Black gram Pests – బూడిద తెగులు:- ఈ తెగులు ఆశించిన మొక్కల ఆకుల మీద తెల్లని మచ్చలు ఏర్పడతాయి. తరువాత మచ్చలు నుండి శీలింద్ర భిజాలు ఉత్పత్తి అయి ఆకులు మీద తెల్లటి పొరగా ఏర్పడతాయి. ఆకులమీద బూడిద లాంటి పొర ఏర్పడటం వలన కిరణజన్య సంయోగ క్రియ తగ్గి దిగుబడులు తగ్గడమే గాక గింజ నాణ్యత కూడా తగ్గుతుంది. తెగులు ఉదృతీ ఎక్కువైనప్పుడు తెల్లని బూడిద లాంటి పొర కాండము, పిందెలు మరియు కాయలు మీద కుడా వ్యాప్తి చెందుతుంది. రాత్రి పూట చలి గాను, పగటి పూట వేడి గాను ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు బూడిద తెగులు ఆశించడానికి మరియు ఉదృతి పెరగటానికి అనుకూలమైనవి.
నివారణ:- తెగులు నివారణ కొరకు మైక్లోబ్యూటానిల్.0 గ్రా లేదా హెక్సాకోనాజోల్ నీటికి కలిపి 10-15 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి మందులను మార్చి పిచికారి చేసుకోవాలి.
కొరినోస్పోరా ఆకు మచ్చ తెగులు:- ఈ తెగులు కేవలం మినుము పంటను మాత్రమే ఆశిస్తుంది. పైరు 30-35 రోజుల దశలో ఈ తెగులు ఉదృతి ఉంటుంది. మొదట ఆకుల మీద చిన్న ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి తరువాత మచ్చలు పెద్దవై ఒకదానిలో ఒకటి కలిసిపోయి నలుపు రంగుకు మారి ఆకులు ఎండిపోతాయి.
నివారణ:- కాపర్ ఆక్సిక్లోరైడ్ 3.0 గ్రా. లేదా మాంకోజెబ్ 2.5 గ్రా. లేదా హెక్సాకోనాజోల్ 2.0 మి. లి. లేదా ప్రోపికోనాజోల్ 1.0 మి. లి. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
Also Read: Shankapushpi Tea: ఈ పువ్వుతో తయారుచేసే టీ యొక్క ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్య పోవలసిందే.!
సర్కోస్పోరా ఆకు మచ్చ తెగులు:- తెగులు ఆశించిన మొక్కల మీద చిన్న గుండ్రటి మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు అంచులు క్రమేసి ముదరు గోధుమ రంగు నుండి నలుపు రంగుకు మారి మధ్యలో బూడిద రంగు చుక్కలు కలిగి ఉంటాయి. మచ్చలు క్రమేనా పెద్దవై ఒక దానితో ఒకటి కలిసిపోయి ఆకులు ఎండిపోయి రాలిపోతాయి.
నివారణ:- ప్రోపికోనాజోల్ 1.0 మి. లి. లేదా హెక్సాకోనాజోల్ 2.0 మి. లో. లేదా థయోఫనేట్ మిథైల్ 1.0 గ్రా. లీటరు నీటికి కలిపి 10-15 రోజుల వ్యవధిలో మందులను మార్చి పిచికారీ చేయాలి.
తుప్పు తెగులు:- తెగులు ఆశించిన ఆకుల మీద గుండ్రని చిన్న చిన్న మచ్చలు ఏర్పడతాయి. మొదట్లో ఈ మచ్చలు పసుపు రంగులో ఉండి, తర్వాత తుప్పు రంగుకి మారుతాయి. ఈ మచ్చల నుండి శీలింద్ర బీజాలు ఉత్పత్తి అయి ఆకు అంతా తుప్పు రంగులోకి మారి ఆకులు ఎండిపోయి రాలిపోతాయి. పంట దిగుబడి మరియు నాణ్యత కూడా తగ్గిపోతుంది. పైరు 50 నుండి 60 రోజుల దశలో ఈ తెగులు ఆశిస్తుంది.
నివారణ:- ట్రైడిమార్ప్ 1.0 మి. లి. లేదా. మాంకోజెబ్ 2.5 గ్రా లేదా డైనోకాప్ 1.0 మి లి. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ఎండు తెగులు:- వరి మాగాణి మినుము పంటలో ఈ తెగులు ఎక్కువగా కనిపిస్తుంది. తెగులు సోకిన మొక్కల కాండం పై తెల్లని ఉబ్బెత్తు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు వంకర్లు తిరిగి క్రిందకు ముడుచుకొని , పసుపు రంగుకు మారి మొక్కలు వడలిపోయి క్రమేపి చనిపోతాయి.
సమగ్ర యాజమాన్యం:- వేసవి కాలంలో లోతు దుక్కులు చేసుకుంటే భూమిలోని శీలింద్ర బీజాలు చనిపోతాయి.
పంట మార్పిడి తప్పనిసరిగా చేసుకోవాలి.
ఎండు తెగులులను తట్టుకొనే రకాలను ఎన్నుకోవాలి.
కిలో విత్తనానికి మాంకోజెబ్ 3 గ్రా. లేదా కార్బండిజిం 2 గ్రా. కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకునే ముందుగా కిలో విత్తనానకి 10 గ్రా. ట్రైకోడెర్మా వీరిడిని పట్టించి విత్తినట్లయితే ఈ తెగులును కొంతవరకు తగ్గించవచ్చు.
2 కేజీల ట్రైకోడెర్మా వీరిడిని 80 కేజీల మాగిన పశువుల ఎరువు మరియు 20 కేజీల వేపపిండితో కలిపి అభివృద్ధి పరిచి విత్తుకునేటప్పుడు తగినంత తేమ ఉన్నప్పుడు భూమిలో కలియ పెట్టవలెను.
Also Read: Blackgram Cultivation: మాగాణి మినుములో కలుపు యాజమాన్యం అవసరమా.!