Fruit Fly: వానాకాలంలో సాగు చేసే కూరగాయలపై పండు ఈగ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది ఈగ కుటుంబానికి చెందినది. ఈ పరుగు లార్వా దశలు పండుకి ఆశిస్తాయి. పెద్ద పురుగులు పండు మీద గుడ్లు పెట్టడం జరుగుతుంది, ఈ గుడ్లు పొధిగాక పండు లోపలకు తొలుచుకుని పోయి గుజ్జును తినడం వలన కాయపైన రంధ్రాలు ఏర్పడును. అంతేగాక పండు తినడానికి ఉపయోగకరంగా ఉండదు. అమ్మడానికి కూడా ఉపయోగపడదు. కావున పండు ఈగను తగు సమయంలో పండును ఆశించకుండా ఉంచడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
తీగ జాతి పంటలలో(కుక్కుర్ బిట్టేసి) పండు ఈగ సమగ్ర సస్యరక్షణ:
ఉపయోగించిన నీటి బాటిల్‌లో క్యూ ఎరను(ఇథనాల్: క్యూలుర్: కార్బరిల్ 8:1:2 పరిమాణంలో) పూత సమయానికి ముందు (MAT వలె) ఒక హెక్టార్ కు 25 ఎరలను అమర్చుకోవాలి.
20 లీటర్ల నీటిలో 20ml మలాథియన్, 500 గ్రా. మొలాసిస్‌ను కలిపి బైట్ స్ప్రే వలె ఒక హెక్టారుకు 250 మొక్కలపై అడపాదడపా గా పిచికారీ చేయాలి.
ఎరతో పాటు రిపెలంట్లను(NSKE 4%) ఉపయోగించడం వలన ట్రాపింగ్ మరియు ల్యూరింగ్మె రుగుపడతాయి.
Also Read: Save Soil: నీరు లేని నేల ఎడారిగా మారుతుంది
వేపను రిపెలెంట్ వలె తిప్పికొట్టేందుకు ఉపయోగించడం వల్ల పారాఫెరోమోన్ ట్రాప్‌ల యొక్క ఆకర్షణ శక్తి మెరుగుపడుతుంది మరియు పారాఫెరోమోన్ యొక్క ఆకర్షణ సామర్థ్యాన్ని 52 శాతం వరకు పెంచుతుంది.
ఈ మాడ్యూల్లో NSKE స్ప్రేతో పాటు బాటిల్ ట్రాప్ (9సెం.మీ) యొక్క వ్యాసం పెంచి డైక్లోరోవోస్ 1% ఎరలో అదనంగా ఉపయోగించడం వలన ట్యాపింగ్ సంఖ్య పెరుగుతుంది.
ప్రభావం:
ఈ సాంకేతిక పద్ధతి ద్వారా పురుగుల పెరుగుదల సంఖ్యను అణిచివేసేందుకు సహాయపడుతుంది.
మరియు తినే పండ్లపై కూడా పురుగుమందులను ఉపయేగించే అవసరం ఉండదు.
ఈ సాంకేతిక పద్ధతి ద్వారా తీగజాతి పంటలలో 71.1 శాతం కాయల నష్టాన్ని తగ్గిస్తుంది.
పురుగుమందుల వాడకం మరియు వాటి వలన ఖర్చు పదింతలు తగ్గుతుంది.
దీని వలన మనం తినే ఆహారం లో పురుగుమందులు లేకుండా మన ఆరోగ్యం పై ఎక్కువ ప్రభావం లేకుండా మరియు పర్యావరణ నాణ్యతను మెరుగుపరచడానికి తోడ్పడుతుంది.
Also Read: Garlic Harvesting: వెల్లుల్లి కోత సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు