Pest Control Techniques In Groundnut Crop – పొగాకు లద్దె పురుగు: వీటి రెక్కల పురుగులు లేత గోధుమ రంగులో మచ్చలు ఉన్న రెక్కలు కలిగి ఉంటాయి.ఇవి ఆకుల పై భాగంలో సమూహాలుగా కొన్ని వందల గుడ్లు పెట్టి వాటి పై బంగారు వర్ణం కలిగిన నూగు కప్పుతాయి. వీటి నుండి పిల్ల పురుగులు బయటకి వచ్చి సముదాయాలు ఆకులను గోకి తింటాయి.పిల్ల పురుగులు లేత ఆకు పచ్చ రంగులో ఉండి పెరుగుతున్న కొద్ది ముదురు ఆకు పచ్చ రంగుకు మరి ఆ తర్వాత గోధుమ రంగులోకి మారతాయి. శరీరం అంత సన్నని గీతలతో నల్లని మచ్చలు కలిగి ఉంటుంది.కోశస్థ దశ భూమిలో మొక్కకు దగ్గరగా ఉంటుంది.పెరిగిన లార్వాలు పగలంత మొక్కల మొదళ్ళలో ఉండి రాత్రి పూట ఆకులను తింటాయి.ఆకులను మొత్తం తీసి వేసి మొక్కలను మోడులాగా చేసి ఆహారం కోసం మరో పొలానికి వలస వేళతాయి.
నివారణ: పంట వరుసలలో 1 మీ దూరానికి 1 లేదా 2 లద్దె పురుగుల గుడ్ల సముదాయాలు కనిపించినపుడు నివారణ చర్యలు చేపట్టాలి.లింగాకర్షణ బుట్టలు ఉపయోగించాలి. క్లోరిఫైరిఫాస్ 2 మ్. ల్ లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మ్. ల్ ఒక లీటర్ నీటికి పిచికారీ చేయాలి.పెద్ద లార్వాలను విషపు ఎర్ర ఉపయోగించి నివారణ చేయవచ్చు.10 కిలోల తావుడు,1 కిలో బెల్లం మరియు1 లీటర్ మోనోక్రోటోఫాస్ లేక,1 కిలో కార్బరిల్ మందును కలిపి తగినంత నీటి ఉండలు చేసి విషపు ఎరను ఉపయోగించాలి.
Also Read: Groundnut Diseases: వేరుశెనగ లో వచ్చే వివిధ రకాల తెగుళ్లు మరియు వాటి నివారణ చర్యలు

Pest Control Techniques In Groundnut Crop
వేరు పురుగు: తేలిక పాటి నేలల్లో ఈ పురుగు పంటకు అపార నష్టాన్ని కలుగజేస్తుంది.పెద్ద పెంకు పురుగులు 20-80 గుడ్లు సముదాయాలుగా భూమిలో పెడతాయి.ఈ గుడ్ల నుండి తెల్లని గాజు లాంటి పిల్ల పురుగులు బయటకి వచ్చి కొద్ది రోజుల పాటు భూమిలో సేంద్రియ పదార్ధాన్ని తిని ఆ తరవాత మొక్కల వేళ్ళు తినడం ప్రారంభిస్తుంది.ఈ పురుగు కోశస్థ దశ 70 సేం. మీ లోతు భూమిలో జరుపుకొని పెద్ద పురుగుగా మరి వర్షా కాలం వరకు అలాగే ఉంటుంది. ఈ పురుగు ఆశించిన వేరు శెనగ మొక్కలు ఎక్కువ పెరుగుదల లేకుండా మధ్యాహ్నం ఎండు తెగులు సోకినట్లు కనిపించడం మొక్కలు చనిపోవడం జరుగుతుంది.
నివారణ: క్లోరిఫైరిఫాస్ 6.5 మ్. ల్ లేదా 5 గ్రా ఇమీడాక్లోప్రిడ్ 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసి పురుగుల బారి నుండి రక్షించుకోవచ్చు.
Also Read: Groundnut Crushing Machine: వేరుశనగ కాయలు వొలుచు యంత్రము