Pesticides storage: వివిధ రకాల పంటల నాశించి నష్ట పరుస్తున్న పురుగులను, తెగుళ్ళను నివారించడానికి సిఫారసు చేసిన సస్యరక్షణ మందులను వాడాలి. అయితే ఈ మందులను వంటపై పిచికారి చేయడానికి సరైన పరికరాన్ని ఎంపిక చేసుకోవడం కూడా పంటల సస్యరక్షణలో ప్రధానమైన అంశం. అయితే సస్యరక్షణ పరికరం ఎంపిక, పైరురకం, ఎత్తు, ఒత్తును బట్టి పైరులో పురుగులు ఆశించే భాగాలు, చీడపీడల ఉధృతి పై ఆధారపడి ఉంటుంది. సమగ్ర సస్యరక్షణలో మందుల వాడకం తప్పనిసరి అయినా వాటిని చివరి ఆయుధంగా మాత్రమే ఉపయోగించాలి. పురుగుల స్వభావం, వాటిస్థాయి తెలుసుకోకుండా చల్లితే ప్రతికూల ఫలితాలు ఏర్పడుతాయి. నేడు వివిధ వ్యాపార సంస్థలు లక్షల టన్నుల పురుగుల మందుల్ని ఉత్పత్తి చేస్తున్నారంటే సస్యరక్షణలో వాటి ప్రాముఖ్యం ఏమిటో తెలుస్తోంది.
పురుగు మందుల వాడకం నిల్వ:
పురుగు మందులకు సరైన లేబుల్స్ అతికించి చల్లగా, పొడిగా ఉండే గదిలో పిల్లలకు అందు బాటులోలేని ప్రదేశంలో తాళం వేసి ఉంచాలి.మందు ద్రావణాన్ని తయారు చేసే ముందు లేబుల్ పైన ఉన్న సమాచారాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న తర్వాత సరైన కొలతలను ఉపయోగించి నిర్దేశించిన మోతాదులో మందును, నీటిని కలపాలి.
Also Read: Optimum Plant Population: మొక్కల సాంద్రతను దోహదం చేసే అంశాలు.!
మందు ద్రావణాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ చేతితో కలుపరాదు.మందు మిశ్రమాన్ని తయారు చేసేటప్పుడు గాని, టాంకులో నింపేటప్పుడు గాని పైన పడకుండా జాగ్రత్త వహించాలి.సరైన వస్త్రాలను, తొడుగులను ధరించి మందులు చల్లాలి. శరీరంలోని ఏ భాగం పురుగు మందుకు గురికాకుండా చూసుకోవాలి.మందు మిశ్రమాన్ని పిచికారీ చేసేటపుడు లేదా పొడి మందులను చల్లేప్పుడు గాలికి ఎదురుగాచల్లరాదు.
పురుగు మందులు పిచికారి చేసేటపుడు తిను బండారాలు తినడం, బీడి, సిగరెట్లు వంటివి.తాగటం, పొగాకు నమలటం వంటివి చేయరాదు.సస్యరక్షణ పరికరాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకొని పాడైన భాగాలను మరమ్మత్తులు చేయించుకోవాలి. స్ప్రేయరు నాజిల్స్ను నోటితో ఊదరాదు.మిగిలిన మందు మిశ్రమాన్ని, పరికరాలను చెరువుల్లో గాని, కాలువల్లో గాని శుభ్రం చేయరాదు. అలా చేస్తే ఆ నీరు కలుషితమౌతుంది.ఖాళీ మందు డబ్బాలను వాడిన వెంటనే నాశనం చేయాలి లేక భూమిలో ఒక ప్రదేశంలో పాతిపెట్టాలి. పిచికారీ చేసిన వెంటనే శుభ్రంగా స్నానం చేసి ఎలాంటి పురుగు మందు అవశేషాలు లేకుండా జాగ్రత్తగా వహించాలి.పురుగు మందులు చల్లిన పొలంలోకి ఇతర రైతుల పశువులు రాకుండా ఉండేందుకు వారికి తెలియ చేయాలి.
Also Read: Nitrogen Fixing Biofertilizers: నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులతో ఎన్నో లాభాలు.!