగా ఉంటే ట్రైజోఫాస్  లేదా ఏసీఫెట్ 3 మీ. లి. లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.

మురికి నల్లి : పురుగు ముదురు గోధుమ రంగులో ఉండి తలసుదిగా మొనదిలి ఉంటుంది. కాయపగిలే దశలో  పురుగు ఆశిస్తుంది.పురుగు పగిలిన కాయల నుండి గింజల నుండి రాసాన్ని పీల్చడం వలన దూది రంగు మరి నాణ్యత తగ్గిపోతుంది.

Also Read:Cotton-Climatic Conditions: ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో ప్రత్తి పంటలో తీసుకోవలసిన సస్యరక్షణ చర్యలు.!

Must Watch:

Also Watch:

Leave Your Comments

Maize(Corn) Products and Varieties: మొక్క జొన్న ఉప ఉత్పత్తులు మరియు రకాలు.!

Previous article

Soil Fertility Dicline: నేల సారం మరియు నేల ఉత్పాదకత తగ్గడానికి గల కారణాలు.!

Next article

You may also like