Sugarcane Internode Borer: పీక పురుగు / నువ్వు పురుగు చెరుకు నాటిన రోజు నుండి 120 రోజుల వరకు వస్తుంది. ప్రస్తుతం లేత చెరుకు పంటల్లో ఉష్ణోగ్రతలు అధికంగా పెరగటం వలన పీక పురుగు అభివృద్ధి మద్యస్థ స్థాయి నుండి అధిక స్థాయి వరకు ఉండడం గమనించబడినది. సూచించిన యాజమాన్య చర్యలు సకాలంలో చేపట్టిన యెడల పీకపురుగును సమర్ధవంతంగా నివారించవచ్చును.
అనుకూల పరిస్థితులు :
. వర్షాధార పంటల్లో ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది.
. అధిక ఉష్ణోగ్రత ఉండటం
. గాలిలో తేమశాతం తక్కువగా ఉండడం
. ప్రధానంగా ఆలస్యంగా నాటిన మరియు కార్శి తోటలలో మేకపురుగు అధికంగా ఆలోచించే అవకాశం ఉంది.
. వేసవికాలంలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటే ఈ పురుగు ఉదృతి ఎక్కువగా ఉంటుంది.
పీక పురుగు గుర్తింపు చిహ్నాలు జీవిత చరిత్ర :
. తల్లి పురుగు లేత గోధుమ రంగులో ఉండి ముందు జత రెక్కలు అంచున నల్లటి చుక్కలు ఉంటాయి.
. పిల్ల పురుగును తెలుపు రంగు కలిగి ఉండి శరీరంపై ఐదు లేత నీలి రంగులు చారలు కనిపిస్తాయి. తలభాగం ముదురు గోధుమ రంగులో ఉంటుంది.
Also Read: Goat and Sheep Transport: జీవాల రవాణా సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు పాటించాల్సిన నిబంధనలు
. జీవిత చక్రం మొత్తం : 38 నుండి 40 రోజులు
. గుడ్ల దశ ఏడు రోజులు
. లార్వాదశ 21 -24 రోజులు
. కోశస్థ దశ : 7 నుండి 9 రోజులు
నిర్ణీత ఉదృత స్థాయి – ఒక చదరపు మీటర్లు ఒక తల్లి పురుగు 15% చచ్చిన మొవ్వులు
పురుగు గాయపరచు లక్షణాలు :
పౖౖెరుకు ఆశించిన పీకపురుగులు మొవ్వులోపలికి తొచుకుపోయి దవ్వ మధ్యలో గల కణజాలాన్ని తినివేయడం వలన మొవ్వు చనిపోతుంది.
. తద్వారా పైరు ఎదుగుదల క్షీణంచి పోయి పంటకు నష్టం కలుగుతుంది.
నివారణ చర్యలు :
సేద్య పద్ధతులు :
. చెరకు ముచ్చలను లోతైన కాలువలలో నాటుకోవాలి.
. వీలైనంత తక్కువ వ్యవధిలో నీటి తడులు ఇవ్వాలి
. చెరకు చెత్తను 1.25 టన్నులు చొప్పున మొక్క తోటలలో నాటిన మూడవరోజు మరియు కార్శి తోటలలో నరికిన వెంటనే మొక్కల మొదళ్ళు కప్పాలి.
యాంత్రిక పద్ధతులు :
లింగాకర్షణ బుట్టలు ఎగరకు నాలుగు చొప్పున నాటిన 30 రోజుల నుండి 120 రోజుల వరకు అమర్చుకొని పురుగుల ఉనికిని గ్రహించాలి.
జీవ నియంత్రణ పద్ధతులు :
ట్రైకోగ్రామ ఖిలోనిస్ గ్రుడ్ల పరాన్న జీవిని నాటిన 30 రోజుల నుండి 7`10 రోజుల వ్యవధిలో నాలుగు సార్లు విడుదల చేయాలి.
రసాయన పద్ధతులు :
. నాటేముందు కాల్వలలో కార్బోఫ్యూరాన్ 3జి గుళికలు 15 కిలోల లేక కోరాంత్రానిలిప్రోల్ 0.4 జి 9 కిలోలు లేక పిప్రోనిల్ 0.3జి పది కిలోలు 1:2 నిష్పత్తిలో ఇసుకలో కలిపి వేసుకోవాలి.
. పురుగు ఉధృతి మధ్యస్థంగా ఉంటే క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీ లీటర్లు లేదా ఎసిఫేట్ 1.0 గ్రా. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లీటరు నీటికి కలిపి నాటిన నాలుగు నుండి 6 మరియు 9 వారాల్లో పిచికారి చేసుకోవాలి. పురుగు ఉధృతి స్థాయి తీవ్రంగా ఉంటే క్లోరాంత్రానిలిప్రోల్ 0.3 మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి నాటిన నాలుగు మరియు ఎనిమిది వారాలలో పిచికారి చేసుకోవాలి.
మధ్య సూచన :
. లింగాకర్షక బుట్టలు పురుగు రెక్కల పురుగు దశలో ఉన్నప్పుడే అమర్చుకోవాలి.
. గుడ్ల పరాన్న జీవును పురుగు గుడ్లలో ఉన్నప్పుడు ఉపయోగించాలి.
Also Read: Watermelon: పోషకాలమయం పుచ్చకాయ- ఆశించు చీడ పీడలు `సస్య రక్షణ చర్యలు.!