Nutrient Management in Mango: మామిడిని పండ్లలలో రాజు లాంటిది అంటారు. ప్రపంచములోని పండ్లలో మామిడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. శీతల ప్రాంతాలలో యాపిల్ లాగా ఉష్ణప్రాంతాలలో మామిడికి అంత ప్రాధాన్యత ఉంది. ఈ పండ్లు చాలా రుచిగా ఉండడమే కాకుండా మరియు ఎన్నో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా కలిగి వుంటాయి. పచ్చికాయలను పచ్చడి, ఊరగాయకి ఉపయోగిస్తారు. అటువంటి పండ్ల మంచి దిగుబడికి మనం సరి అయన సమయం లో సరి అయన మోతాదులో పోషకాలను అందిచవలసి ఉంటుంది.అందులో భాగముగా కొన్ని పోషక లోపాలు తెలుసుకొనే విధానము మరియు వాటి నివారణ చర్యలు.
పోషకాల యాజమాన్యము:
• జింకు లోపము
ఈ పోషక పదార్థాలు లోపం ఎక్కువగా నేలలో ఉన్నా సమస్యలు చెట్టుపై కనిపిస్తాయి. జింకు లోపము సాధారణంగా చౌడు నేలల్లో ఎక్కువగా వస్తుంది. జింకు లోపమున్న నేలల్లో మొక్కల పెరుగుదల తగ్గుతుంది. జింకు లోపమున్నప్పుడు ఎడల ఆకులు చిన్నగా మారి, సన్నబడి పైకి లేదా క్రిందకు ముడుచుకొని పోతాయి. ఆకులు గుబురుగా కణపులమధ్య దూరము తగ్గిపోయి వుంటాయి.
జింకులోప నివారణకు తీసుకోవాల్సిన చర్యలు – 5 గ్రా. జింకు సల్ఫేట్ ను లీటరు నీటికి కలిపి పిచికారి చేయుటవలన జింకు కోపమును ససవరించవచ్చును
• బోరాన్ లోపము
బోరాను లోపం ఉన్న చెట్లు ఆకులు నొక్కుకు పోయినట్లు ఉంటాయి , కురచబడి , పెళుసు ఆరుబడి ఉంటాయి. కాయ దశలో కాయలు పైన పగుళ్ళు చూపుతాయి. ఈ పోషక లోపము వల్ల పిందే దశలో ఉన్న కాయలు బాగా నశించిపోయి రైతులకు తీవ్రమైన నష్టాన్ని మిగిల్చివేస్తాయి.
బోరాను దాతులోప నివారణకు తీసుకోవలసిన చర్యలు – 2 గ్రా. బోరాక్సును ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
Also Read: Mango Flowering: మామిడి తోటల్లో సకాలంలో పూత రావాలంటే ఇలా చెయ్యాలి.!
• ఇనుము ధాతులోపం
ఈ ధాతులోపం గలచెట్ల ఆకులు పచ్చదనం కోల్పోయి తెల్లగా పాలిపోయినట్టు ఉంటాయి. ఈ లోపం కొత్త ఆకులలో బాగా కనిపిస్తుంది. తీవ్రమైన లోపం ఉన్నప్పుడు మొక్కల ఆకులు పైనుండి క్రిందకు వరుస క్రమంలో ఎండిపోతాయి. ఇనుప ధాతులోపం సున్నపురాయి ఉన్న నేలల్లోను, నల్లరేగడి నేలల్లోను సాధారణంగా ఎక్కువగా కనబడుతుంది.
- ఇనుము ధాతులోప నివారణకు తీసుకోవాల్సిన చర్యలు –
2 గ్రా. అన్న భేది పెర్రస్ సల్ఫేట్ ను ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
సాధారణంగా చెట్టు వయస్సును బట్టి పశువుల ఎరువుగాని, చెక్క గాని ఎరువులుగా వేస్తారు. మామిడికి కావలసిన పోషకాలను కంపోస్టు ద్వారా , బయోఫర్టిలైజర్సు ద్వారా , వేపచెక్క, పచ్చిరొట్టె ఎరువులు, పశువుల ఎరువు, ద్వారా కూడా అందించవచ్చు. నాలుగు సంవత్సరాలలోపు వయసుగల చెట్లకు సిఫారసు చేసిన ఎరువులను 2 నుండి 3 నెలలుకు ఒకసారి వేసుకోవలి. పెద్ద చెట్లకు కోత అయిన వెంటనే సిఫారసు చేసిన మోతాదులో 2/3 వంతు చప్పున ఎరువులను అందించాలి. మిగిలిన మోతాదు ఎరువులను వర్షకాలము చివర్లో వేయాలి.
వర్షాధారము క్రింద పండించే మామిడిలోను, సేంద్రియ పద్ధతిలో పండించి మామిడిలోను పోషకాలను పశువుల ఎరువు, కంపోస్టు, కోళ్ళు ఎరువు, వర్మీ కంపోస్టు ద్వారా సమకూర్చవచ్చు. పోషకాలు త్వరగా లభ్యము కావాలనుకున్నపుడు వేపచెక్క, కానుగ చెక్క, ఆముదము చెక్క, వంటి మొదలైన వాటిని , జీవన ఎరువులైన అజొస్పైరిల్లం, పాస్ఫరస్ సాల్యుబల్ బాక్టీరియా వాడవచ్చు. అంతే కాకుండా పప్పు దినుసు జాతికి చెందిన అలసంద, జనుము, పిల్లి పెసర సాళ్ల మధ్యలో వేసి రెండు నెలలు పెరిగిన తర్వాత కోసి చిన్న చిన్న ముక్కగా నరికి పాదులలో మల్చింగు చేసుకోవచ్చు. అవి కుళ్లిపోయిన తర్వాత పోషక పదార్థాలను మొక్కలుకు అందజేస్తాయి. 10 సంవత్సరాల పైబడిన చెట్టుకు 50 కిలోల వరకు పశువుల ఎరువును , కోళ్ళ ఎరువు 25 కిలోలవరకు, వర్మికంపోస్టు 50 కిలోల వరకు వేయవచ్చు.
Also Read: Mango Pest Control: మామిడిలో చీడపీడల నివారణ చర్యలు.!