Banana Panama Disease: ఈ తెగులు ఫ్యూసేరియం ఆక్సిస్పోరం క్యూబెన్స్ అనే శీలింద్రం వలన కలుగుతుంది.మొక్కకు ఏ దశలోనైనా ఈ తెగులు సోకవచ్చును. తెగులు సోకిన ఆకుల పసుపు పచ్చ రంగుకు మారును. పసుపు పచ్చ రంగు ఆకుల అంచులనుండి పట్టిలాగా మొదలై మధ్య ఈనే వరకు వ్యాపించును. ఆకులు వడలిపోయి, పత్రవృంతం విరిగిపోయి కాండం పొడువునా వ్రేలాడును . కొన్నిసార్లు ఆకుల మధ్య భాగంలో కూడ విరిగిపోవును. మొక్క చివరి ఆకులు ఆకుపచ్చగా నీటారుగా ఉండును.

Key Pests of Panama Banana
మిగతా ఆకులు గోధుమ వర్ణానికి మారి వాడిపోయి వ్రేలాడును. తెగులు తీవ్ర దశలో చివరి ఆకులు కూడ వాడిపోయి చనిపోవును. కాండము పొడవునా పగుళ్ళు ఏర్పడును. తెగులు సోకిన మొక్కలలో పెరుగుదల తగ్గి గిడసబారినట్లు అగుపించును. ఈ తెగులు లక్షణాలు శిలీంద్రము వెళ్ల ద్వారా దుంపలలో ప్రవేశించిన రెండు నెలల తరువాత కనబడును. తెగులు సోకిన చెట్లను నిలువుగా నరికి పరీక్షించిన గోధుమ వర్ణము నుండి నల్లని చారలు క్రింద నుండి ఆకు కాడ వరకు కనపడును. తెగులు సోకిన చెట్లవద్ద చాలా పిలకలు కనబడును.
Also Read: Summer Management Practices in Banana: వేసవిలో అరటి తోటల యాజమాన్య పద్ధతులు.!
దుంపలను అడ్డుకోత కోసి చూసినపుడు దారువు కణజాలంలో శిలీంద్రము కనిపించును. ముదిరిన ఆకుల యొక్క ఆకు సొర ఎరువు లేక గోధుమ వర్ణనికి మారును. తెగులుకు గురైన కాండం మరియు దుంపలలో ఒక విధమయిన వాసన వచ్చును.ఈ తెగులును కలుగజేసే శిలీంద్రము నేలలో జీవించును. పూతికహాహారంగా దుంపలలో , మొక్కల ఇతర భాగాలలో చాలా రోజుల వరకు జీవించును. శాఖీయంగా ఈ తెగులు వ్యాప్తి చెందదు . నేల రకాలు. తేమ మరియు ఉదజనీ సూటిక మీద శిలీంద్ర జీవనము ఆధారపడుతుంది. పిలక మొక్కల ద్వారా తెగులు ఒకచోట నుండి వేరొక చోటుకు వ్యాపించుతుంది.
ఈ శిలీంద్రము పిల్ల వేర్ల యొక్క వేరు తోడుగు ద్వారా లేక వైర్లపైన గాయాలు ద్వారా ప్రవేశిస్తుంది. ముదిరిన వెర్లలో ఈ శీలింద్రము ప్రవేశించలేదు. తెగులు లక్షణాలు బయట కనిపించక ముందే, శీలింద్రము దారు కణాలలో వృద్ధి చెందుతుంది. ఒకసారి మొక్కలలోనికి ప్రవేశించిన తరువాత అంతర్వహికంగా వ్యాప్తి చెందుతుంది.

Panama Effected Plants
నివారణ :-
- తెగులు సోకిన ప్రాంతాలనుండి పిలక మొక్కలను సేకరించాలి.
- పనామా తెగులు ఉదృతంగా ఉన్న ప్రాంతాలలో అమృతపాణి రకం సాగు చేయకూడదు.
- తెగులు సోకిన మొక్కలను దుంపలతో సహా తీసివేసి గుంతలను సున్నాముతో శుద్ధి చేయాలి లేక చెత్త చెదారం వేసి కాల్చివేయాలి.
- రెండు నుండి ఆరు నెలల వరకు గుంతలను నీటితో నింపాలి. మరియు శీలింద్ర నశినులను నేలలో కలిపి నివారించాలి.
- నారు మాడులలో వెపమ్ 850 గ్రాముల మందు 100 లీటర్లు నీటిలో కలిపి లేక 3000 పి. పి. యం మందులతో నేలను తడపాలి.
- తెగులు తట్టుకొనే కావేండిష్, వామనకేలి లాంటి రకాలను సాగు చేసుకోవాలి.
- తెగుళ్లు తట్టుకునే రకాలను జూన్ మరియు ఆగష్టు నెలల మధ్యలో నాటితే తెగులు తీవ్రతను తగ్గించవచ్చు.

Panama Dieases(Fusarium Oxysporum)
Also Read:Red Banana Benefits: షుగర్ వ్యాధి గ్రస్తులకు మేలు చేసే రెడ్ బనానా.!
Must Wtach:-