Pests of Mulberry Plants – బీహారి గొంగళి పురుగు: అన్ని కాలాల్లోనూ ఆశిస్తుంది. ఆకుల పత్ర హరితన్ని గోకి తినడం వల్ల ఆకులు ఎండిపోయినట్లు కనిపిస్తాయి. దీని నివారణకు గుడ్ల సముదాయాన్ని ఏరి వేయాలి. వేసవి దుక్కి దున్నుట వలన కోశస్థ దశలను పక్షులు ఏరుకొని తింటాయి.మల్బరీ తోట చుట్టూ కందకం త్రవ్వి దానిలో మీధైల్ పరాధియాన్ మందును 1.5% చల్లినట్లుయితే గొంగళి పురుగు వేరే తోటలోనికి వలస పోకుండా చూడవచ్చు.నివారణకు డైక్లోరోవాన్ 0.2% మందును 0.5% సబ్బు ద్రావణంతో కలిపి పిచికారీ చేయాలి.పిచికారీ చేసిన 12-13 రోజుల తర్వాతనే ఆకులను కోయాలి.
పిండి నల్లి: అన్ని కాలాల్లోనూ ఆశిస్తుంది.ఆకులు ముడుచుకొని పోయి గిడసబారి పోతాయి.పిండి నల్లి పిల్లలు మొదలు పై తిరుగుతూ కనిపిస్తాయి.నివారణకు క్రిప్టోలీమాస్ మాంట్రీజరీ బదనికలు ఎకరాకు 250 వదిలి పెట్టాలి.డైక్లోరోవాన్ లేదా మోనోక్రోటోఫాస్ 0.2%,0.5% సబ్బు ద్రావణంలో కలిపి 10-12 రోజుల వ్యవధిలో వారానికి 2 సార్లు పిచికారీ చేయాలి. డైక్లోరోవాస్ స్ప్రే చేసిన మూడు రోజుల వరకు మరియు మీధైల్ డెమటాన్ స్ప్రే చేసిన 20 రోజుల వరకు ఆకులను కోయరాదు.
Also Read: Mulberry Harvesting: మల్బరీ ఆకు తెంపు విధానం మరియు నిల్వ చేయు విధానం గురించి తెలుసుకుందాం.!
తామర పురుగు: అన్ని కాలాల్లో ఆశిస్తుంది.లేత ఆకులు వాడాలి రాలిపోతాయి. ఆకులపై చారాలు ఏర్పడతాయి.స్కోలియోత్రిప్స్ ఇండికాస్ అనే తామర పురుగును వదిలి పెట్టాలి.నివారణకు డైక్లోరోవాస్ 0.2% లేదా డైమీథోయేట్ 0.1% పిచికారీ చేయాలి.పిచికారీ చేసిన తర్వాత ఆకులను 3-15 రోజుల తరువాత కోయాలి.
నల్లి: అన్ని కాలాల్లో ఆశిస్తుంది మరియు ముఖ్యంగా మార్చ్ – ఏప్రియల్ నేలల్లో ఎక్కువగా ఆశిస్తుంది.ఆకులు వాడాలి ఎండిపోతాయి.ఆకులపై పెద్ద పెద్ద మచ్చలు ఏర్పడతాయి.నల్లి నివారణకు ఎండిన కొమ్మలను కత్తిరించి వేయాలి. మల్బరీ కట్టింగ్స్ ను 0.1% మోనోక్రోటోఫాస్ లో నానబెట్టాలి.ఫాసలోన్ 0.1% పిచికారీ చేయాలి.డైకోఫాల్ 5మీ. లి. లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.స్ప్రే చేసిన 9 రోజుల వరకు ఆకులను కోయరాదు.
Also Read: Mulberry Cultivation: మల్బరీ తోటలో ప్రూనింగ్ వల్ల లాభాలు మరియు నీటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం.!