Pest Management In Sapota: ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సుమారుగా 15,400 హెక్టార్లలో సాగవుతోంది. ఈ పంట ప్రతికూల వాతావరణ పరిస్థితు లను తట్టుకుని క్షార స్వభావం, అధిక లవణ గుణాలున్న నేలల్లో కూడా పెరుగుతుంది.
సున్నం అధ కంగా ఉన్న నేలల్లో సపోట పంటను వేయరాదు. సపోట పండులో చక్కెరతో పాటుగా కాల్షియం, విటమిన్ ‘సి’ కూడా ఉండటంవల్ల దీనిని పిల్లలతో పాటు పెద్దలు కూడా తినవచ్చు. సపోట పంటను వాణిజ్యపరంగా సాగు చేయాలనుకునే రైతులు ప్రాచుర్యంలో ఉన్న కాలిపత్తి, సపోట రకాలను ఎంపిక చేసుకోవాలి. పంట వేసిన తర్వాత 6 నుంచి 7 సంవత్స రాల వరకు వివిధ రకాల కూరగాయ పండించవచ్చు. సపోట పంటను మిగిలిన పండ్ల తోటల కంటే కూడా తక్కువ పెట్టుబడితో పండించవచ్చు. అయితే పంట వయస్సును బట్టి ఎరువులను, చీడపీడలను గమనించుకుని సస్యరక్షణ పాటించున్నట్లయితే నాణ్యమైన దిగుబడులను సాధించవచ్చు.
ఆకుగూడు పురుగు: రెక్కల పురుగు బూడిద రంగులో చిన్నగా ఉండి పూమొగ్గలపై, లేత ఆకులపై గుడ్లను పెడుతుంది. గొంగళి పురుగు గులాబీ, గోధుమ రంగులో ఉండి లేత ఆకులను గూడుగా చేసి లోపలి పదార్థాలను తింటుంది. ఒక్కొక్క గూడులో 3 నుంచి 4 పురుగులు కనిపిస్తాయి. ఈ గూళ్ళలోనే కోశస్థ దశకు చేరుకుని రెక్కల పురుగుగా మారుతుంది. ఈ పురుగు ఒక్కోసారి మొగ్గలను, పండ్లను ఆశించడంవల్ల పూత, పిందెలు రాలిపోతాయి. ఈ పురుగు జీవితచక్రం 35-40 రోజుల వరకు ఉంటుంది. ఈ పురుగు ఉధృతి జులై నెల నుంచి నవంబరు వరకు 2. ఉంటుంది.
నివారణ: ఈ పురుగును తగ్గించడానికి గూడుగా మారిన ఆకులను తొలగించి నాశనం చేయాలి. పురుగు మందులు ప్రొఫెనోఫాస్ 2 మి.లీ./లీ. లేదా కార్బరిల్ 3 గ్రా./లీటరు నీటికి లేదా క్లోరోపైరిఫాస్ 2.5 ఎ మి.లీ./లీటరు నీటికి లేదా డైక్లోరోవాస్ 1 మి.లీ./లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పూత సమయంలో వేపగింజల కషాయం 5 శాతం ద్రావణం పిచికారి చేయాలి. తొలిదశ గొంగళి పురుగులు కనిపించగానే వేప నూనె 0.15 శాతం 5 మి.లీ./లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
Also Read: Citrus Gummosis Management: నిమ్మ బంకకారు తెగులు “గమ్మోసిస్” నిర్వహణ.!
పండు ఈగ: సపోటలో అంతర పంటలు వేసి పండించే ప్రాంతాల్లో ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఆశించే అవకాశముంది. తల్లి రెక్కల పురుగు పక్వానికి వచ్చిన పండ్ల మీద గుడ్లు చేస్తుంది. గుడ్ల నుంచి వెలువడిన పురుగులు పండులోని గుజ్జుని తిని పెరుగుతాయి. కాని మనకు పండు రాలిపోయినంత వరకు ఏ విధమైన నష్టం కనిపించదు. ఈ పురుగు ఉధృతి ఎక్కువైనప్పుడు కోయడానికి సిద్ధంగా ఉన్న పండ్లన్నీ రాలిపో తాయి. ఈ పురుగు ఉనికి మార్చి నుంచి జులై వరకు ఉంటుంది.
నివారణ: సమగ్ర సస్యరక్షణ పద్ధతుల్లో భాగంగా వేసవిలో లోతు వల్ల దుక్కి చేయాలి. రాలిపోయిన పండ్లన్నీ తగులబెట్టాలి.మిథైల్ యుజినాల్ 1 మి.లీ./లీ హెక్టారుకు 10 చొప్పున తోటలో అమర్చాలి. పిందె దశలోనే కార్బరిల్ 3 గ్రా. /లీటరు నీటికి లేదా డైక్లోరోవాస్ 1 మి.లీ./లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. తయారైన కాయలను ఎప్పటికప్పుడు కోసి మార్కెట్కి పంపించాలి.
పిండినల్లి: పిండినల్లి తల్లి, పిల్ల పురుగులు గుంపులుగా ఆకు అడుగు భాగం ప్రాంతాల్లో చేరి రసం పీల్చు తాయి. తీవ్రస్థాయిలో ఆశించినప్పుడు ఆకులు పసుపు రంగులో మారి కాయ దిగుబడి తగ్గిపోతుంది. పూత, పిందె రాలిపోతుంది. పిండినల్లి విసర్జించిన తేనె వంటి పదార్థం ఆకు మీద చేరడం వల్ల శిలీంద్రం పెరుగుతుంది. దీనివల్ల ఆకు మసిబారి కొత్త చిగుర్లు రావడం తగ్గిపోతుంది. మలాథియాన్ 0.05 శాతం లేదా ప్రొఫెనోఫాస్ 2 మి.లీ./లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి.
Also Read: Pest Control in Rabi Paddy: రబీ వరిలో ముఖ్యమైన తెగుళ్ళు వాటి నివారణ
Must Watch: