Pest Management in Sugarcane – చెరకు రకముల అంతర రాష్ట్ర రవాణాపై నియంత్రణ:- శాస్త్ర వేత్తలను సంప్రదించకుండా పొరుగు రాష్ట్రాల నుండి క్రొత్తరకాలు తెచ్చి కొన్ని ప్రాంతాలలో సాగుచేయడం వల్ల ఎఱ్ఱకుళ్ళు తెగులు మన రాష్ట్రంలో వ్యాప్తి చెందుతుంది. కాబట్టి శాస్త్ర వేత్తలు సిఫారసు లేకుండా ఒక రాష్ట్రం నుండి వేరొక రాష్ట్రనికి క్రొత్త రకాలు తీసుకొని వచ్చే పద్దతి పై నిర్థిష్టమైన చర్యలు విధించాలి.
సాగు పద్ధతులు:- లోతు దుక్కి చేయడం వలన ఎఱ్ఱకుళ్ళు కాటుక తెగులు, వడల తెగుళ్లు శీలింద్రలతో కూడిన చెరకు చెత్త బయటకు తీసివేయుటకు వీలవుతుంది. తెగులు సోకిన, ఆరోగ్య వంతమైన తోటలనుండి విత్తనం వాడాలి.
పొలంలోను, గట్ట మిద కలుపు మొక్కలు లేకుండా శుభ్రంగా ఉంచాలి.
తోటలు పడిపోకుండా జడ చుట్టు పద్ధతిలో నిలకట్టాలి.
తెగులు సోకిన దుబ్బులను సమూలంగా తీసి తగులబెట్టాలి.
సరియైన సాగు నీరు మరియు మురుగు నీరు పోయే సౌకర్యం ఏర్పాటు చేయాలి.
తెగులు సోకిన తోటలను త్వరగా నరకాలి.
తోట నరికిన తర్వాత మిగిలిన చెత్తను కాల్చివేయాలి.
కర్శి మొళ్ళను భూ మట్టానికి నారుకుట వల్ల కాటుక తెగులు ఉధృతిని తగ్గించవచ్చు.
మొక్క తోటలో తెగులు ఉదృతంగా ఉండే కర్శి చేయడం మానివేయాలి. తక్కువగా ఉండే ఒక్క కర్శికె పరిమితం చేయాలి.
పంట మార్పిడి విధానం ఆవలనభించాలి.
Also Read: Sugarcane Juicer Machine: చెరకు రసం తీయు యంత్రాలు

Pest Management in Sugarcane
ఎరువుల యాజమాన్యం:-
పచ్చి రొట్ట ఎరువులను , సేంద్రియ ఎరువులను వాడటం వల్ల భూమిలో తెగుళ్లును కలుగజేసే సూక్ష్మ జీవులను అరికట్టే శీలింద్రలు, బాక్టీరియా అభివృద్ధి చెందుతాయి. హెక్టరుకి 120 కిలోల పోటాష్ ఎరువు వేయడం వల్ల వడలు తెగులును తగ్గించవచ్చును.
సిఫారసు చేసిన మేరకు మాత్రమే నత్రజని ఎరువులు వాడాలి.
వేడి నీటి శుద్ధి:-
విత్తనపు ముచ్చేలను వేడినీటిలో 52 ° సి వద్ద కార్బండిజం 0.1 శాతం మందు కలిపి 30 నిముషాలు శుద్ధి చేయాలి.
గాలిలో మిళితమైన వేడి ఆవిరిలో ముచ్చేలను 50° సి వద్ద 1 గంట శుద్ధి చేసినపుడు గడ్డ దుబ్బు తెగులు 51°సి వద్ద 2 గంటలు శుద్ధి చేసినపుడు కాటుక తెగులు అరికట్టబడతాయి.
తెగులు నిరోధక రకాలు:-
ఎర్రకుల్లు తెగులు – కో 7706, కో -7602, కోటి 8201, కో8021, కో అర్8001, కో8013, కో ఎ8402, 85ఎ30, 87ఎ 397, 83వి 15. సహజ పరిస్థితులలో తట్టుకొనే రకాలు – కో 6907, కో 7219, 86ఎ 146
కాటుక తెగులు -కో 7706, కో 8011, 81ఎ99, కో7805.
వడలి తెగులు – కో-7219, కో7706.
గడ్డి దుబ్బు తెగులు -కో6907.
శీలింద్ర నాశన ముందులు వాడకం:-
కాటుక తెగులు నివారణకు విత్తనాన్ని నాటే ముందు ప్రొపికొనజోల్ 0.05 శాతం మందు ద్రావణంలో 15 నిముషాలు ముంచి నాటాలి. కర్శి చేసిన వెంటనే ఒకసారి 30 రోజులకు మరొకసారి ప్రోపికొనజోల్ లేదా హెక్సకొనజోల్ డబ్బుల పై పిచికారీ చేయాలి.
జీవనియంత్రణ:-
ట్రైకోడెర్మ విరిడి, ట్రైకోడెర్మ హార్జయానాం లను భూమిలోను, విత్తిన శుద్ధిగాను చేసి ఎర్రకుళ్ళు తెగులును కొంతవరకు నివారించవచ్చు.
Also Read: Integrated Pest Management in Sugarcane: చెఱకు పైరు నాశించు తెగుళ్ల సమగ్ర యాజమాన్య చర్యలు.!