- ఈ తెగులు లక్షణాలు 2 దశల్లో కనిపించును.
- మొలకలు నేల పైకి రాకముందు ఈ దశలో మొలకెత్తినా విత్తనాలు నేల పైకి రాకముందే కుళ్ళి చనిపోతాయి ఈ దశలో.
- కొన్ని సార్లు విత్తనాలు మొలకెత్తకుండానే కుళ్ళి చనిపోవును.
- విత్తనం నుండి ప్రధమ మూలం ప్రధమ కాండం పూర్తిగా రాకముందే కుళ్ళిపోవును.
- ఈ దశలో తెగులు లక్షణాలన్నీ నెలలోనే జరుగును. కనుక దీనిని విత్తనం మొలకెత్త లేదని భావిస్తారు.
- మొలకలు నెల పైకి వచ్చిన తర్వాత విత్తనం మొలకెత్తి నేల పైకి వచ్చిన తర్వాత నీరు మొక్కల కాండం గట్టి పడే వరకు ఏ దశలో అయినా ఈ తెగులు ఆశించవచ్చు.
- సాధారణంగా తెగులు మొక్క యొక్క వేర్ల ద్వారా మరియు కాండం ద్వారా సోకుతుంది.
- తెగులు సోకిన భాగాలు మెత్తగా ఉండి నీటిని పీల్చుకున్నట్లు కనిపించును.
- తెగులు తీవ్రత వలన నేలను తగిలే కాండం వద్ద కుళ్ళి పోయి నేలపై విరిగి పడును.
- ఆరోగ్యంగా ఉన్న నారు మొక్కలు ఒకరోజులోనే ఈ తెగులు గురి అగును.
- సాధారణంగా నారు మొక్కలు చనిపోయే ముందు బీజదళాలు ఆకులు వాడకపోవడం.
- ఈ తెగులు ఆశించడం వలన నారు మడిలో మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోవును.
- లేత మొక్కలలోనే ఈ శిలీంద్రం తెగులును కలుగజేస్తుంది. కణజాలాలు గట్టి పడిన తర్వాత తెగులు సోకే అవకాశం తక్కువగా ఉంటుంది.
Also Read: Crop Protection in Chilli: మిరప సాగులో సస్యరక్షణ చర్యలు.!
అనుకూల పరిస్థితులు-
- నేలలో అధిక తేమ మరియు అధిక ఉష్ణోగ్రతా ఉండడం.
- బాగా చివకాని పశువుల ఎరువు వాడటం.
- గత పైరుకు సంబంధించిన మోళ్ళు, ఎండిన ఆకులుoడడం.
- మురుగు నీరు పోయే సౌకర్యం సరిగా లేకుండుట.
- పంట మార్పిడి చేయకపోవడం.
- నారు మడిలో విత్తన మోతదు ఎక్కువ వేయడం.
నివారణ-
- తేలిక పాటి నేలలో నారు మడి వేయాలి.
- భూ మట్టం కంటే 6-8 అంగుళాలు ఎక్కువగా నారు మడిలో విత్తనం పోయాలి.
- పొలాన్ని శుభ్రంగా దున్నలి.
- వైరస్ సోకిన మొక్కల నుండి విత్తనం సేకరించకూడదు.
- నారు మడిలో విత్తనాలు పల్చగా చల్లాలి.
- పూర్తిగా చివికిన పశువుల ఎరువు వాడాలి.
- తక్కువ మోతదు లో ఎక్కువ సార్లు నీరు పెట్టాలి.
- ఒకే మడిలో ప్రతి సంవత్సరం నారు పెంచరాదు.
- తేలిక పాటి నేలలో నారు మడి వేయాలి.
- అధిక మోతదు లో నత్రజని వాడరాదు.
- నారు మడి వేసే స్థలంలో నేలపై చెత్త వేసి కాల్చాలి.
- థైరామ్ లేదా కెప్టెన్ 3 గ్రా. 1 కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి.
- నారుమడి కోసిన తర్వాత 10-15 రోజుల వ్యవధిలో మాంకొజెబ్25% లేదా కార్బడిజం 0.1% మందును నేల తడిచేలా పిచికారీ చేయాలి.
Also Read: Yellow Chilli: పసుపు రంగు మిరప సాగు సస్య రక్షణ.!
Leave Your Comments