Groundnut Insect Management: తామర పురుగులు వర్షాకాలం (ఖరీఫ్) మరియు శీతాకాలంలో (రబీ) నాలుగు జాతుల నలుపు మరియు గోధుమరంగులో ఉండి పిల్ల, తల్లి దశలలో మొక్కలు మొలకెత్తిన ఏడవ రోజు నుంచి ఆకులపై నోటితో గోకి రసాన్ని పీలుస్తాయి. మొదట క్రింద ఆకుల పై తెల్లటి మచ్చలు, మద్య ఆకులపై సన్నటి గుంతలు కలిగి అడుగు భాగంలో గోధుమ రంగు మచ్చలు మరియు చిగురు ఆకులపై ముడతలు కలిగిన లక్షణాలు కనిపిస్తాయి ఈ పురుగుల ఉధృతి ముఖ్యంగా ఆగష్టు మరియు జనవరి మాసాలలో ఎక్కువగా ఉంటుంది. నాలుగు రకాల తామర పురుగులు వేరుశనగ పంటపై మొవ్వకులు, కాండం కుళ్ళు, వెర్రి తెగుళ్లను (వైరస్) ను కూడా వ్యాప్తి చేస్తాయి.
పేనుబంక తల్లి మరియు పిల్ల పురుగులు మొక్కల కొమ్మల చివర్లలోను, లేత ఆకుల అడుగు భాగంలో మరియు కొన్ని సందర్భాలలో పూతపై గుంపులుగా ఏర్పడి రసాన్ని పీలుస్తాయి అందువలన మొక్కలు నీరసించి గిడసబారుతాయి. ఈ పురుగులు సమూహం తేనెవంటి జిగట పదార్ధాన్ని స్రవిస్తాయి. ఈ జిగురు పదార్థం మీద నల్లని బూజు ఏర్పడుతుంది. పూతదశలో ఆశించినప్పుడు పూత రాలిపోతుంది. ఈ ముదురు గోధుమ రంగు పిల్ల పురుగులు పది రోజులలో రెక్కలు ఏర్పడి వేరే చోటికి ఎగిరి అక్కడ మళ్ళీ కొత్త సంతానాన్ని ఏర్పాటు చేస్తాయి.
పచ్చదోమ (దోమ) ఆకు పచ్చ రంగు కలిగిన పిల్ల మరియు తల్లి దీపపు పురుగులు ఆగష్టు, సెప్టెంబర్ నెలలలో మరియు ఫిబ్రవరి, మార్చి నెలల లో ఎక్కువ వర్షం, తక్కువ వేడి వున్నపుడు అన్ని ప్రాంతాలలో ఆశించును. ఇవి ఆకుల అడుగుభాగాన వుండి రసాన్ని పీల్చుట వలన ఆకు ఈనెలు తెల్లబడి ఆ తరువాత కొన భాగం నుండి నిపు ఆకారం పసుపు మచ్చలు ఏర్పడును. తరువాత ఆకుల కొన భాగం నుండి ఎండిపోతూ పొలం లోని మొక్కలన్ని కాలిపోయినట్లు కనిపించును.
Als0 Read: Tomato Farmers: రైతును బికారి చేసిన టమాటా పంట.!
ఎర్రనల్లి పంట మధ్య దశల్లో పిల్ల మరియు పెద్ద పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చడం వలన ఆకులపై పత్రహరితం లోపించి ఆకులపై తెల్లగా బూడిద చల్లినట్లు తయారవుతాయి. ఆకుల అడుగు భాగాన సన్నటి పల్చటి సాలీడు వంటి గూడు ఏర్పరచి అందులో ఎర్రటి గుండ్రని ఎర్రవల్లి తల్లి మరియు పిల్ల పురుగులు వుంటాయి. ఉధృతి ఎక్కువైనప్పుడు పొలంలో మొక్కలన్నీ తెల్లగా కనిపిస్తాయి బూజు ఎక్కువగా అల్లడం వలన మొక్కలు క్రమేపి ఎండిపోతాయి. ఈ పురుగు ఉధృతి రబీ పంట కాలంలో ఏప్రిల్ మాసములలో అధికంగా ఉంటుంది.
రసం పీల్చు పురుగుల నివారణ :
విత్తన శుద్ధి : మొదట 2 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ పురుగు మందును ఒక కిలో విత్త చొప్పన కలిపి అరగంట నీడలో ఆరబెట్టిన తరువాత కిలో విత్తనానికి 3 గ్రాములు మాంకోజె పొడి (75ఔ.ూ) లేదా 1 గ్రాము టిబ్యు కొనజోల్ 2% (డియస్) పొడిమందును పట్టించాలి వరి మాగాణుల్లో లేక క్రొత్తగా వేరుశనగను సాగు చేసేటపుడు రైజోబియం కల్చరు 200 గ్రాములు ఎకరా విత్తనానికి పట్టించాలి. వేరుపురుగు మరియు చెదలు ఉధ్రుతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి 12.5 మి.లీ. క్లోర్ పైరిఫాస్ (20% ఇసి) లేక 2 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ (17.8% ఎస్. ఎల్. ) చొప్పున కలిపి విత్తన శుద్ధి చేయాలి మొదట విత్తనాన్ని క్రిమిసంహారక మందుతో పట్టించి ఆరబెట్టిన తరువాత అవసరమైతే రైజోబియంను కూడా విత్తనాలకు పట్టించాలి.
. పొలం చుట్టూ జొన్న సజ్జ, మొక్కజొన్న లాంటి వాటిని నాలుగు వరుసలు మెరసాల్లుగా విత్తుకొనేటప్పుడు వేసుకొని రసం పీల్చు పురుగుల వలసను నియంత్రించాలి.
. పొలంలో గ్రీజు లేదా ఆముదంతో పూసిన జిగురు అట్టలను అమర్చి రసం పీల్చు పురుగుల ఉధృతిని తగ్గించవచ్చును.
. తామర పురుగులకు మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీకు ఒక లీటరు నీటిలో కలుపుకొని వేరుశనగ విత్తిన 25 రోజులకు ఆ తరువాత ఉధృతిని బట్టి 45 రోజుల దశలో ఇమిడాక్లోప్రిడ్ 0.25 మి. లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
. దీపపు పురుగులు, పేనుబంక నివారణకు డైమిథోయేట్ 2.0 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్ 1.6మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
. ఎర్రనల్లి (తవిటి పురుగులు) ఎక్కువగా వున్నప్పుడు లీటరు నీటికి 3.0 గ్రా. నీటిలో కరిగే గంధకం లేదా 3.0 మి.లీ. డైకోఫాల్ కలిపి పిచికారి చేయాలి. ఎర్రవల్లి పొలంలో గమనించిన వెంటనే ఇమిడాక్లోప్రిడ్ అసిఫేట్ మందులను వాడకూడదు. పైరులో అక్షింతల పురుగులు మొక్క ఒక్కింటికి 2.0 లేక అంతకంటే ఎక్కువగా పొలము లో ఉన్నప్పుడు క్రిమి సంహారక మందుల వాడకం తగ్గించాలి.
Also Read: Heavy Rains Damage Crops: పంటలపై అధిక వర్షాల ప్రభావం – నష్ట నివారణకు యాజమాన్యం