Cauliflower Physical Defects – బట్టనింగ్: చిన్న చిన్న పువ్వులు ఏర్పడడాన్ని బట్టనింగ్ అంటారు.ముదురు నారు నాటుకోవడం నత్రజని లోపం వల్ల స్వల్పకాలిక రకాలను ఆలస్యంగా నాటటడం వలన ఈ సమస్య వస్తుంది. దీని నివారణకు 21-25 రోజుల వయసు గల నారును నాటుకోవాలి.నత్రజని తగినంత మోతదులో వేసుకోవాలి.స్వల్పకాలిక రకాలను సరైన సమయంలో నాటుకోవాలి.
రైసినేన్: వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగితే పువ్వు వదులుగా విచ్చుకునట్లుగా అయ్యి పువ్వు గడ్డపై వస్తుంది.దీని వల్ల మార్కెట్ విలువ తగ్గుతుంది.దీని నివారణకు అధిక ఉష్ణోగ్రతా తట్టుకొనే రకాలను వేసుకోవాలి. పువ్వులను సరైన సమయంలో ఆలస్యం చేయకుండా కోత కోయాలి.
బ్రౌనింగ్: క్షార నెలలో పెంచే పంటలో బోరాన్ లోపం ఎక్కువగా వస్తుంది.బోరాన్ దాతులోపం వలన పువ్వుపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి.కాండం గుల్లగా మరి నీరు కారుతుంది.దీని నివారణకు ఆఖరి దుక్కిలో 20 కేజీల చొప్పున బోరాక్సను వేయాలి.లేదా లీటర్ నీటికి 3 గ్రాముల బోరిక్ ఆసిడ్ ను కలిపి పువ్వు గడ్డ ఏర్పడే దశలో పిచికారీ చేయాలి.
Also Read: Vegetable Nursery Preparation: కూరగాయల నారుమడి తయారీ.!

Cauliflower Physical Defects
విప్ టైల్: కొరడా తెగులు – దీని లోపం వలన ఆకులు పసుపుగా మరి అంచులు తెల్లబడతాయి.లోపం తీవ్రత ఎక్కువగా ఉంటే ఒక మధ్య ఈనె మాత్రమే ఉంటుంది.దీనినే కోరాడ తెగులు అంటారు.నత్రజని ఎక్కువగా ఉంటే ఈ లోపం కనిపిస్తుంది.సరియైన మోతదు లో నత్రజని వేయాలి.ఒక హేక్టర్ కు 1-2 కేజీ సోడియం వేసి 800 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
బ్లాంచింగ్: పూగోబీ తెల్లగా ఉండాలి అంటే పెరుగుతున్న పువ్వు లోనికి సూర్యరశ్మి చేరకుండా జాగ్రత్త పడాలి.దీనికి గాను పువ్వు చుట్టూ ఉన్న ఆకులలో చివరి వరుస ఆకులను పువ్వు మీద కప్పుతూ, దారం తో లేదా రబ్బరు బాండ్ తో కట్టాలి.ప్రతి రోజు వివిధ రంగుల దారాలతో కానీ రబ్బరు బాండ్‌తో కానీ కట్టడం వలన కోత సమయంలో ఏది ముందు కట్టినది సులభంగా తెలుసుకొనుటకు వీలగును ఈ ప్రక్రియను బ్లాంచింగ్ అంటారు.
ఎరువులు: హెక్టారుకు సుమారు 40-50 కేజీల భాస్వరం 50కిలోల పోటాష్ ఎరువులను ఆఖరి దుక్కిలో వేయాలి.తరువాత హెక్టారుకు 60-80 కిలోల నత్రజని మూడు సమా భాగాలుగా వేసి తోలి సారి నారు నాటిన 25-30 రోజులకు రెండోవ సారి వేయాలి.క్యాలిఫ్లవర్ సాధారణంగా ఆమ్లా, క్షర భూమిలో పండించినప్పుడు బోరాన్ లోపం ఏర్పడుతుంది. దీనికి గాను బోరిక్ ఆసిడ్ 0.3-0.4 %రెండు సార్లు మొక్కలు నాటిన రెండు వారల తర్వాత మరియు పువ్వు ఏర్పడడానికి రెండు వారల ముందు మొక్కలపై పిచికారీ చేయాలి.
Also Read: Barseem grass Cultivation: బర్సీమ్ గడ్డి సాగు.!