Pests in Redgram Cultivation: దక్షిణ భారతదేశంలో కంది పంటకు ఈ పురుగు నవంబర్ నుండి మార్చ్ వరకు చాలా నష్టాన్ని కలుగజేస్తుంది. రెక్కల పురుగులు ఎండిన గడ్డి రంగులో సన్నని పొడవైన ఈక వంటి రెక్కలు కలిగి ఉండును.
లద్దె పురుగు: శరీరం లేత ఆకు పచ్చ రంగులో ఉండి చిన్న చిన్న ముళ్ళు కలిగి శరీరం అంత సన్నని వెంట్రుకలతో కప్పబడి ఉండును. ఈ లద్దె పురుగు కాయలోనికి ప్రవేశించి గింజలను పూర్తిగా తింటాయి.శనగ పచ్చ పురుగు వాలే ఇవి కూడా తల భాగాన్ని కాయ లోపల ఉంచి మిగతా శరీరాన్ని బయట ఉంచి గింజలను తింటాయి. లద్దె పురుగు పువ్వు మొగ్గలను, పువ్వులను తింటాయి.
లద్దె పురుగు గోధుమ రంగులో ప్యూపాలు గా కాయల పై ఉంటాయి.
కంది కాయ మీద ఈ లద్దె పురుగులు చేసిన రాంద్రలు శనగ పచ్చ పురుగు వలన కలిగిన రంధ్రాల కంటే చిన్నవి గా ఉంటాయి. దీని నివారణకు ఎండోసల్ఫాన్ 2 మీ. లి లేదా కార్బరిల్ 3 గ్రా.లేదా ఫెనవలరేట్ 1 మీ. లీ. లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
Also Read: TS Agri Minister: వ్యవసాయం వృత్తి కాదు జీవితం – మంత్రి నిరంజన్ రెడ్డి

Pests in Redgram Cultivation
కాయ తోలుచు ఆకు మచ్చ పురుగు: రెక్కల పురుగు ముందు జత రెక్కలు లేత గోధుమ రంగులో లేదా బూడిద రంగులో ఉండి అంచులపై తెల్లని మెరుస్తున్న చారాలు ఏర్పడతాయి.గుడ్ల నుంచి వచ్చే చిన్న చిన్న పురుగులు మొదట్లో ఆకు పచ్చగా ఉండి పెరిగే కొద్ది గులాబీ రంగు లేదా లేత ఎరుపు రంగులోకి మారును.
లద్దె పురుగు తోలి దశలో పూ మొగ్గలను ఆశించి తరువాత కాయలను తోలుచుకుంటూ లోపలికి ప్రవేశించి లోపలి గింజలను తింటాయి.
లార్వా విసర్జించిన విసర్జత పదార్ధం కాదు లోపం ఉంటుంది.
ప్యూప దశ 2-4 వారలు ఉంటుంది. నివారణకు ఎండోసల్ఫాన్ లేదా కార్బరిల్ 3గ్రా.లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మీ. లీ.ఫెనవలరేట్ 1 మీ. లీ. లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
Also Read: Redgram Cultivation: కంది సాగు.!