Eradication of Parthenium Weed: నిమ్మ తోటలను 6 × 6 మీ. మధ్య దూరంతో సాగు చేయడంవల్ల మొక్కల మధ్య అంతరకృషి తప్పనిసరిగా చేయాలి. నిమ్మ రైతులకు ప్రస్తుత పరిస్థితుల్లో కూలీల సమస్య అధికంగా ఉండటం వల్ల కలుపు యాజమాన్యం కష్టమవుతుంది. బిందు పద్ధతిలో తోటలను సాగుచేసినప్పటికీ కలుపు సమస్య కొంతవరకు తగ్గినా పశువుల ఎరువు వాడకం, చెరువు మట్టి తోలడం, గాలి ద్వారా, ఇతర కారణాల వల్ల కలుపు విత్తనాలు పొలాల్లోకి చేరు తాయి. రాష్ట్రంలో నిమ్మ తోటలను క్షేత్ర స్థాయిలో సందర్శించినప్పుడు పార్థీనియం కలుపు ప్రధాన సమస్యగా ఉన్నట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలుచే గమనించడమైంది.
ఒక్కొక్క మొక్క అనుకూల వాతావరణ పరిస్థితుల్లో దాదాపుగా 50 నుంచి 80 వేల విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల ఇటు పంటకే కాకుండా మనుషులకు, పశువులకు కూడా పలువి ధాలుగా నష్టాన్ని కలిగిస్తుంది. ఈ మొక్కలు ఉన్న ప్రాంతాల్లో పర్యటించినపుడు కొంతమంది రైతులకు అలర్జీ కలిగి, ముఖమంతా కందగడ్డ లాగా వాచిపోయింది. అంతేగాక ఉబ్బసం, బ్రాంకైటిస్, కాన్సర్ వంటి రోగాలు కూడా వస్తాయి. పశు వుల్లో వెంట్రుకలు రాలిపోవడం, హైపర్ టెన్షన్కు గురికావడం వల్ల పాల ఉత్పత్తి తగ్గిపోవడం వంటి సమస్యలు తలెత్తాయి.
పైసమస్యలను దృష్టిలో ఉంచుకొని రైతులందరూ సమగ్రంగా ఈ కింద తెలిపిన యాజమాన్య పద్ధతులు పాటించి వయ్యారిభామను తొలగించుకోవడం వల్ల తమ ఆరోగ్యాన్ని కాపాడుకొని, కూలీల సమస్యను అధి గమించడమే కాక కంపోస్టుగా కూడా దీన్ని వినియోగించుకోవచ్చు.
Also Read: Muskmelon and Watermelon: పుచ్చ, కర్బూజ పంటల్లో సస్యరక్షణ.!
యాజమాన్య పద్ధతులు:
పూత దశకు ముందే ఈ కలుపును కంపోస్టుగా తయారు చేసుకోవాలి లేదా తగులబెట్టాలి.
కంపోస్టు తయారీ:
పార్థీనియం కలుపు మొక్కలను ముక్కలుగా కత్తిరించి, నేలపై లేదా ఒక గుంతలో అర అడుగు మందంతో పరచాలి. దీనిపై సింగిల్ సూపర్ ఫాస్పేటు (4 కిలోలు 1 టన్ను కలుపుకు) పొడి చల్లి, యూరియా ద్రావణాన్ని (ఒక టన్ను కలుపుకు 2 కిలోలు) పిచికారి చేయాలి. మళ్లీ దానిపై అర అడుగు మందంతో ముక్కలుగా కత్తిరించిన పార్థీనియం కలుపును పరచి సూపర్ ఫాస్ఫేటు పొడి చల్లి, యూరియా ద్రావణాన్ని పిచికారి చేయాలి. ఈ విధంగా మూడు అడుగుల ఎత్తుకు చేసి, దానిపై గాలి చొరబడకుండా బంకమట్టి లేదా బురదతో ప్లాస్టరింగ్ చేయాలి. గుంటలో తేమ ఉండేలా అప్పుడప్పుడూ నీటిని చిలకరించాలి. రెండు వారాల తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలియబెట్టాలి. ఈ విధంగా 50 శాతం కుళ్లిన తర్వాత ట్రైకోడెర్మా విరిడి అనే జీవశిలీంద్ర పొడిమందును 3 కిలోల చొప్పున చల్లాలి. తద్వారా ఒకటిన్నర నెల తర్వాత మంచి పోషకాలతో కూడిన కంపోస్టును పొందవచ్చు.
సగం కుళ్లిన ఈ కంపోస్టును వానపాములను ఉపయోగించి వర్మికంపోస్టుగా తయారు చేసుకోవచ్చు. బీడు భూములు, చెరువులు, ఇతర చోట్ల నుంచి మట్టి తోలేటప్పుడూ ఈ కలుపులేని ప్రాంతం నుంచి సేకరించి నిమ్మతోటలకు వేసుకోవాలి. నిమ్మ తోటల్లో బంతి, తోటకూర వంటి అంతర పంటలు సాగుచేయడం వల్ల ఈ కలుపు ఉధృతిని తగ్గించవచ్చు.
లేత కలుపు మొక్క లపై 5 శాతం ఉప్పు ద్రావణాన్ని పిచికారి చేయాలి. నిమ్మ మొక్కల మధ్య ఖాళీ స్థలంలో, డ్రిప్ సబ్జెన్ల వెంబడి 10 మి.లీ. గ్లైఫోసెట్ + 10గ్రా. అమ్మోనియం సల్ఫేటు లేదా యూరియాను కలిపి కలుపుపై పిచికారి చేయాలి. పిచికారి సమయంలో నిమ్మ మొక్క మొదళ్ళపై పడకుండా జాగ్రత్త వహించాలి.
Also Read: Agricultural Mechanization: వ్యవసాయంలోస్త్రీ ల శ్రమను తగ్గించే వివిధ వ్యవసాయ యంత్రాలు.!