Tikka Leafspot in Rabi Groundnut: యాసంగిలో సాగు చేసే పంటల్లో వేరుశనగ అనేది ప్రధానమైన పంట. ఈ వేరుశనగ రబీ కాలంలో అధిక విస్తీర్ణంలో సాగే నూనె గింజల పంట. ఈ పంటను తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 3,10,000 ఎకరాలలో సాగు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా నాగర్ కర్నూల్, వనపర్తి, నల్గొండ, రంగారెడ్డి, ఉమ్మడి కరీంనగర్ మరియు వరంగల్ జిల్లాలో సాగు చేస్తారు. అందులో ఎక్కువ మొత్తంలో నాగర్ కర్నూల్ జిల్లాలో 1,44, 000 ఎకరాలలో వేరుశనగ సాగు చేయబడి ఉంటుంది.
మన రాష్ట్రంలో యాసంగిలో వేరుశనగ విత్తుకొనే సమయం సెప్టెంబర్ రెండవ పక్షం మొదలుకొని డిసెంబర్ మొదటి పక్షం వరకు రైతులు విత్తుకుంటున్నారు ఇందులో 70 నుండి 80 రోజుల్లో ఉన్న దశలో ఉన్న పంటలో అనేక రకాల చీడపీడలు ఆశించి పంటకు నష్టం కలుగజేస్తాయి.
Also Read: Green Manure Benefits: పచ్చిరొట్ట పైర్లు – ప్రయోజనాలు

Tikka Leafspot in Rabi Groundnut
ఈ పంటలో ఎకరానికి 25 క్వింటాళ్ల దిగుబడి పొందే అవకాశం ఉంది మన రాష్ట్రంలో రైతులు వరి, పత్తి, మొక్కజొన్న తరువాత నూనె గింజ పంటల్లో వేరుశనగ ఎక్కువగా పండిస్తున్నారు. వేరుశనగలో ప్రతి ఏడాది చాలా తెగుళ్లను మరియు అనేక చీడపీడలను గమనిస్తాము. ఇందులో ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఆకు మచ్చ తెగుళ్లు. దీనిని తిక్కాకు మచ్చ తెగులు అంటారు.
మొదటగా 30 రోజుల్లోపు వచ్చే ఆకుమచ్చ తెగులు ఒకటి. 70 రోజుల్లో వచ్చే ఆకు మచ్చ తెగుళ్ళు ఒకటి. తెగుళ్ల యొక్క లక్షణాలు గమనించినట్లయితే మొదట 30 రోజుల్లో వచ్చే ఆకుమచ్చలు ముదురు గోధుమ వర్ణంలో మచ్చలు ఉండి దాని చుట్టూ పసుపు రంగు వలయాలు అనేవి ఆకుల పైన గమనిస్తాము.
ఆలస్యంగా వచ్చే ఆకు మచ్చలో మచ్చలు అనేవి నల్లవిగా ఉండి అవి ఆకు అడుగుభాగంలో ఉండి క్రమేణా నేలపైన వ్యాప్తి చెందటమే కాకుండా కాండంకి కూడా విస్తరిస్తాయి. మనకు ఆలస్యంగా వచ్చే ఆకు మచ్చ తెగుళ్లు ఉద్రిక్తత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు మొత్తం రాలిపోయి పంటలో దిగుబడి అనేది తగ్గిపోతుంది.
ఈ తెగుళ్లు ఎక్కువగా విత్తన శుద్ధి చేయని పరిస్థితులలో ఎక్కువగా ఆశిస్తుంది. ఈ తెగుళ్లు సోకినప్పుడు రైతులు ఒక లీటరు నీటికి ఒక మిల్లీలీటరు టేబ్యుకొనజోల్ కలిపి పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా క్లోరోధలోనిల్ అనే శిలీంద్ర నాసిన్ని రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనం తెగుళ్ళ యొక్క ఉద్రిక్తను తగ్గించవచ్చు. అలాగే పంటకు వీటి వల్ల కలిగే నష్టాన్ని కూడా నివారించవచ్చు.