Rabi Peanuts: వేరుశనగ పై వివిధ రకాల పురుగులు తెగుళ్లు వివిధ దశల్లో ఆశించి నష్టం కలుగజేస్తాయి నీటి పారుదల కింద సాగుచేసే వేరుశనగలో ముఖ్యంగా పొగాకు లద్దె పురుగు, మొదలు కుళ్ళు, కాండం కుళ్ళు తెగుళ్ల సమస్య అధికంగా ఉంటుంది. అంతేకాక రబీ వేరుశనగలో లోపం ఎక్కువగా ఉంటుంది. ఇనుప ధాతువు లోపం కూడా ఉన్నప్పుడు లేత ఆకులు మొదటగా పసుపుపచ్చగా తరువాత తెలుపు రంగుకు మారుతాయి. ఈ లోపం కనిపించినప్పుడు ఎకరాకు ఒక కిలో అన్నభేది (ఐరన్సల్ఫేట్) మరియు 200 గ్రాముల సిట్రిక్ ఆమ్లాన్ని 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి.

Rabi Peanuts
పొగాకు లద్దె పురుగు: తల్లి పురుగులు ఆకుల అడుగు భాగంలో గుంపులుగా గుడ్లను పెడతాయి. వీటి నుండి వచ్చిన పిల్ల పురుగులు ఆకులపై పత్రహరితాన్ని గోకి వేసి జల్లెడలాగా మారుస్తాయి. పెద్ద పురుగులు ఆకులను పూర్తిగా తినేస్తాయి. ఇవి పగలు చెట్ల క్రింద, రాళ్లు, మట్టి పెళ్ళాల అడుగు భాగాన ఉండి, రాత్రిళ్లు పంట నష్టం కలిగిస్తాయి. పిల్ల పురుగులు గమనించినప్పుడు 5 శాతం వేపగింజల కషాయం లేదా వేప నూనె ఐదు మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
పురుగులు గమనించినప్పుడు విషపు ఎరను (వరి తవుడు ఐదు కిలోలు బెల్లం అరకిలో మరియు క్లోరిపైరిఫాస్ 500 మిల్లీ లీటరు కలిపి) తయారు చేసి, చిన్న ఉండలుగా చేసుకొని ఎకరం పొలంలో సాయంత్రం పూట చల్లాలి. లేదా థయోడికార్బ్ ఒక గ్రామం లేదా రినాక్సిఫైర్ 0.25 మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

Aphids, Thrips in Tobacco Crop
పచ్చ పురుగు: పురుగు పూర్తిగా విచ్చుకొని ఆకులను తినడం వలన ఆ ఆకులు విచ్చుకున్న తరువాత నాలుగు ఆకుల్లోనూ ఒకేచోట రంధ్రాలు గమనించవచ్చు. ఈ పురుగును గమనించినప్పుడు క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీ లీటర్లు లేదా క్వినాల్ ఫాస్ 2.0 మిల్లీ లీటర్లు లేదా థయోడికార్బ్ ఒక గ్రాము లేదా రినాక్సిపైర్ 0.25 మిల్లీ లీటర్లు చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
పేనుబంక (నల్ల పేను): ఈ పురుగులు నలుపు రంగులో ఉండి మొక్కల కొమ్మల చివర్ల పైన, లేత ఆకుల అడుగుభాగాన గుంపులుగా ఉండి రసాన్ని పీలుస్తాయి. దీనివల్ల ఉండడం గమనించవచ్చు
పచ్చ దోమ: ఈ పురుగులు ఆకుల అడుగుభాగాన చేరి రసాన్ని పీల్చడం వల్ల మొదట ఆకు పైభాగాన ‘‘వి’’ ఆకారంలో పసుపు పచ్చని మచ్చలు ఏర్పడి క్రమేపీ ఆకులన్నీ పసుపుపచ్చగా మారతాయి ఈ రసం పీల్చు పురుగులను గమనించినప్పుడు డైమిథోయేట్ 2 మి.లీ లీటరు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీ లీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీ లీటర్లు చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

Ladde Purugu
మొదలు కుళ్ళు తెగులు: ఈ తెగులు ఆశించినప్పుడు విత్తనం మొలకెత్తిన తర్వాత కాండం పైన నల్లని శిలీంధ్ర బీజాలతో కప్పబడి ఉంటుంది. భూమి దగ్గర ఉండే కాండం మీద మచ్చలు ఏర్పడి క్రమంగా పైకి వ్యాపిస్తాయి. తెగులు ఆశించిన మొక్కలు వడలిపోయి చనిపోతాయి దీని నివారణకు విత్తే ముందు కిలో విత్తనానికి ఒక గ్రామం ట్రెబుకొనజోల్ డి.యస్ లేక మూడు గ్రాములు మాంకోజెబ్ చొప్పున కలిపి విత్తనశుద్ధి చేయాలి. తెగులు ఆశించిన వెంటనే ఎకరాకు 400 గ్రాములు మాంకోజెబ్ మందును 200 గ్రాముల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
మొవ్వు కుళ్ళు వైరస్ తెగులు: ఈ తెగులు ఆశించినప్పుడు మొవ్వు ఎండిపోయి మొక్కలు కురచబడి ఎక్కువ రెమ్మలు వస్తాయి. లేత దశలో ఆశిస్తే కాయలు ఏర్పడవు. ఇది తామర పురుగుల ద్వారా వ్యాపిస్తుంది. ఇటువంటి మొక్కలను గమనించినప్పుడు వాటిని పీకివేసి మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీ లీటర్లు లేదా డైమిథోయేట్ 2 మి.లీ లీటర్ల చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి నివారణకు విత్తనశుద్ధి తప్పనిసరిగా చేయాలి.
కాండం కుళ్ళు తెగులు: ఈ తెగులు విత్తిన 70 రోజుల నుండి ఆశిస్తుంది. తొలుత తెగులు ఆశించినప్పుడు మొక్క మొదల్లో ఉన్న శాఖలు పసుపు రంగుకు మారి ఎండిపోతాయి. తరువాత భూమిపై ఉన్న కాండం మీద ఏర్పడుతుంది. ఊడలు కాయలు కూడా తెగులుకు లోనై గింజలపై మచ్చలు ఏర్పడతాయి. కేవలం పై భాగాలు మాత్రమే ఊడి వస్తాయి. తెగులును పొలంలో గమనించినప్పుడు హెక్సాకొనజోల్ రెండు మిల్లీ లీటర్లు చొప్పున లీటరు నీటికి కలిపి మొదలు తడిచేటట్లు పిచికారీ చేయాలి. కోత దశలో ఎకరాకు 200 కిలోల విత్తనం వేసినట్లయితే తెగులు ఉధృతిని తగ్గించవచ్చు.
జి. భార్గవి డా.బి దీపక్ రెడ్డి, డా.ఎస్ మధుసూదన్ రెడ్డి, వ్యవసాయ కళాశాల,
అశ్వరావుపేట, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ.
Leave Your Comments