చీడపీడల యాజమాన్యం

Paddy Brown Plant Hopper: వరిలో సుడిదోమ సమగ్ర యాజమాన్యం నష్ట లక్షణాలు.!

0

Paddy Brown plant hopper:

  • తల్లి మరియు పిల్ల దోమలు పంట పిలక దశ నుండి ఈనికి దశ వరకు పంట నష్ట పరుస్తాయి.
  • దోమలు దుబ్బు అడుగు భాగాన చేరి ఆకుల తొడిమల నుండి రసాన్ని పీల్చి మొక్క ఎండిపోయేలా చేస్తాయి.
  • ఈ దోమలు రసం పీలుస్తున్నప్పుడు విషపూరిత లాలాజలాన్ని మొక్కలోకి చొప్పించడం వలన పంట ఎండిపోతుంది. దీనినే హాపర్‌ బర్న్‌ లక్షణం అంటారు.
  • వరి చిరుపొట్ట, పొట్ట దశలో సుడిదోమ, తెల్లవీపు దోమలు అడుగు భాగాన రసాన్ని పీల్చడం వల్ల పైరు పసుపు నుండి ఎరుపు రంగుకు మారి పైరు సుడులు సుడులుగా ఎండిపోతుంది.
  • దోమ ఆశించిన పంట, కాండం మెత్తబడి ఎండు గడ్డిగా పనికి రాకుండా పోతుంది.

    Paddy Crop

    Paddy Crop

సమగ్ర యాజమాన్యం :

  • నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు పొలం నుండి నీరు తీసివేయాలి. పొలాన్ని అడపా దడపా ఆరబెట్టాలి.
  • వరుసలలో నాటుకోవాలి. చ.మీకు 33 మొనలు ఉండేట్లు చూసుకోవాలి.
  • ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ. చొప్పున బాటలు ఏర్పాటు చేయాలి. దీనివల్ల గాలి, వెలుతురు బాగా ప్రసరిస్తాయి. మొదళ్ళ వద్ద మందు చల్లేందుకు కూడా ఉపయోగిస్తుంది.
  • సిఫారసు చేసిన మోతాదులో మాత్రమే నత్రజని ఎరువులు వాడాలి.
  • పొలంలో అక్కడక్కడా దీపపు కాంతి ఎరలను ఏర్పాటు చేయడం.
    ఆర్థిక నష్టపరిమితి స్థాయి దాటినపుడు, బుప్రోఫెజిన్‌ – 1.6 మి.లీ./లీ. (లేదా) ఎసిఫేట్‌ – 1.5 గ్రా/లీ. (లేదా) ఇతోఫెన్‌ ఫాక్స్‌ – 2.0 మి.లీ./లీ. (లేదా) పైమిట్రోజైజైన్‌ – 0.6 మి.లీ. (లేదా) ఇమిడాఫ్రిడ్‌ – 0.4 మి.లీ./లీ. (లేదా) థయోమిథోక్సమ్‌ – 0.2 గ్రా/లీ. (లేదా) డైనోటెప్యురాన్‌ – 0.4 గ్రా/లీ. (లేదా) మోనోక్రోటోఫాస్‌ – 1.6 మి.లీ./లీ. (లేదా) ఇమిడాక్లోప్రిడ్‌ G ఎథిప్రోల్‌ -0.25 గ్రా./లీ. నీటికి కలిపి దుబ్బు మొదళ్ళ వద్ద పిచికారీ చేయాలి.
  • దోమలు ఎక్కువగా ఉంటే మోనోక్రోటోఫాస్‌ 2.2 మి.లీ. G డైక్లోరోవాస్‌ 1.0 మి.లీ.లీటరు నీటికి కలిపి దుబ్బు మొదళ్ళ వద్ద పిచికారీ చేయాలి.
  • పురుగు మందులు చేతిపంపుతో ఎకరానికి 200 లీ., అదే పవర్‌ స్ప్లేయర్‌ అయితే 120 లీ., మందు ద్రావణం మొక్క మొదళ్లు బాగా తడిచేటట్లు పిచికారీ చేయాలి.
Paddy Brown Plant Hopper

Paddy Brown Plant Hopper

-డా.జి. చిట్టిబాబు సస్యరక్షణ శాస్త్రవేత్త ,
డా.పి. వెంకట రావు విస్తరణ శాస్త్రవేత్త,
డా. జే. జగన్నాధం సమన్వయ కర్త,
ఫోన్‌ : 97052 09418, 98490 35068
ఏరువాక కేంద్రం, శ్రీకాకుళం.

Also Read: Rice Stem Borer: వానాకాలం లో వరి కాండము తొలుచు పురుగు ఇలా నివారించండి.!

Must Watch:

Leave Your Comments

Care to be taken for Plants in Winter: చలికాలం లో మొక్కలకు తీసుకోవలసిన జాగ్రత్తలు.!

Previous article

Black Tea Health Benefits: గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే బ్లాక్ టీ గురించి తెలుసుకోండి!

Next article

You may also like