Mango Plantations: ప్రస్తుతం మామిడి పూత, పిందె దశలో ఉన్నది. ఈ దశలో చేపట్టాల్సిన సస్యరక్షణ మరియు యాజమాన్య చర్యలు అత్యంత తరుణంలో రసంపీల్చు పురుగులైన తామర పురుగులు, తేనెమంచు పురుగు, పిండినల్లి మరియు గూడు పురుగు మరియు తెగుళ్ళలో బూడిద తెగులు, ఆంత్రాక్నోస్, నల్లమచ్చ తెగుళ్ళ ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశం కలదు. చీడపీడలను సకాలంలో నివారిస్తూ కొన్ని ఇతర యాజమాన్యం చర్యలు ఆచరించిన యెడల అధిక దిగుబడితో పాటు నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చును.
పురుగులు
తామర పురుగులు (మంగు రోగము):
• లేత పసుపు రంగులో చీలిన రెక్కలతో ఉండే తల్లి, పిల్ల పురుగులు (కోడి పేను లాగ) మొక్క అన్ని లేత భాగాలను ఆశిస్తుంది.
• తల్లి, పిల్ల పురుగులు లేత ఆకులు, పూల గెలలు, లేత ఏందెలను ఆశించి గోకి రసం పీల్చును. దీని వలన ఆకులు ముడుచుకుపోయి, ఎండిపోవటం, వూత రాలటం, పిందెలపై గోధుమ రంగు గరుకు మచ్చలు (మంగు) ఏర్పడి దిగుబడిని తగ్గించడమే కాకుండా నాణ్యతను దెబ్బతీస్తుంది.
నివారణ చర్యలు :
• తోటలలో కలుపు మొక్కలు ప్రధానంగా వయ్యారిభామ లాంటివి లేకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త వహించాలి.
• లేత ఆకులు ఏర్పడిన దశలో మరియు పచ్చిపూత దశలో అవసరం మేరకు పురుగు మందులు ఎసిఫేట్ 1.5గ్రా. లేదా ఫిప్రోనిల్ 2.0 మి.లీ. లేదా డైమిథోయేట్ 2.0 మి.లీ. ఒక లీటరు నీటికి డిటర్జెంట్ పౌడర్ లేదా బంక మందులు కలిపి పిచికారి చేయాలి.
Also Read: Castor Pests and Diseases: ఆముదం సాగులో చీడపీడలు – నివారణ.!
బూడిద తెగులు :
• పూత దశలో మంచు, తక్కువ ఉష్ణోగ్రత లేదా చిరుజల్లులు పడిన యెడల ఈ తెగులు ఎక్కువగా ఆశించి విపరీత నష్టం కలుగజేస్తుంది.
తెగులు ఆశించిన పూలపై తెల్లని బూడిద లాగ బూజు ఏర్పడును. దీనివలన పూత, లేత పిందెలు విపరీతంగా రాలిపోతాయి.
నివారణ చర్యలు:
ఒక లీటరు నీటికి 2.5 గ్రా. నీటిలో కరిగే గంధకం లేదా 2 మి.లీ. కారథేన్ లేదా ఒక గ్రా. ట్రైడిమార్ఫ్ లేదా మైక్రోబుటానిల్ లాంటి మందులను తప్పకుండా పిచికారి చేయాలి.
నీటి వసతి లేని తోటలలో ఒక లీటరు నీటికి 20 గ్రా. యూరియా లేదా 10-20 గ్రా. 17:17:17 (పాలీఫీడ్ లాంటి లేదా 0:14:28 మల్టీ-కే లాంటి) పిచికారి చేసిన యెడల పిందె రాలుట తగ్గి కాయ త్వరగా ఎదుగును.
కాయ గోలి సైజులో ఉన్నప్పుడు నీరు కట్టేటప్పుడు చెట్టు వయస్సును బట్టి 500-1000 గ్రా. యూరియా+ యం.ఓ.పి పొటాష్ వేయాలి.
Also Read: Pest Management in Mango: మామిడిలో గూడు పురుగు మరియు ఆంత్రాక్నోస్ తెగులు.!