చీడపీడల యాజమాన్యం

Pesara and Millet Crop: పెసర, మినుము పంటను ఆశించే వివిధ రకాల పురుగులు వాటి యాజమాన్యం.!

0
Millet Crop
Millet Crop

Pesara and Millet Crop:

  • తేమను పట్టి ఉంచే అన్ని రకాల భూములలో సాగు చేయవచ్చు ముఖ్యంగా బరువైన నల్లరేగడి భూములు మినుము సాగుకు అత్యంత అనుకూలమైనవి చౌడు నేలలు, మురుగు నిలిచే నేలలు పనికిరావు.
  • బెట్ట, పొడి వాతావరణంలో దుక్కి సరిగా తయారు కానప్పుడు చిత్త పురుగులు ఆశించి రంధ్రాలు చేయడం వలన మొక్కలు తొలిదశలోనే చనిపోతాయి దీని నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్‌ అనే మందును ఒక గ్రాము చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి.
  • బెట్ట మరియు పొడి వాతావరణంలో పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు రసం పీల్చే పురుగు లైన తెల్ల దోమ మరియు తామర పురుగులు ఆశిస్తాయి ముఖ్యంగా తెల్ల దోమ ఆశించడం వల్ల పల్లాకు తెగులు అనే వైరస్‌ వ్యాధి మరియు తామర పురుగుల వల్ల ఆకుముడత అనే వైరస్‌ వ్యాధి ఆశించే అవకాశం ఉంది. కావున తొలిదశలో ఆశించే తెల్ల దోమ నివారణకు  Acetamiprid 0.2 గ్రాములు లీటరు నీటికి లేదా  Difenthiuron 1.5 గ్రాముల చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి అలాగే తామర పురుగుల నివారణకు లీటరు నీటికి రెండు మిల్లీ లీటర్ల Fipronil అనే మందు పిచికారి చేసుకోవాలి.
  •  పెసరలో పల్లాకు తెగులు తట్టుకునే  WGG 37, WGG 42 మరియు MGG 351   వంటి రకాలను అలాగే మినుములో  LBG752,  LBG 787 మరియు  PU 31   వంటి రకాలను సాగు చేయాలి.
Pesara and Millet Crop

Pesara and Millet Crop

పొగాకు లద్దె పురుగు: ఈ పురుగులు ఆకుల్లోని పచ్చని పదార్ధాన్ని గీకి తినటం వలన ఆకులు జల్లెడగా మారి తెల్లగా కనిపిస్తాయి. ఆకులకు రంధ్రాలు చేసి, ఆకులను పూర్తిగాను, పువ్వులను, పిందెలను కూడా తింటాయి. ఈ పురుగు రాత్రి పూట ఎక్కువగా తింటూ, పగలు మొక్కల మొదళ్ళలోను, భూమి నెర్రెలలోనికి చేరతాయి.
అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్లోనూ ఆశిస్తుంది.
1. గ్రుడ్ల సముదాయాలను ఏరివేయాలి.
2. జల్లెడగా మారి పిల్ల పురుగులతో ఉన్న ఆకులను ఏరి నాశనం చేయాలి.
3. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను ఏర్పాటుచేసి పురుగు ఉధృతిని గమనించాలి.
4. పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు పొలంలో విషపు ‘‘ఎర’’ ముద్దల్ని       వెదజల్లాలి. ఎకరాకు మోనోక్రోటోఫాస్‌ 36 % యస్‌.ఎల్‌ 500 మి.లీ. లేదా     క్లోరిపైరిఫాస్‌ 20 % ఇ.సి 500 మి.లీ. లేదా కార్బరిల్‌ 50 % డబ్ల్యు.పి. 500 గ్రా ., 5   కిలోల తవుడు, అరకిలో బెల్లం సరిపడే నీటితో కలిపి చిన్న ఉండలుగా చేసి   సాయంకాలం సమయంలో వెద జల్లాలి.
5. చివరిగా మోనోక్రోటోఫాస్‌ 36 % యన్‌.ఎల్‌ 1.6 మి.లీ. లేదా క్లోరిపైరిఫాస్‌ 20 %     ఇ.సి 2.5 మి.లీ. లేదా నొవాల్యురాన్‌ 10 % ఇ.సి. 1 మి.లీ. లేదా థయోడికార్బ్‌. 75     %  డబ్ల్యు. పి 1 గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

1. ఎకరాకు 30,000 ట్రైకోగ్రామ బదనికలను వారం రోజుల వ్యవధిలో విడుదల చేయాలి.
2. ఎకరాకు ఎన్‌.పి.వి. 200 యల్‌.ఇ. ద్రావణాన్ని సాయం కాలం పిచికారి చేయాలి.

Also Read: Pearl Millet Management: సజ్జ పంటలో అధిక దిగుబడికి చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు.!

మారుక మచ్చల పురుగు:

  • పురుగు మొగ్గ, పూత దశలో ఆశించి ఎక్కువ నష్టం కలుగజేస్తుంది. పూత దశలో పూలను గూడుగా చేసి లోపలి పదార్ధాలను తింటుంది.
  • కాయలు తయారయ్యేటవుడు కాయలను దగ్గరకు జేర్చి గూడుగా కట్టి, కాయలకు రంధ్రం చేసి లోపలి గింజలను తినటం వలన పంటకు ఎక్కువ నష్టం కలుగుతుంది. గూడు దగ్గర లార్వా విసర్జితములు కనిపిస్తాయి. గూళ్ళు విప్పినచో తెల్లవు వర్ణం కలిగి వెన్నుపై మచ్చలు కలిగిన పిల్ల పురుగులు గమనించ వచ్చు. ఉధృతి ఎక్కువగా ఉన్నచో పూత గెల బూజుగా మారును.
  • పూతదశలో మేఘావృతమైనప్పుడు, పొగ మంచు మరియు అడపాదడపా చిరు జల్లులు కురిసినప్పుడు ఎక్కువగా ఆశిస్తుంది.
Cutworm

Cutworm

1. పూత దశలో తప్పనిసరిగా పైరుపై 5% వేప గింజల కషాయం లేదా వేప నూనె 5.0 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేసిట్లయితే రెక్కల పురుగులు గ్రుడ్లు పెట్టడానికి ఇష్టపడవు. అంతేకాక అప్పటికే పంట మొక్కలపై ఉన్న గ్రుడ్లు కూడా పగిలి చనిపోతాయి. తక్కువ కాల పరిమితి గల పైర్లలో ఇది అత్యంత ఉపయోగకరం.
2. మొగ్గ, పూత దశలో అక్కడక్కడా కొన్ని పూమొగ్గలను సేకరించి వాటిని పురుగులు ఉన్నాయోమో అని పరిశీలించాలి. పిల్ల పురుగులు కనిపించినట్లయితే మరియు పంటలో గూళ్ళు గమనించినట్లయితే వెంటనే క్లోరిపైరిఫాస్‌ 20 % ఇ.సి 2.5 మి.లీ. థయోడికార్బ్‌ 75 % డబ్ల్యు.పి 1.0 గ్రా. లేదా ఎసిఫేట్‌ 75 % యన్పి 1.0 గ్రా. లేదా నొవాల్యురాన్‌ 10 % ఇ.సి 1.0 మి.లీ ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
3. పురుగు ఉధృతి అధికంగా గమనించి నప్పుడు స్పెనోశాడ్‌ 45 % యన్‌.సి 0.3 మీ.లీ. లేదా ప్లూబెండమైడ్‌ 39.35 % యస్‌.సి. 0.2 మి.లీ. లేదా క్లోరాంట్రా నిలిప్రోల్‌ 18.5 ఎస్‌.సి 0.3 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పైరుపై పిచికారి చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది.

శనగపచ్చ పురుగు: తల్లి పురుగు లేత చిగుళ్లపై, పూ మొగ్గలపై, లేత పిందెలపై విడివిడిగా లేత పసుపు రంగు గుడ్లని పెడుతుంది. గుడ్ల నుండి వెలువడిన వార పురుగులు మొగ్గల్ని గోకి తింటూ తరువాత దశలో మొగ్గల్ని తొలిచి కాయలోకి తలను చొప్పించి మిగిలిన శరీరాన్ని బయటుంచి లోపల గింజలను తిని డొల్ల చేస్తాయి. పురుగు తిన్న కాయకి గుండ్రటి రంధ్రాలు కనిపిస్తాయి.
వర్షం లేదా చిరు జల్లులు పడినప్పుడు, రాత్రి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగినప్పుడు మొగ్గ లేదా తొలి పూత దశలో 5 % వేప గింజల కషాయం లేదా వేప నూనె 5 మి.లీ. లేదా క్వినాల్ఫాస్‌ 25 % ఇ.సి. 2.0 మి.లీ. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడుబీ ఇండాక్సాకార్స్‌ 14.5 % యస్‌.సి 1.0 మి.లీ. లేదా స్పెనోశాడ్‌ 45 % యస్‌.సి 0.3 మి.లీ. లేదా క్లోరాంట్రానిలిప్రోల్‌ 18.5 % ఎస్‌.సి. 0.3 మి.లీ. లేదా ప్లూబెండమైడ్‌ 39.35 % యస్‌.సి 0.2 మి.లీ./లీ . లేదా లామా సైహలోత్రిన్‌ 5 % ఇ.సి 1 మి.లీ./లీ. బ్యాసిల్లస్‌ తురింజెన్సిస్‌ 300 గ్రా. / ఎకరాకు. హెలికోవెర్పా %చీూప% ఏ 100-200 మి.లీ./ఎకరాకు, బెవేరియా బసియానా 1200 గ్రా./ ఎకరాకు.

కాండపు ఈగ :

  •  ఇది మినుములో ఎక్కువగా ఆశించును.
  • పిల్ల పురుగులు భూమికి దగ్గరగా ఉన్న కాండం మొదలు లోపలికి వెళ్లి లోపల కణజాలాన్ని తిని డొల్లగా మారుస్తాయి. పురుగు ప్రవేశించిన ప్రాంతం ఉబ్బి మొక్క ప్రక్కకు వాలిపోతుంది. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కలు చనిపోతాయి. కాండం చీల్చి చూసినప్పుడు పిల్లపురుగులు కనిపించును.
  • బెట్ట మరియు తక్కువ వర్షపాతం నమోదు కావడం.
  • మోనోక్రోటోఫాస్‌ 36 % యస్‌.ఎల్‌ 1.6 లేదా ఎసిఫేట్‌ 75 % యస్పి 1.0 గ్రా. లేదా డైమిథోయేట్‌ 30 % ఇ.సి. 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

-నాగరాజు అలుగోజు, డా. రాజేశ్వర్‌ నాయక్‌,
డా. శివకృష్ణ, డా. తిరుపతి, డా. స్రవంతి మరియు డా. సతీష్‌
కృషి విజ్ఞాన కేంద్రం, బెల్లంపల్లి, మంచిర్యాల, ఫోన్‌ : 9100229854

Also Read: Pearl Millet: సజ్జ

Must Watch:

Leave Your Comments

Farming Techniques in Dryland: మెట్టసాగులో మెళకువలు.!

Previous article

Yasangi Maize Cultivation: యాసంగి మొక్కజొన్న సాగు సమగ్ర యాజమాన్యం.!

Next article

You may also like