Citrus Canker Disease: ఈ తెగులు జాంతోమోనాస్ కాంపైస్టిస్ సిట్రి అను బాక్టీరియా వలన కలుగుతుంది. తెగులు లక్షణాలు ఆకుల, కొమ్మలు, పత్రవృంతాలు, కాయ తొడిమలు కాయలు మరియు ముల్లపైన వేర్లమీద కనిపించును. తెగులు తొలిదశలో ఆకులపైన పసుపు పచ్చని మచ్చలవలే ఆగుపించి నెమ్మదిగా పెరిగి గరకు ఉబ్బెత్తులుగా ఆగుపించును. ఆకులపై ఈ మచ్చల చుట్టు పసుపు పచ్చని వలయం కనపడును.
ఆకుల పై ఈ మచ్చలు ఎక్కువైతే ఆకులు రాలిపోతాయి. చిన్న కొమ్మల పై గజ్జి తెగులు విపరీతంగా రావటం వలన కొమ్మలు ఎండిపోయి ఎండీపుల్ల ఎక్కువగా పడి కాపు తగ్గిపోతుంది. కాయలపై గజ్జి మచ్చలు ఏర్పడును కాని పసుపు పచ్చని వలయం ఉండదు. గజ్జి తెగులు కాయలపై మార్కెట్టులో తక్కువ ధర పలుకును . గడ్డి తెగులు నిమ్మ వేర్లపైన కూడా సన్నని గారుకుగా నుండి బుడిపేల మాదిరి రావచ్చును. దీని వలన నిమ్మచెట్టు త్వరగా క్షిణించిపోతాయి.
తెగులు సోకిన ఆకులు, కొమ్మల ద్వారా ఒక ఋతువుకు తెగులు వ్యాపించును. మొక్క యొక్క లేత బాగాలకు తెగులు తొందరగా వ్యాపించును. ముదురుకుల్లోను, కొమ్మలపైన కాయల మీద బాక్టీరియా జీవిస్తూ వర్షం వలన కొత్త ఆకులకు , కొమ్మలకు వ్యాపిస్తుంది. ఆకుముడత పురుగుల వలన బాక్టీరియా ఒక చెట్టు నుండి వేరొక చెట్టుకు వ్యాపించును. గాలికి ఆకులు కదిలేటప్పుడు ముండ్లు తగిలి అయిన గాయాల ద్వారా బాక్టీరియా సులభంగా వ్యాపిస్తాయి. వర్షాకాలంలోను, చలి కాలంలోను గజ్జి తెగులు ఎక్కువగా వస్తుంది.
నివారణ:- మన వాతావరణ పరిస్థితులలో ఈ తెగులును మందుల వల్ల పూర్తిగా అరికట్టలేము. వీలైనంత వరకు గజ్జి తెగులు లేని నిమ్మ మొక్కలను ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా మొదలు పై గజ్జి తెగులు ఉన్న మొక్కలను పొలంలో నాటరాదు.
Also Read: Lemon Health Benefits: నిమ్మకాయతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా.!
నారు మళ్లు పెంచు రైతులు, నారు మళ్లలలో మొదటి నుండి ఈ తెగులును అదుపులో పెట్టాలి. ప్రతి 15-20 రోజుల కొకసారి మాంకొజెట్ మందు 20 గ్రాములు, రాగి ధాతు సంబంధమైన మందు 30 గ్రాములు -10 లీటర్ల నీటికి లేదా అగ్రిమోసిన్ ఒక గ్రామ మరియు రాగి దాతు సంబంధమైన మందు 30 గ్రాములు 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఒక కిలో వేప పిండి 20లీటర్ల నీటిలో వారం రోజులు నానబెట్టి నారు మళ్లలో చల్లాలి. వర్షాకాలానికి ముందుగా తెగులు తగిలిన కొమ్మలను కత్తిరించి తగులబెట్టాలి. ఆ తరువాత పైన వివరించిన మందులను వర్షాకాలంలో లేత చిగురుల పై 15 నుండి 20 రోజుల వ్యవధిలో రెండు మూడు సార్లు చల్లాలి.
నిమ్మ తోటలలో మొదలు పైనా , పెద్ద కొమ్మల పైన గజ్జి తెగులు ఉండే, తెగులు ఉన్న బెరడును కత్తితో తీసివేసి , బోర్డు వేస్టు పూత పూయాలి. కాయల పై గజ్జి మచ్చలు రాకుండా నివారించుటకు అగ్రిమైసిస్ మరియు రాగి ధాతు సంబంధించిన మందుగాని లేక 500 నుండి 1000 పి. పి. యమ్ స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ లేక ఫైటోమైసిన్ పిచికారి చేసి కూడా తెగులును అరికట్టవచ్చును. తెగుళ్ళు తట్టుకుని మంచి దిగుబడి నాణ్యమైన పండ్లను ఇచ్చె తెనాలి సెలక్షన్, బాలాజీ వంటి రకాలను ఎంచుకోవాలి.
Also Read: Ganoderma Root rot in Lemon: నిమ్మలో గానోడెర్మా వేరు కుళ్లు తెగులు